Cinema
oi-Kannaiah
ఒక
ఇండస్ట్రీలు
స్టార్‌డమ్‌ను
ఎంజాయ్
చేస్తూనే
మరో
ఇండస్ట్రీలో
ప్రయోగాలు
చేస్తూ
మన
వెటరన్
హీరోలు
బాగానే
సక్సెస్
అవుతున్నారు.
తమ
భాషలో
చిత్రాలు
చేస్తూనే
ఇతర
భాషల్లో
కూడా
మంచి
పాత్రలు
పోషిస్తూ
అభిమానులను
ఆకట్టుకుంటున్నారు.
ఇది
ఎక్కువగా
తమిళ
తెలుగు
చిత్ర
పరిశ్రమలో
కనిపిస్తున్న
ట్రెండ్.
ఈ
మధ్యకాలంలో
బాలీవుడ్
నటులు
కూడా
తెలుగు
తమిళ
కన్నడ
మలయాలం
వైపు
అడుగులు
వేస్తున్నారు.
తాము
చేస్తున్న
ఎక్స్‌పెరిమెంట్లు
సక్సెస్
అవడంతో
ఇతర
భాషల్లోను
కంటిన్యూ
అవుతున్నారు.
ఇప్పటి
వరకు
మరో
భాషకు
సంబంధించి
స్ట్రెయిట్
సినిమాలో
నందమూరి
బాలకృష్ణ
నటించింది
లేదు.
అయితే
తమిళ
సూపర్
స్టార్
రజినీకాంత్
నటిస్తోన్న
జైలర్
2
చిత్రంలో
నందమూరి
నటసింహం
బాలయ్య
ఓ
కీలక
పాత్ర
పోషిస్తున్నారనే
వార్త
జోరుగా
ప్రచారంలో
ఉంది.
ఇప్పుడు
ఆ
వార్తలకు
బ్రేక్
పడింది.
బాలయ్యకు
షాక్..!!
అఖండ
2
ప్రమోషన్స్‌తో
బిజీగా
ఉన్న
బాలయ్యకు
ఇది
షాకింగ్
వార్తే
అవుతుంది.
రజినీకాంత్
నటిస్తోన్న
జైలర్
2లో
నందమూరి
బాలకృష్ణ
ఒక
ప్రధాన
పాత్ర
పోషించాల్సి
ఉంది.
అయితే
ఇప్పుడు
బాలయ్య
ఆ
సినిమా
నుంచి
తప్పించేశారనే
వార్త
ప్రచారంలో
ఉంది.
కోలీవుడ్
నుంచి
అందుతున్న
సమాచారం
ప్రకారం
రజినీకాంత్
స్టారర్
జైలర్
2
నుంచి
బాలయ్య
తనకు
తానే
తప్పుకున్నాడా
లేక
తప్పించారా
అనే
చర్చ
జరుగుతోంది.
ఎందుకు
తప్పుకున్నారు
లేదా
తప్పించారనే
విషయాన్ని
మాత్రం
ఎవరూ
వెల్లడించడం
లేదు.
పైగా
బాలయ్య
కోసం
రాసుకున్న
పాత్రలో
విజయ్
సేతుపతి
నటిస్తారని
టాక్.
ఇందుకోసం
ఇప్పటికే
విజయ్
సేతుపతి
జైలర్
2
షూటింగ్‌లో
కూడా
పాల్గొన్నారట.తన
పాత్రకు
సంబంధించి
చిత్రీకరణ
జరుగుతోంది.
షూటింగ్
కొన్ని
రోజుల
పాటు
జరగనున్నట్లు
సమాచారం.
అతిథి
పాత్ర
అయినప్పటికీ
విజయ్
సేతుపతిది
మాంచి
బలమున్న
ప్రాధాన్యత
ఉన్న
పాత్రగా
చెబుతున్నారు.
ఇదిలా
ఉంటే
రజినీకాంత్‌తో
విజయసేతుపతి
జత
కట్టడం
ఇది
రెండో
సారి
అవుతుంది.
2019లో
కార్తీక్
సుబ్బరాజు
డైరెక్ట్
చేసిన
పెట్టా
చిత్రంలో
నటించి
రజినీతో
స్క్రీన్
షేర్
చేసుకున్నారు
సేతుపతి.
అందులో
విలన్
పాత్రలో
విజయ్
కనిపించారు.
వేసవిలో
రిలీజ్
ఇక
జైలర్-2
విషయానికొస్తే
నెల్సన్
దిలీప్‌కుమార్
డైరెక్ట్
చేస్తున్న
ఈ
చిత్రం
షూటింగ్
వచ్చే
ఏడాది
ఫిబ్రవరిలో
చిత్రీకరణ
పూర్తి
చేసుకుంటుందని
చిత్ర
యూనిట్
పేర్కొంది.
వేసవికాలంలో
జైలర్-2ను
ప్రేక్షకులు
ముందుకు
తీసుకొచ్చేందుకు
సన్నాహాలు
జరుగుతున్నాయి.
అయితే
విడదుల
తేదీపై
మూవీ
మేకర్స్
ఎలాంటి
అధికార
ప్రకటన
చేయలేదు.
2023లో
విడుదలై
బాక్సాఫీస్
వద్ద
బ్లాక్‌బస్టర్
హిట్
కొట్టిన
జైలర్‌కు
సీక్వెల్‌గా
జైలర్
2
చిత్రం
రాబోతోంది.
తొలి
భాగం
ఎక్కడైతే
ముగించారో
అక్కడి
నుంచి
రెండో
భాగం
కంటిన్యూ
అవుతుంది.
ఇక
జైలర్
2లో
అలనాటి
బాలీవుడ్
స్టార్
మిథున్
చక్రవర్తి,
విద్యాబాలన్‌లు
కూడా
నటిస్తున్నారు.
ఇదిలా
ఉంటే
రజినీకాంత్
నటించి
చివరి
చిత్రం
లోకేష్
కనగరాజ్
డైరెక్షన్‌లోని
కూలీ
చిత్రం.
అది
బాక్సాఫీస్
వద్ద
బోల్తా
కొట్టింది.
ఇక
జైలర్
2పై
ఇటు
చిత్ర
యూనిట్
అటు
రజినీ
ఫ్యాన్స్
భారీ
ఆశలు
పెట్టుకున్నారు.
దీని
తర్వాత
తలైవర్
కమల్
హాసన్
ప్రొడక్షన్
హౌజ్‌లో
ఓ
చిత్రం
చేయనున్నట్లు
కోలీవుడ్
టాక్.


