. . .

శ‌బ‌రిమ‌ల వెళ్లేవారికి శుభ‌వార్త‌… నంద్యాల మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్లు..

<!-- --> శ‌బ‌రిమ‌ల వెళ్లే అయ్య‌ప్ప భ‌క్తులకు రైల్వేశాఖ ఓ శుభ‌వార్త‌ను అందించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించింది. అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు త‌ర‌లి వెళ్తుంటారు. అయితే, చాలామంది శబరిమల వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలపై ఆధార‌ప‌డుతున్నారు. ఫలితంగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో భ‌క్తుల నుంచి శ‌బ‌రిమ‌ల‌కు సరైన రవాణా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌పై తాజాగా రైల్వే శాఖ కీలకమైన‌ ప్రకటనను జారీ చేసింది. 4 స్పెష‌ల్ ట్రైన్స్‌.. నంద్యాల జిల్లాలో దీక్ష చేస్తున్న అయ్యప్ప భక్తులంద‌రికీ రైల్వే శాఖ ఓ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింద‌ని, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప దీక్షా భక్తుల సౌకర్యార్థం, నంద్యాల మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. వారి డిమాండ్ మేర‌కు స్పెష‌ల్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆమె వివ‌రించారు. ఇక‌, ఈ స్పెష‌ల్ ట్రైన్స్ నవంబర్ మొదటి వారం నుంచి నంద్యాల మీదుగా శబరిమలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఈ ట్రైన్స్‌తో పాటు భారత్ గౌరవ్ పేరుతో శబరిమలకు రైల్వే శాఖ మ‌రో స్పెష‌ల్ ట్రైన్‌ను నడుపుతోంది. ఇందులో మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ ట్రైన్ ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానుంది. ఈ ప్ర‌త్యేక రైలు నవంబర్ 16వ తేదిన సికింద్రాబాద్‌లో బయలుదేరుతోంది. ఈ ట్రైన్ పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుకుంటుంద‌ని అధికారులు తెలిపారు. తిరిగి ఈ ట్రైన్ వ‌చ్చే నెల 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది. స్పెష‌ల్ ట్రైన్స్ పూర్తి వివ‌రాలు.. ఈ ట్రైన్‌లో టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమా అన్నీ వ‌ర్తిస్తాయి. ఇక‌, వీటి టికెట్ ధరల విష‌యానికొస్తే.. ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475 చెల్లించాల్సి ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో అయితే, రూ.18,790 చెల్లించాలి. సెకెండ్ ఏసీలో రూ.24,215 చెల్లించాల్సి ఉంటుంది. శ‌బ‌రిమ‌ల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉన్న‌ట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు స్పెష‌ల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమల‌ను ద‌ర్శించుకునేందుకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల చివ‌రి వారం నుంచి డిసెంబర్, జనవరి నెలలో ప‌లు ప్ర‌త్యేక ట్రైన్స్‌ను నడిపే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ...

విజ‌య‌వాడ టు శ్రీ‌శైలం మ‌ధ్య సీ ప్లేన్ స‌ర్వీసులకు ముహుర్తం ఖ‌రారు..

<!-- --> విజయవాడ వాసులు ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్న సీ ప్లేన్ సర్వీసులకు ఎట్ట‌కేల‌కు ముహుర్తం ఖరారైంది. ఇందులో భాగంగానే కృష్ణాన‌దిలో సీ ప్లేన్ స‌ర్వీసులు అతి త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరంలో సీ ప్లేన్‌ సర్వీసుల్ని ప్రారంభిస్తున్న‌ట్లు గ‌తంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించ‌నుంది. 2019లోనే.. కేంద్ర ప్రభుత్వం గ‌తంలో ప్రకాశం బ్యారేజీ ఎగువున సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు అనుమతులిచ్చింది. అయితే, అవి కార్య‌రూపం దాల్చలేదు. తాజాగా వీటి అమ‌లుకు ఏపీ ప్ర‌భుత్వం ముహుర్తం ఖారురు చేసింది. డిసెంబ‌ర్ 9వ తేది నుంచి కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2019లోనే కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్ప‌డు సీప్లేన్ సర్వీసుల్ని ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏపీ టూరిజం శాఖ సిద్ధ‌మైంది. డిసెంబ‌ర్ 9న ప్రారంభం.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మ‌రో సారి ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. ప్రకాశం బ్యారేజీలో మళ్లీ సీ ప్లేన్‌ అంశం బ‌య‌టికొచ్చింది. విజయవాడ నుంచి శ్రీశైలం క్షేత్రానికి తొలి సీప్లేన్ స‌ర్వీసుల‌ను తీసుకరానున్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 9వ తేది నుంచి ఈ స‌ర్వీసులను ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో ఈ సర్వీసులను విస్తరించనున్న‌ట్లు స‌మాచారం. ప్రకాశం బ్యారేజీ ఎగువున విస్తరించిన కృష్ణా జలాల్లో సీ ప్లేన్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వాటర్‌ ఏరోడ్రమ్ ఏర్పాటు.....

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌..

An important note for the train passengers in AP... The Railway Department has decided to run two special trains through Andhra Pradesh to clear...

ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. శంషాబాద్ టు వైజాగ్‌.. నాలుగు గంట‌లే ప్ర‌యాణం..

<!-- --> ప్ర‌యాణికుల‌కు శుభవార్త‌. ఇక‌నుంచి శంషాబాద్ టు వైజాగ్‌కు కేవ‌లం నాలుగు గంట‌ల్లోనే చేరుకోవ‌చ్చు. సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ ట్రైన్ గంట‌ల‌కు 220 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లుతోంది. సెమీ హైస్పీడ్ ట్రైన్ విజ‌య‌వాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం ప‌న్నెండు స్టేష‌న్లు ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. స‌ర్వే చివ‌రి ద‌శ‌కు చేరగా న‌వంబ‌ర్‌లో రైల్వేబోర్డుకు స‌మ‌ర్పించ‌నున్నారు. దీంతో పాటు వైజాగ్ నుంచి సూర్య‌పేట, న‌ల్గొండ‌, క‌ల్వ‌కుర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్ మీదుగా క‌ర్నూలుకు మ‌రో కారిడార్‌ను నిర్మించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. 220 కిలో మీటర్ల వేగంతో... రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్ ఇదే కావ‌డం విశేషం. ఈ రూట్‌లో శంషాబాద్, రాజమండ్రి ఎయిర్ పోర్టులను అనుసంధానించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు త్వ‌ర‌తగ‌తిన చేరుకునేలా రైల్వేశాఖ అధికారులు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ఈ ట్రైన్స్ ప్రయాణించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గ‌నుక పూర్తైతే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ‌ప‌ట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు ప‌న్నెండు గంటల సమయం పడుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అదే, వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో అయితే, 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటున్నారు. రెండు మార్గాల్లో .. సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌కు ప్రస్తుతం రెండు మార్గాల్లో ట్రైన్స్ న‌డుస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం కాగా, రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాల్లో ప్ర‌యాణిస్తోంది. ఈ రూట్ల‌లో ట్రైన్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలోమీట‌ర్లు మాత్ర‌మే ఉంది. ఈ రెండింటితో పోలిస్తే ఇప్ప‌డు కొత్తగా రానున్న శంషాబాద్ టు విశాఖపట్నం మార్గం ప్ర‌యాణికుల‌కు మ‌రింత దగ్గరవుతుంది. ఈ మార్గంలో ప్రయాణ సమయం సగానికంటే తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. ...

ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌.. సోమశిల – శ్రీశైలం, సాగర్ – శ్రీశైలం మ‌ధ్య క్రూయిజ్ జ‌ర్నీ..

<!-- --> పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ ఓ శుభ‌వార్త‌ను అందించింది. క్రూయిజ్ టూర్ ప్యాకేజీలకు సంబంధించి ఓ కీల‌క‌మైన స‌మ‌చారాన్ని అందించింది. ఇందులో భాగంగా టూరిస్టుల కోసం ఒకేసారి రెండు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల టు శ్రీశైలం, సాగర్ టు శ్రీశైలం మధ్య రెండు టూర్ ప్యాకేజీల‌ను ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం.. వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ టూర్‌.. వారాంతంలో హైదరాబాద్ నగరానికి స‌మీపంలో ఉండే టూరిస్టు ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ఒక‌టి కాదు.. ఏకంగా రెండు ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించింది. ప‌ట్ట‌ణానికి ద‌గ్గ‌ర‌గా ఉండే టూరిస్టు స్పాట్‌లలో ఒక‌టి సోమ‌శిల‌. ఇది తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుగాంచింది. ఇది నగరానికి సుమారు 200 కిలోమీట‌ర్ల‌లోపే ఉంటుంది. ఇక‌, ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇలాంటి వారికోసమే తెలంగాణ టూరిజం స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సోమశిల టు శ్రీశైలం, సాగర్ టు శ్రీశైలం మధ్య క్రూయిజ్ ప్ర‌యాణం ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ టూర్‌ను కూడా ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అతి త‌క్కువ ధ‌ర‌కే... సోమ‌శిల టు శ్రీ‌శైలం టు సోమ‌శిలకు ప్ర‌యాణం ఈ నెల (అక్టోబర్) 26న ప్రారంభం కానుంది. దీంతోపాటు నాగార్జున సాగర్ - శ్రీశైలం - నాగార్జున సాగర్ మధ్య కూడా మరో క్రూయిజ్ టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ప‌ర్యాట‌కుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ నవంబర్ 2న పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఇక వీటి ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరల్లో పెద్దలకు రూ. 2 వేలు చెల్లించాల్సింది. అదే పిల్లలకయితే రూ. 1600గా నిర్ణ‌యించారు. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరల్లో పెద్దలకు రూ. 3 వేలు చెల్లించాల్సింది. అదే పిల్లలకు రూ. 2,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలంటే తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/ స‌ంప్ర‌దించాల్సి ఉంటుంది. ...

Popular

Subscribe

spot_imgspot_img