. . .

త్వ‌ర‌లో హైద‌రాబాద్ -వ‌రంగ‌ల్ మ‌ధ్య న‌డ‌వునున్న ఎల‌క్ట్రిక్ బ‌స్సులు..

<!-- --> ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్‌టీసీ ఓ శుభవార్త‌ను అందించింది. హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్‌కు త్వ‌ర‌లో 82 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా విస్తరిస్తోంది వరంగల్‌. ఇక‌, ఈ ప‌ట్ట‌ణానికి ఆర్‌టీసీ భారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించారు. త్వరలోనే ఈ బస్సులు రాకపోకలు సాగించ‌నున్నాయి. ఈ 82 ఎల‌క్ర్టిక్ బ‌స్సులను దశలవారీగా న‌డ‌ప‌నున్నారు. వరంగల్‌-హైదరాబాద్‌ మధ్య న‌డిచే ఈ బ‌స్సుల్లో ఎలక్ట్రిక్‌ సూపర్‌ లగ్జరీ 18 ఉండ‌గా, డీలక్స్ బ‌స్సులు 14, సెమీ డీలక్స్ బ‌స్సులు 21, ఎక్స్‌ప్రెస్ బ‌స్సులు 29 ఉన్నాయి. జేబీఎం సంస్థ.. ఇక‌, ఈ ఎల‌క్ర్టిక్ బ‌స్సుల‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొద‌టిసారి ఒలెక్ట్రా కంపెనీ బ్యాటరీ బస్సులను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంస్థ రెండు పర్యాయాలు బస్సులను సరఫరా చేసింది. అయితే, మూడో ప్రయత్నంలో మాత్రం ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ ఈ టెండర్‌ దక్కించుకుంది. ఇప్ప‌డు కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో 82 ఎల‌క్ర్టిక్ బ‌స్సుల‌ను న‌డుపనున్నారు. అయితే, ఇటీవ‌లే ఆర్‌టీసీ కొన్ని ఎలక్ట్రిక్ బ‌స్సుల‌ను క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. కానీ, రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద న‌గ‌రంగా విస్త‌రిస్తోన్న వ‌రంగ‌ల్‌కు ఎక్కువ బ‌స్సులు కేటాయించారు. 82 ఎల‌క్ట్రిక్ బస్సులు.. వ‌రంగ‌ల్ జనాభా, విస్తీర్ణం పరంగా పెద్ద పట్టణంగా మారింది. అందుకే వరంగల్‌కు ఎక్కువ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 82 ఎల‌క్ట్రిక్ బస్సులను కేటాయించారు. వీటిని వరంగల్‌-2 డిపో ఆధ్వర్యంలో నడపనున్నారు. హైదరాబాద్ టు వరంగల్‌ మధ్య బస్సులు ఎక్కువగా న‌డుస్తాయి. నిత్యం ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు ప్రాంతాల మధ్య అదనంగా కొత్త బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. జేబీఎం సంస్థ బ‌స్సుల‌ను సరఫరా చేసేవరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతున్నారు. ...

ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ప‌లు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స‌మ‌యాల్లో మార్పులు..

<!-- --> ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌లు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల స‌మయాల వేళ‌ల‌ను మార్చింది. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు గ‌మ‌నించ‌వ‌ల‌సిందిగా రైల్వేశాఖ కోరింది. మూడు రైళ్ల ప్రయాణ స‌మ‌య‌వేళ‌ల‌ను మార్చిన‌ట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ఇందులో లింగ‌ంప‌ల్లి టు తిరుప‌తి వ‌ర‌కు ప్ర‌యాణించే నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ టు తిరుప‌తి వ‌రకు ప్రయాణించే ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్ టు గూడురు ప్ర‌యాణించే సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళ‌ల‌ను మార్చిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక‌, ఈ మార్పును గ‌మ‌నించాలని ప్రయాణికులను కోరింది. వీటి పూర్తి వివ‌రాల‌ను ఓసారి చూద్దాం.. నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్ .. 12734 అనే నెంబ‌ర్‌గ‌ల లింగ‌ంప‌ల్లి నుంచి తిరుప‌తి వ‌ర‌కు ప్ర‌యాణించే నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళ‌ల్లో ప‌లు మార్పులు చేశారు. ఈ ట్రైన్ లింగ‌ంప‌ల్లిలో సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, సికింద్రాబాద్ స్టేష‌న్‌కు కు సాయంత్రం 6.05 గంట‌ల‌కు చేరుకుంటుంది. అక్క‌డి నుండి న‌డికుడిరి రాత్రి 8.34 గంట‌ల‌కు, పిడుగురాళ్లకు రాత్రి 8.54 గంట‌ల‌కు, స‌త్తెన‌ప‌ల్లికి రాత్రి 9.22 గంట‌ల‌కు, గుంటూరుకు రాత్రి 10.55 గంట‌ల‌కు చేరుకుంటుంది. తెనాలికి రాత్రి 11.38 గంట‌ల‌కు చేరుకోగా, బాప‌ట్ల స్టేష‌న్‌కు అర్ధరాత్రి 12.14 గంట‌ల‌కు చేరుకుంటుంది. అదే చీరాలక‌యితే అర్ధరాత్రి 12.29 గంట‌ల‌కు, ఒంగోలుకు అర్ధరాత్రి 1.13 గంట‌ల‌కు, సింగ‌రాయ‌కొండకు అర్ధరాత్రి 1.34 గంట‌ల‌కు, కావ‌లికి అర్ధరాత్రి 2.04 గంట‌ల‌కు, నెల్లూరుకు అర్ధరాత్రి 2.28 గంట‌ల‌కు చేరుకుంటుంది. గూడురుకు తెల్లవారుజామున 3.34 గంట‌ల‌కు, వెంక‌ట‌గిరికి తెల్లవారుజామున 4.18 గంట‌ల‌కు, శ్రీ‌కాళ‌హ‌స్తికి తెల్లవారుజామున 4.38 గంట‌ల‌కు, రేణిగుంటకు తెల్లవారుజామున 5.08 గంట‌ల‌కు, తిరుప‌తి స్టేష‌న్‌కు ఉదయం 5.55 గంట‌ల‌కు చేరుకుంటుంది. ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్... ఇక‌, 12764 అనే నెంబ‌ర్‌గ‌ల సికింద్రాబాద్ టు తిరుప‌తి ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణించే వేళ‌ల్లో కూడా మార్పులు చేశారు. ఈ ట్రైన్ తెల్లవారుజామున 4.19 గంట‌ల‌కు గూడురుకు, ఆ త‌ర్వాత ఉద‌యం 5.09 గంట‌ల‌కు వెంక‌ట‌గిరికి, శ్రీ‌కాళ‌హ‌స్తి ఉద‌యం న 5.29 గంట‌ల‌కు చేరుకుంటుంది. ఉద‌యం 5.58 గంట‌ల‌కు రేణిగుంటకు, తిరుప‌తి స్టేష‌న్‌కు ఉద‌యం 6.55 గంట‌ల‌కు చేరుకుంటుంది. ఆ ర‌కంగా స‌మ‌య‌వేళల్లో మార్పులు తీసుకొచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు గూడురు మ‌ధ్య ఎటువంటి మార్పు లేద‌ని సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారులు వివ‌రించారు. ...

టికెట్ బుకింగ్‌లో మార్పులు.. రైల్వే ముంద‌స్తు ​రిజర్వేషన్ టైమ్​ ఇక‌నుంచి 60 రోజులే..

<!-- --> దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. నిత్యం లక్షలాదిమంది ప్ర‌యాణికులు రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ప్రతి సంవ‌త్స‌రం రైల్వేలో 30 నుంచి 35కోట్ల మంది ప్ర‌యాణికులు ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే, రైల్వేలో టికెట్‌ ధర తక్కువ, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది రైలు ప్రయాణానికే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. అంతేకాదు, దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా ముందస్తుగా టికెట్లను రిజర్వేషన్‌ చేసుకుంటూ ప్ర‌యాణం సాగిస్తుంటారు. అలాంటి ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వేశాఖ షాకిచ్చింది. రైల్వే టికెట్ ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ రూల్స్లో భారతీయ రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. రైల్వే టికెట్ల ముంద‌స్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఇక‌నుంచి 60 రోజుల ముందు నుంచి మాత్రమే ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం క‌ల్పించింది. భార‌తీయ రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వ‌చ్చే (నవంబర్) నెల 1వ తేది నుంచి అమల్లోకి రానుంది. ఇత‌ర సైట్లు.. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఐఆర్‌సిటిసీ కీల‌క మార్పులు చేసింది. ఇది నవంబర్ ఒక‌టో తేది నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు ఈ నిబంధన వర్తించదన్న విషయాన్ని రైల్వేశాఖ తెలిపింది. రైల్వే టికెట్లను ఆన్‌‌లైన్‌‌లో బుక్‌‌ చేసుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఐఆర్‌‌సీటీసీ. ఇత‌ర చాలా సైట్లు రైల్వే టికెట్ల బుకింగ్‌‌ సేవలను అందిస్తున్నా, చివరికి అవి ఐఆర్‌‌సీటీసీ సర్వ‌ర్‌ ద్వారానే బుక్ చేస్తాయి. రైల్వే టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని రైల్వేశాఖ త‌గ్గించింది. నవంబర్ 1వ తేది నుంచి ఈ నిబంధ‌న అమ‌ల్లోకి వ‌స్తుంది. వారికి వ‌ర్తించ‌దు.. అయితే, ఈ నిబంధన నవంబర్1 నుంచి అమల్లోకి వస్తున్నందున, అక్టోబ‌ర్ 31వ‌ర‌కు 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే 120 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని బుక్ చేసుకున్నవారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి బుకింగ్ రద్దు చేయడం జరగదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వారు తమ బుకింగ్ ప్రకారం ప్రయాణాలు చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది. ...

తిరుమ‌ల వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. జ‌న‌వ‌రి నెల శ్రీ‌వారి కోటా ట‌క్కెట్ల తేదీలు విడుద‌ల‌..

<!-- --> తిరుమల వెళ్లే శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. జ‌న‌వ‌రి (2025) నెల స్వామివారి ఆర్జీత సేవా, వర్చువల్, అంగప్రదక్షిణం సహా ఇతర దర్శనం, గదుల బుకింగ్ టికెట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేశారు. అక్టోబర్ 19వ తేది నుంచి 24వ తేదీ వరకు ఈ కోటా టిక్కెట్ల‌ను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేర‌కు ఈ నెల (అక్టోబర్) 19వ తేదిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా ఆన్ లైన్ టికెట్లకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నెల కోటాను ఈనెల 19వ తేదిన ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల (అక్టోబరు) 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎల‌క్ర్టానిక్ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 21వ తేది నుంచి 23వ తేదీ వ‌ర‌కు మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూర‌వుతాయ‌ని వివ‌రించారు. వీటితోపాటు తిరుమ‌ల స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల (అక్టోబర్) 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆల‌య అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 22న.. శ్రీ‌వారి జ‌న‌వ‌రి నెల‌కోటాకు సంబంధించి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టిక్కెట్ల‌ను ఈ నెల (అక్టోబరు) 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. వీటితోపాటు 2025 జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్లు.. తిరుమ‌ల స్వామివారి శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల (అక్టోబరు) 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల స్వామివారిని ద‌ర్శ‌నం కోసం జనవరి నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ...

రోగుల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్‌.. ట్రైన్ టిక్కెట్స్‌పై ప్రత్యేక రాయితీలు..

<!-- --> ఇండియ‌న్ రైల్వే ప్ర‌యాణికుల కోసం ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌రికొత్త ప్యాకేజీల‌ను, రాయితీల‌ను అందిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైలు మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఈ మార్గం ద్వారానే తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఎందుకంటే, ఇండియ‌న్ రైల్వే ఎంతో సుఖ‌వంత‌మైన, సుర‌క్షిత‌మైన, చౌకైన ప్ర‌యాణ సౌక‌ర్యాన్నీ ప్ర‌యాణికుల‌కు అందిస్తోంది. దీని కారణంగానే చాలామంది రోడ్డు రవాణా కంటే రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఎక్కువ ఆసక్తి క‌న‌బ‌రుస్తుంటారు. రైళ్ళు రోడ్డు రవాణా కంటే త్వరితంగా ప్ర‌యాణికుల‌ను వారి గమ్య స్థానాలకు చేరుస్తాయి. అయితే, రైలు మార్గాల్లో ప్ర‌త్యేక రాయితీలు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు కూడా రాయితీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు అనారోగ్యంతో (రోగులకు) బాధ‌ప‌డేవారికి కూడా ప్రత్యేక రాయితీల‌ను రైల్వే ఇచ్చింది. వాటి వివ‌రాలేంటో చూసేద్దాం. ట్రైన్ టిక్కెట్స్‌పై రాయితీలు.. భార‌తదేశంలో నిత్యం లక్షల సంఖ్యలో ప్ర‌యాణికుల‌కు రైలు మార్గాల ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. భారతీయ రైల్వే ప్రయాణించే అనేక వర్గాల ప్రయాణికులకు స్పెష‌ల్ డిస్కౌంట్‌ల‌ను కూడా క‌ల్పిస్తోంది. ఇక‌, ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ కు మహిళలకు 50శాతం రాయితీ క‌ల్పించగా, పురుషులకు 40 శాతం రాయితీ కల్పించి సగం టికెట్ ధరనే తీసుకుంటుంది. అనారోగ్యంతో బాధపడే ప్రయాణికుల కోసం కూడా భారతీయ రైల్వే ప్ర‌త్యేక రాయితీల‌ను ఇచ్చింది. ఎయిడ్స్ రోగుల‌కు.. ఇందులో భాగంగానే రైల్వేశాఖ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ లో ప్రయాణం చేసే ఎయిడ్స్ రోగుల‌కు 50 శాతం రాయితీ ఇస్తుంది. ఎయిడ్స్ రోగులకు సెకండ్ క్లాస్ లో 50శాతం రాయితీ ఇస్తుంది. ఇక‌, టీబీ మరియు లూపాస్ వల్గారిస్ తో బాధపడే వారికి కూడా సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ మరియు ఫస్ట్ క్లాస్ లో 75 శాతం తగ్గింపు ఇస్తుంది. ...

Popular

Subscribe

spot_imgspot_img