. . .

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు శుభవార్త‌.. శ‌బ‌రిమ‌ల‌కు స్పెష‌ల్ బ‌స్సులు..

<!-- --> శ‌బ‌రిమ‌ల వెళ్లే అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త అందించింది. శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులను భ‌క్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేర‌కు ఏపీఎస్ఆర్‌సిటిసి మూడు ర‌కాల ప్యాకేజీల‌ను నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే 5, 6, 7 రోజుల ప్యాకేజీల‌ను ప్రకటించింది.ఈ ప్యాకేజీలో ఇంద్ర‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ, అల్ట్రా డీల‌క్స్ బ‌స్సుల‌ు ఉన్నాయి. ఆ ప్యాకేజీ వివరాలేంటో చూసేద్దాం.. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీలు విశాఖపట్నం రీజియన్ విశాఖపట్నం నుండి శబరిమల వరకు ఉంటాయి. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆర్‌టీసీ విశాఖ‌ప‌ట్నం నుంచి శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌, ఈ ఏడాది కూడా మూడు ర‌కాల ప్యాకేజీలను ఆర్‌టిసి భ‌క్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆయా ప్యాకేజీల‌ను బ‌ట్టీ బ‌స్సులు ప్ర‌యాణించే మార్గంలో ఉన్న ఆలయాల సంద‌ర్శ‌న‌లో వ్యత్యాసం ఉంటుంది. భక్తులు సందర్శించడానికి ఎంచుకున్న దేవాలయాల ఆధారంగా వారి అవసరాలను తీర్చేందుకు ఈ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్‌టిసీ అందిస్తోన్నప్యాకేజీ వివ‌రాలివే.. ఐదు రోజుల ప్యాకేజీ.. ఏపీఎస్ఆర్‌టిసీ అందిస్తోన్న ఐదు రోజుల టూర్ ప్యాకేజీలో విజయవాడ, మేల్మరువాటూరు, ఎరుమేలి, పంబ మీదుగా ప్ర‌యాణం చేసి సన్నిధానం చేరుకుంటుంది. ఇక‌, తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడలను ఈ ప్యాకేజీ కవర్ చేస్తుంది. ఈ ప్యాకేజీలో ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ.6,600 (సూపర్ లగ్జరీ) చెల్లించాల్సి ఉంటుంది. అదే అల్ట్రా డీలక్స్ అయితే రూ. 6,600 చెల్లించాలి. ఇంద్ర అయితే రూ.8,500 గా నిర్ణ‌యించారు. ఆరురోజుల ప్యాకేజీ.. ఆర్‌టిసీ అందిస్తోన్న ఆరు రోజుల టూర్ ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా శ‌బ‌రిమ‌ల చేరుకుంటారు. ఇక‌, తిరుగు ప్ర‌యాణంలో తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం ఆలయాల ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్క‌రికి టిక్కెట్ ధ‌ర రూ. 7,000 (సూపర్ లగ్జరీ), ఉంటుంది. అదే అల్ట్రా డీల‌క్స్ అయితే రూ. 7,000 చెల్లించాలి. ఇంద్ర అయితే రూ. 9,000 ఉంటుంది....

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. దీపావ‌ళికి ప్ర‌త్యేక రైళ్లు..

<!-- --> దేశంలో అత్య‌ధిక శాతం జ‌నాభా ఎంచుకునే ప్ర‌యాణం రైలుమార్గం. ఈ ప్ర‌యాణం ఎంతో సౌక‌ర్య‌వంతంతో కూడుకున్న‌ది. అలాగే, అత్యంత చౌకైన‌ది కూడా. అందుకే ఎక్కువ శాతం మంది రైలు మార్గాలనే ఎంపిక చేసుకుంటారు. సాధార‌ణ రోజుల్లోనే రైలు ప్ర‌యాణాలు చేయాలంటే రిజ‌ర్వేష‌న్ త‌ప్పనిస‌రిగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే, అంత ర‌ద్దీగా ఉంటుంది కాబ‌ట్టి. అలాంటిది పండుగ సీజ‌న్‌ల‌లో రైలు ప్ర‌యాణాలంటే.. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం ఉంటారు. ఈ ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకునే రైల్వేశాఖ ప్ర‌త్యేక సంద‌ర్భాల‌ల్లో, పండుగ వేళ స్పెష‌ల్ ట్రైన్స్‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు రైల్వేశాఖ ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ట్రైన్స్‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ప‌లు ప్ర‌త్యేక రైళ్లను న‌డిపేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఇందులో భాగంగానే ఈ స్పెష‌ల్ ట్రైన్స్ అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా న‌డ‌వ‌నున్నాయి. రండి వాటి వివ‌రాల‌ను చూసేద్దాం.. రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌.. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ‌ బెంగళూరు,కలబురగి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఇందులో భాగంగా వెస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో స్పెష‌ల్ ట్రైన్స్‌ను ప్రకటించారు. 06533 అనే నెంబ‌ర్‌గ‌ల ఎస్ఎంవీటీ బెంగళూరు-కలబురగి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల (అక్టోబర్) 30, వ‌చ్చే నెల (నవంబర్) 2 తేదీలలో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్ బెంగళూరులోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం 7.40 గంటలకు కలబురగి చేరుకుంటుంది. 06534 అనే నెంబ‌ర్‌గ‌ల కలబురగి-ఎస్ఎంవీటీ బెంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ నెల (అక్టోబర్) 31, వ‌చ్చే నెల (నవంబర్) 3 తేదీలలో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ప్ర‌త్యేక రైలు కలబురగి స్టేషన్ నుంచి ఉదయం 9.35 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) బెంగళూరు స్టేషన్‌కు చేరుకుంటుంది. అద‌న‌పు కోచ్‌లు.....

తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. ఆ ప్రాంతాల‌కు అనుమ‌తి లేదు..

<!-- --> క‌ళియుగ ప్ర‌త్యక్ష దైవ‌మైన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు నిత్యం త‌ర‌లి వెళ్తుంటారు. అయితే, తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు ఓ ముఖ్య గ‌మ‌నిక‌..బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో రెండు రోజులుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ‌ర్షాకు తిరుమల ఘాట్ రోడ్డులోని కొండ చరియలు నేటి ఉద‌యం విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి దగ్గర కూడా కొండచ‌రియ‌లు విరిగిపడ్డాయి. అయితే, ఆ స‌మ‌యంలో అక్క‌డ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే, వెంట‌నే అప్రమత్తమైన ఆల‌య‌ అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఘాట్‌రోడ్డుపై ప‌డి ఉన్న బండ‌రాళ్ల‌ను జేసీబీల సాయంతో తొలగించారు. ప‌లు ద‌ర్శ‌నాలు ర‌ద్దు.. నేడు (బుధవారం) అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్ర‌మంలో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీటితోపాటు తిరుమలకు ఘాట్‌ రోడ్డులో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే టీటీడీ కొండపై పలు ప్రాంతాలకు భక్తుల్ని అనుమతించడం లేదని వివ‌రించారు. తిరుమల ఘాట్ రోడ్లలో విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌ల‌ను తొల‌గించేందుకు జేసీబీలు, ట్రక్కులు, అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. అయితే, ఈ వర్షాలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టేవ‌ర‌కు భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో ఉత్త‌మం అని టీటీడీ ఆల‌య అధికారులు పేర్కొన్నారు. తిరుమలతో పాటుగా శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి కూడా భక్తులను అనుమతించడం లేదు. రన్‌వేపైకి నీరు.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమ‌ల ఘాట్‌రోడ్డులోని కొండ చరియలు విరిగిపడే అవకాశముందని టీటీడీ ముందుగానే భావించింది. అయితే, ఆ క్రమంలోనే అన్ని విభాగాలను టీటీడీ అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండ‌గా, తిరుమల కొండల నుంచి వస్తున్న నీటితో స‌మీపంలోని కాలనీల్లోకి వర్ష‌పు నీరు వచ్చి చేరుతోంది. ప‌ట్ట‌ణంలోని రాజీవ్‌గాంధీ కాలనీ, ఆటోనగర్‌, కొరమీనుగుంటలో వరద నీరు వచ్చి చేరుతోంది. వీటితోపాటు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర కూడా సీత కాల్వ కాజ్‌వేపై వరద అత్యంత ప్ర‌మాద‌కరంగా ప్రవహిస్తోంది. ఇక్క‌డ కురుస్తున్న భారీ వర్షాలకు రేణిగుంట రన్‌వేపైకి నీరు చేరాయి. దీంతో ఇండిగో విమానానికి ల్యాండింగ్‌ సమస్య వ‌చ్చింది. వెంట‌నే ఫ్లైట్‌ను చెన్నైకి దారి మళ్లించారు. ఇక‌, ఈ ఫ్లైట్ హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు రావాల్సి ఉంది. ...

ఏపీకి మ‌రో తుపాను గండం.. మూడు రోజులపాటు భారీ వ‌ర్షాలు!

<!-- --> బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ అల్పపీడనం ప్ర‌భావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతోంద‌ని, ఇది బంగాళాఖాతంలో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. ఏపీలో ఈ అల్పపీడనం కార‌ణంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు పేర్కొంది. ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. బుధ‌వారం నాటికి తుపానుగా.. ఈ అల్ప‌పీడం బుధవారం నాటికి తుపానుగా మారి, 17వ తేదీన చెన్నై సమీపంలో తీరం దాటే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారుల అంచనా. దీంతో ఇప్ప‌టికే, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడపతోపాటు అన్నమయ్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే, నెల్లూరు జిల్లాలోని కావలిలో 15 సెం.మీ, అద్దంకి (బాపట్ల) 14 సెం.మీ, కందుకూరు (నెల్లూరు) 12 సెం.మీ, యానాం 9 సెం.మీ, ఆత్మకూరు (నెల్లూరు) 8 సెం.మీ, కోస్తాలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాయలసీమ ప్రాంతం వైఎస్ఆర్ కడప జిల్లా కోడూరులో 10 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటలో 7 సెంటీమీటర్లు, గూడూరులో (తిరుపతిలో) 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 55 కి.మీ వేగంతో గాలులు.. నేడు (అక్టోబ‌ర్ 15) పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) పేర్కొంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. అలాగే, తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కూర్మనాధ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, మత్స్యకారులు సముద్రంలోకి వేట‌కు వెళ్లొద్ద‌ని తెలిపారు. ...

ఇంద్ర‌కీలాద్రీపై ముగిసిన న‌వరాత్రి ఉత్స‌వాలు.. హుండీకీ భారీ ఆదాయం..

<!-- --> ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం ఒక‌టి. ఇక్క‌డ ద‌స‌రా ఉత్స‌వాలు ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. అయితే, ఇంద్ర‌కీలాద్రీపై ద‌స‌రా ఉత్స‌వాలు ముగిసాయి. ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా చివ‌రి రెండురోజులు క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. శుక్ర‌వారం అమ్మ‌వారి ఆల‌య హుండీకి భారీ ఆదాయం స‌మ‌కూరింది. ఒక్క‌రోజే అమ్మ‌వారి హుండీకి భారీ ఆదాయం స‌మ‌కూరినట్లు ఆల‌య అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ.84లక్షలకుపైగా ఆదాయం వచ్చిన‌ట్లు పేర్కొన్నారు. దర్శన టికెట్లు, లడ్డూల విక్రయం, సేవల టికెట్లు కలిపి ఈ ఆదాయం వచ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. ఒక్క‌రోజే ఏకంగా.. ఒక్క‌రోజే ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చిన‌ట్లు వివ‌రించారు. అలాగే 1,847 మంది భ‌క్తులు రూ. 300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100 ఆదాయం స‌మ‌కూరింది. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన భ‌క్తులు 4,686 మంది దర్శించుకున్నారు. రూ. 100 టిక్కెట్ కొనుగోలుతో రూ. 46, 86,000 ఆదాయం సమకూరినట్లు ఆల‌య అధికారులు వివ‌రించారు. అలాగే, మొత్తం 26,584 లడ్డూలను విక్రయించారు. ఇవి మొత్తం రూ.3,98,760 ఆదాయం స‌మ‌కూరింది. రూ.100 చొప్పున మొత్తం ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 ఆదాయం సమకూరిన‌ట్లు తెలిపారు. అయితే ఆలయంలో మొత్తం 2,64,396 లడ్డూలను విక్రయించిన‌ట్లు అధికారులు వివ‌రించారు. మొక్కుల రూపంలో.. వీటితో పాటు అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తులు ప‌రోక్ష ప్ర‌త్యేక కుంకుమార్చ‌నుకు రూ. 3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేయ‌గా, రూ.54వేల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. ఇక‌, ప‌రోక్ష ప్ర‌త్యేక చండీ హోమానికి నాలుగువేల రూపాయ‌ల టిక్కెట్ల‌ను ఏడుగురు కోనుగోలు చేశారు. దీనికి మొత్తం రూ. 28వేల ఆదాయం స‌మ‌కూరింది. వీటితోపాటు శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్‌ను ఇద్దరు భ‌క్తులు కొనుగోలు చేశారు. వీటికి రూ.6వేలు ఆదాయం సమకూరింది. అమ్మ‌వారి శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల్లో భాగంగా ప‌బ్లికేష‌న్లు, ఫొటోలు, క్యాలెండర్ల ద్వారా రూ.10,230 ఆదాయం అందింది. మిగిలిన ఆదాయం రూ.20, 545, రూ.40 టికెట్‌ ద్వారా వ‌చ్చింది. ఆల‌యానికి వ‌చ్చిన 9,536 మంది భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కుల రూపంలో త‌ల‌నీలాలు సమర్పించగా రూ.3,81,440 ఆదాయం వచ్చిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ...

Popular

Subscribe

spot_imgspot_img