బాలీవుడ్
సింగర్
కమ్
డ్యాన్సర్
నేహా
కక్కర్
తాజాగా
ఆరోపణలను
ఎదుర్కొంటోంది.
తన
పాటలతో
దేశ
వ్యాప్తంగా
యువతను
ఉర్రూతలూగించిన
ఈ
బ్యూటీ
ఇప్పుడు
విమర్శల
పాలవుతోంది.
బాలీవుడ్
లో
స్పెషల్
సాంగ్స్
కు
కెరాఫ్
అడ్రస్
గా
మారిన
నేహా
కక్కర్
పలు
ఐటెమ్
సాంగ్స్
ల్లో
నటించి
మెప్పించారు.
ఇక
ఎన్నో
సూపర్
హిట్
సాంగ్స్
కు
తన
గాత్రాన్ని
అందించి
సంగీత
ప్రియులను
ఆకట్టుకుంది.
'కాక్
టెయిల్',
'యారియాన్',
'క్వీన్',
'కాలా
ఛష్మా',
'కోకా
కోలా',
'గార్మీ'
వంటి
సాంగ్స్
కు
తన
వాయిస్
అందించి
అలరించింది.
ఊపూపే
పాటలు
పాడి
నార్త్
లో
సెన్సేషన్
క్రియేట్
చేసింది.
ప్రస్తుతం
నేహా
కక్కర్
ఫుల్
బిజీగా
ఉంటున్నారు.
ఓవైపు
క్రేజీ
సాంగ్స్
ను
పాడుతూనే
మరోవైపు
హిందీ
టెలివిజన్
లోనూ
ప్రసారమవుతున్న
సింగింగ్
కాంపిటీషన్
షోల్లో
కనిపిస్తూ
అదరగొడుతోంది.
ఇండియన్
ఐడల్..
సింగింగ్
షోకు
కంటెస్టెంట్
గా
వెళ్లి
జడ్జీగా
వ్యవహరించే
స్థాయికి
చేరుకుందామె
అంటే
నేహా
కక్కర్
సాంగ్స్
కు
నార్త్
లో
ఎంతటి
క్రేజ్
ఉందో
అర్థం
చేసకోవచ్చు.
చివరిగా
'ఇండియన్
ఐడల్
సీజన్
13,
సూపర్
స్టార్
సింగర్
సీజన్
3కి
జడ్జీగా
వ్యవహరించారు.
ఇదిలా
ఉంటే..
నేహా
కక్కర్
రీసెంట్
గా
విదేశాల్లో
ఓ
మ్యూజిక్
కాన్సర్ట్
విషయంలో
వార్తల్లో
నిలిచింది.
ఆస్ట్రేలియా
నగరంలోని
మెల్‌బోర్న్‌లో
రీసెంట్
గా
తన
మ్యూజిక్
కాన్సర్ట్
జరిగింది.
అయితే
ఈ
ఈవెంట్
కు
నేహా
కక్కర్
3
గంటలు
ఆలస్యంగా
వెళ్లింది.
దాంతో
ఆమెపై
ఆడియెన్స్
విసుగెత్తిపోయారు.
ఆమెను
తిరిగి
ఇంటికి
వెళ్లమని
విరుచుకుపడ్డారు.
దాంతో
నేహా
కక్కర్
తనను
క్షమించమని
వేదికపై
నుంచే
ఆడియెన్స్
ను
కోరింది.
అందుకు
సంబంధించిన
వీడియో
కూడా
వచ్చింది.
అయితే,
ఆ
మ్యూజిక్
కాన్సర్ట్
నిర్వాహకులు
తనకు
పారితోషికం
ఇవ్వకుండానే
పారిపోయారని
ఆరోపించింది.
అంతే
కాదు
తన
టీమ్
ను
కూడా
సరిగా
చూసుకోలేదని
ఆరోపించింది.
తన
బ్యాండ్‌లోని
సభ్యులకు
సరైన
ఫుడ్,
హోటల్,
కనీసం
డ్రింకింగ్
వాటర్
కూడా
ఇవ్వలేదని
మండిపడింది.
బేసిక్
అవసరాలు
ఆ
నిర్వాహకులు
అందించలేదని
నేహా
కక్కర్
వెల్లడించారు.
అయినప్పటికీ
ఆమె
అభిమానుల
కోసమని
వేదికపైకి
వెళ్లి
పెర్ఫామెన్స్
ఇచ్చామని
నేహా
కక్కర్
వెల్లడించింది.
అయితే,
సదరు
నిర్వాహకులు
నేహా
కక్కర్
పై
నిందారోపణ
చేశారు.
ఆమె
వల్ల
తమకు
రూ.4.52
కోట్ల
నష్టం
కలిగించిందని
ఆరోపించారు.
ఆ
షో
బీట్స్
ప్రొడక్షన్
నిర్వాహకులు
సిడ్నీ,
మెల్‌బోర్న్‌లలో
నేహా
కక్కర్
చేత
నిర్వాహించాల్సిన
కచేరీలకు
సంబంధించిన
ఖర్చుల
బిల్లులను
బహిరంగంగా
విడుదల
చేశారు. ...