International
oi-Lingareddy Gajjala
అగ్రరాజ్య
అధ్యక్షుడు
డోనాల్డ్
ట్రంప్
(Donald
Trump)
ఎక్కడ
ఉన్నా
వార్తల్లో
నిలుస్తారు.
అయితే
ఈసారి
ఆయన
మాటల
వల్ల
కాకుండా,
ఆయన
చేతిపై
కనిపించిన
కమిలిన
మచ్చల
వల్ల
వార్తల్లోకి
ఎక్కారు.
స్విట్జర్లాండ్‌లోని
దావోస్‌లో
జరిగిన
వరల్డ్
ఎకనామిక్
ఫోరమ్(World
Economic
Forum
2026)
వేదికగా
ఆయన
ఆరోగ్యంపై
ఇప్పుడు
సోషల్
మీడియాలో
రకరకాల
ఊహాగానాలు
మొదలయ్యాయి.
అసలు
ఆ
మచ్చల
వెనుక
ఉన్న
కథ
ఏంటి?
అసలు
ట్రంప్
చేతికి
గాయం
ఎలా
అయింది?
దావోస్‌లో
జరిగిన
‘బోర్డ్
ఆఫ్
పీస్’
సంతకాల
కార్యక్రమంలో
పాల్గొన్నప్పుడు
ట్రంప్
ఎడమ
చేతిపై
స్పష్టమైన
నల్లటి/నీలం
రంగు
మచ్చలు
(Bruising)
కనిపించాయి.
ముఖ్యంగా
ఆయన
సంతకం
చేస్తున్నప్పుడు
కెమెరాలు
ఈ
మచ్చలను
క్లోజప్‌లో
బంధించడంతో
ప్రపంచవ్యాప్తంగా
చర్చ
మొదలైంది.
ఈ
విషయంపై
రిపోర్టర్లు
అడిగిన
ప్రశ్నకు
ట్రంప్
తనదైన
శైలిలో
సమాధానమిచ్చారు.
సంతకం
చేసే
సమయంలో
టేబుల్
కోన
తన
చేతికి
బలంగా
తగిలిందని,
దానివల్ల
ఆ
మచ్చ
పడిందని
ఆయన
చెప్పారు.
తాను
గుండె
ఆరోగ్యం
కోసం
ప్రతిరోజూ
325
mg
ఆస్పిరిన్
తీసుకుంటానని,
అందుకే
చిన్న
దెబ్బ
తగిలినా
రక్తం
పలచబడటం
వల్ల
త్వరగా
మచ్చలు
పడతాయని
ఆయన
వివరించారు.
“నా
గుండెలోకి
చిక్కటి
రక్తం
వెళ్లడం
నాకు
ఇష్టం
లేదు”
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
రక్తనాళాలపై
ప్రభావం..
వైద్యులు
చెబుతున్న
దాని
ప్రకారం,
వృద్ధాప్యంలో
ఉండేవారికి
చర్మం
పలచబడటం
(Thinning
of
skin)
సహజం.
దానికి
తోడు
అధిక
మోతాదులో
ఆస్పిరిన్
వాడటం
వల్ల
రక్తనాళాలు
సులభంగా
పగిలి
ఇలాంటి
మచ్చలు
వస్తాయి.
దీనిని
వైద్య
పరిభాషలో
Senile
Purpura
అని
కూడా
పిలుస్తారు.
కేవలం
ఎడమ
చేయి
మాత్రమే
కాదు,
గత
ఏడాది
కాలంగా
ఆయన
కుడి
చేతిపై
కూడా
ఇలాంటి
మచ్చలు
కనిపిస్తున్నాయని,
కొన్నిసార్లు
వాటిని
మేకప్‌తో
కవర్
చేస్తున్నారని
పరిశీలకులు
చెబుతున్నారు.
79
ఏళ్ల
వయస్సులో
ట్రంప్
ఆరోగ్యంపై
వస్తున్న
వార్తలు
ఆయన
మద్దతుదారుల్లో
ఆందోళన
కలిగిస్తుండగా,
వైట్
హౌస్
మాత్రం
ఆయన
పూర్తి
ఆరోగ్యంగా
ఉన్నారని
భరోసా
ఇస్తోంది.
రాజకీయాల్లో
చిన్న
విషయం
కూడా
పెద్ద
చర్చకు
దారితీస్తుంది.
ముఖ్యంగా
ప్రపంచంలోనే
అత్యంత
శక్తివంతమైన
వ్యక్తి
ఆరోగ్యానికి
సంబంధించి
చిన్న
మచ్చ
కనిపించినా
అది
అంతర్జాతీయ
వార్త
అవుతుందనడానికి
ఈ
ఘటనే
నిదర్శనం.


