India
oi-Syed Ahmed
ఎన్నో
దశాబ్దాలుగా
భారత్
తో
పాటు
ప్రపంచవ్యాప్తంగా
పలు
దేశాల్లో
పౌష్టికాహారంగా
భావిస్తున్న
కోడి
గుడ్లపై
ఈ
మధ్య
కొత్త
ప్రచారం
మొదలైంది.
గుడ్లు
తింటే
క్యాన్సర్
వస్తుందనేది
దీని
సారాంశం.
గుడ్లలో
ఉండే
నైట్రో
ఫురాన్స్,
మేతకు
వాడుతున్న
ఇతర
రసాయనాల
కారణంగా
క్యాన్సర్
వస్తుందనే
వాదనను
పలువురు
డాక్టర్లు
సైతం
వినిపిస్తున్నారు.
దీంతో
కోడిగుడ్ల
వాడకాన్ని
కూడా
జనం
తగ్గించుకునే
పరిస్ధితి
వస్తోంది.
ఈ
నేపథ్యంలో
ఫుడ్
సేఫ్టీ
స్టాండర్డ్స్
అథారిటీ
ఆఫ్
ఇండియా
దీనిపై
స్పందించింది.
గుడ్లు
తినడం
వల్ల
క్యాన్సర్
వస్తుందని
చెప్పడానికి
ప్రస్తుతం
డాక్టర్లు,
ఇతర
నిపుణులు
చెప్తున్న
నైట్రోఫురాన్స్
ఇందులో
ఉన్నట్లు
ఫుడ్
సేఫ్టీ
స్టాండర్డ్స్
అథారిటీ
ఆఫ్
ఇండియా
నిర్ధారించింది.
అయితే
అవి
క్యాన్సర్
కు
కారణం
కాదని,
ఇవి
ఉత్పత్తి
నిబంధనల
ప్రకారం
నిషేధితాలు
మాత్రమే
అని
స్పష్టత
ఇచ్చింది.
అలాగే
మరో
కారకం
ఈఎంఆర్ఎల్
పరిమితి
తక్కువగా
కూడా
కేవలం
పరీక్షా
సాధనం
మాత్రమేనని,
దీంతో
ఆరోగ్యానికి
ఎలాంటి
ప్రమాదం
లేదని
తెలిపింది.
ఇప్పటికే
పలు
చోట్ల
గుడ్లలో
బయటపడిన
అవశేషాలు
కూడా
కొన్ని
బ్యాచ్
లకు
చెందినవి
మాత్రమేనని,
మొత్తం
గుడ్లు
అలా
ఉంటాయని
చెప్పలేమని
ఫుడ్
సేఫ్టీ
స్టాండర్డ్స్
అథారిటీ
ఆఫ్
ఇండియా
తెలిపింది.
ఈ
అవశేషాలు
కొన్ని
రకాల
బ్రాండ్లు,
ఆహారం
కలుషితం
కావడం
వల్ల
క్యాన్సర్
కు
కారణమై
ఉండొచ్చని
వెల్లడించింది.
అలాగే
ప్రస్తుతం
గుడ్ల
పరీక్షలకు
వాడుతున్న
నిబంధనలు
అమెరికా,
ఐరోపా
దేశాలతో
సమానంగా
ఉన్నట్లు
వెల్లడించింది.
అలాగే
సాధారణంగా
గుడ్లు
తినడం
వల్ల
క్యాన్సర్
వస్తుందని
ఇప్పటివరకూ
ఏ
సంస్థా
చెప్పలేదని
కూడా
తేల్చేసింది.
కాబట్టి
గుడ్డు
ప్రియులు
యథావిథిగా
వాటిని
తినొచ్చని
తెలిపింది.


