Emotional Video: ” ప్లీజ్.. త్వరగా ఇక్కడినుంచి తీసుకెళ్లిపోండి”

Date:


International

oi-Bomma Shivakumar

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్​-ఇరాన్​ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ లోని పలు పట్టాణాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు.. భారత ప్రభుత్వం తమను వెంటనే స్వదేశానికి తరలించేలా చర్యలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు విద్యార్థులు.. ఎమోషనల్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తమను తక్షణమే స్వదేశానికి తరలించాలని ప్రార్థిస్తూ ప్రధాని మోదీని కోరుకుంటున్నారు.

ఓవైపు వైమానిక దాడులు, భయం మరోవైపు పరీక్ష షెడ్యూల్ కారణంగా ఆందోళనలో ఉన్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో బతుకుతున్నామని.. ఇక్కడి డైలీ లైఫ్ పూర్తిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నివసిస్తున్న ఓ భారతీయ విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఎమోషనల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

” అందరికీ నమస్కారం.. నేను భారతీయ విద్యార్థిని.. నేను ప్రస్తుతం టెహ్రాన్ లో ఉంటున్నాను. ఇక్కడి వాతావరణం ప్రస్తుతం చాలా భయాందోళనగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది” అని ఆ విద్యార్థిని పేర్కొంది.

మరో విద్యార్థిని మాట్లాడుతూ..” భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న తక్షణ చర్యలకు కృతజ్ఞతలు. కానీ ఇలాంటి సమయంలో ఎంత త్వరగా విద్యార్థుల్ని స్వదేశానికి తరలించామన్నదే కీలకంగా మారుతుంది. వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. త్వరగా ఇక్కడినుంచి మిమ్మల్ని తరలించాలని వేడుకుంటున్నాం. పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారేంతవరకూ వేచి చూడకండి. మిమ్మల్ని కాపాడండి..” అని వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య భీకర దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి దాడులు చేపట్టాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తక్షణమే గగనతలాన్ని మూసేసింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Brenda Song on Alaska Airlines Flight Issue With Macaulay Culkin, Kids

Brenda Song Shares How 'Home Alone' Inspired Safety...

Liam and Noel Gallagher celebrate Manchester City’s Carabao Cup success together

Liam and Noel Gallagher celebrated Manchester City’s Carabao Cup victory together...

Wet Leg Performs ‘Moisturizer’ Tracks on ‘SNL UK’ Premiere Episode

Live from London, it’s Saturday Night Live! The iconic sketch...