Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!

Date:


India

oi-Lingareddy Gajjala

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరాపై తలెత్తిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పటాపంచలు చేసింది. దేశంలో ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రిఫైనరీలు అన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఎక్కడా కొరత లేదని, దిగుమతుల కోసం అత్యవసరంగా వెతకాల్సిన పనిలేదని స్పష్టం చేస్తూ వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చింది.

పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు. ఎల్‌పీజీ (LPG) సరఫరా అంశంపై అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, దేశీయంగా గృహ వినియోగదారులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఏ గ్యాస్ ఏజెన్సీ కూడా సరఫరా నిలిచిపోయే పరిస్థితిని ఎదుర్కోవడం లేదని, సిలిండర్ డెలివరీలు యథావిధిగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.

LPG ఉత్పత్తిని ఏకంగా 38 శాతం పెంపు..

సిలిండర్ బుకింగ్, డెలివరీ వ్యవస్థలో వచ్చిన సానుకూల మార్పులను ఈ సందర్భంగా ఆమె వివరించారు. ప్రస్తుతం దేశంలో సుమారు 94 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుండటం విశేషం. అంతేకాకుండా, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) వ్యవస్థ కూడా 76 శాతానికి చేరుకోవడంతో పంపిణీలో పారదర్శకత పెరిగిందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీజీ ఉత్పత్తిని ఏకంగా 38 శాతం పెంచామని, ఇందుకోసం కొన్ని రసాయన ప్రక్రియలను సైతం మార్చినట్లు అధికారులు వెల్లడించారు. గృహేతర అవసరాల కోసం కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కేటాయింపులు జారీ చేసినట్లు తెలిపారు.

బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం..

అదే సమయంలో, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహించిన 12,000 రైడ్స్ లో సుమారు 15,000 అక్రమ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీగా తనిఖీలు చేపట్టి అక్రమ నిల్వలను వెలికితీశారు. నిరంతర తనిఖీలు, ఆకస్మిక దాడుల ద్వారా అక్రమ కార్యకలాపాలను అరికడతామని, ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు పైప్‌లైన్ పనులను వేగవంతం చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related