Gas లేకపోయినా పర్లేదు.. ఇవి ఉన్నాయిగా! భారీగా పెరిగిన డిమాండ్

Date:


Business

oi-Lingareddy Gajjala

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులను (Supply Chains) దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు ఎగుమతులపై ప్రభావం పడటంతో, భారతీయ నగరాల్లో ఎల్పీజీ (LPG) ధరలు పెరగవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ అనిశ్చితి కారణంగా.. బెంగళూరు హైదరాబాద్ వంటి మహానగరాల్లోని ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపుతున్నారు.

మెట్రో నగరాల్లో బ్యాచిలర్లు, విద్యార్థులు, రూమ్స్ లో ఉండేవారు మాత్రమే ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై ఆధారపడేవారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా మధ్యతరగతి గృహిణులు కూడా గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, విద్యుత్ ఉపకరణాల వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.

సాధారణంగా గృహిణులు గ్యాస్ పొయ్యిపై వంట చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉండాల్సిందేనన్న నిర్ణయానికి వస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని ఐటి కారిడార్లలో నివసించే కుటుంబాలు గ్యాస్ బుకింగ్ కోసం వేచి చూసే కంటే, తక్షణమే అందుబాటులో ఉండే విద్యుత్ శక్తిని నమ్ముకోవడం సులభమని భావిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెరగడం, సరఫరా ఆలస్యం కావడం వంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఈ ఉపకరణాలు ‘బ్యాకప్’ లా కాకుండా ప్రధాన వంట సాధనాలుగా మారిపోతున్నాయి.

వంటగది బడ్జెట్‌..

ఈ మార్పు కారణంగా ఎలక్ట్రానిక్ మార్కెట్లలో డిమాండ్ అమాంతం పెరిగింది. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, కేపీహెచ్బీ, గచ్చిబౌలీ, మాదాపూర్, దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట్.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో గృహోపకరణాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దుకాణదారుల కథనం ప్రకారం, గతంలో నెలకు పది ఇండక్షన్ స్టవ్‌లు అమ్ముడయ్యే చోట, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయింది. కేవలం ధర తక్కువగా ఉండటమే కాకుండా, టైమర్ సౌకర్యం, వంట త్వరగా పూర్తయ్యే అవకాశం ఉండటంతో గృహిణులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వంటగది బడ్జెట్‌ను క్రమబద్ధీకరించుకోవడానికి విద్యుత్ పరికరాలే సరైన పరిష్కారమని వారు భావిస్తున్నారు.

గ్యాస్ కొరత తలెత్తకముందే..

ఒక్క మాటలో చెప్పాలంటే, పశ్చిమాసియా సంక్షోభం ఇంధన భద్రతపై సామాన్యులలో అవగాహన పెంచింది. గ్యాస్ కొరత తలెత్తకముందే అప్రమత్తమైన నగరవాసులు తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ల మీద ఆధారపడటం తగ్గించి, ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను ఆహ్వానిస్తున్నారు. ఇది కేవలం యుద్ధ కాలపు తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో స్థిరమైన మార్పుగా మారే అవకాశం ఉంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

U.S. tech execs smuggled Nvidia chips to China, prosecutors say

NVIDIA AI Computing Card captured in Hangzhou, Zhejiang Province,...

Jeff Bezos reportedly wants $100 billion to buy and transform old manufacturing firms with AI

Jeff Bezos is reportedly seeking $100 billion for a...

Road Trip? Keep Your Car Clutter-Free With These Cleaning Essentials

If you're skipping the airport in favor of a...