International
oi-Chandrasekhar Rao
అమెరికాలో
H-1B
వీసాలపై
పనిచేస్తున్న
వేలాది
మంది
గూగుల్
ఉద్యోగులకు
భారీ
ఊరట
లభించింది.
గత
రెండేళ్లుగా
నిలిపివేసిన
గ్రీన్
కార్డ్
దరఖాస్తుల
ప్రక్రియను
2026
నుండి
పెద్ద
ఎత్తున
తిరిగి
ప్రారంభించాలని
గూగుల్
నిర్ణయించింది.
ఇందులో
భాగంగా
ప్రోగ్రామ్
ఎలక్ట్రానిక్
రివ్యూ
మేనేజ్మెంట్
(PERM-Program
Electronic
Review
Management)
దరఖాస్తుల
ఆమోద
ప్రక్రియను
వేగవంతం
చేయడానికి
అవసరమైన
ప్రణాళికలను
రూపొందించుకుంది.
అమెరికాలో
ఎంప్లాయ్
మెంట్
బేస్డ్
గ్రీన్
కార్డ్
ప్రక్రియలో
ఈ
PERM
అనేది
కీలకం.
విదేశీ
ఉద్యోగులను
నియమించడం
ద్వారా
అమెరికా
నిపుణులపై
ఎటువంటి
ప్రతికూల
ప్రభావం
ఉండబోదని..
అలాగే
సదరు
ఉద్యోగానికి
తగిన
అర్హత
గల
నిపుణులు
అమెరికాలో
లేరని,
అందువల్లే
విదేశీ
ఉద్యోగులను
నియమించుకోవాల్సి
వచ్చిందని
ఈ
PERM
ప్రక్రియ
ద్వారా
ఆయా
కంపెనీలు
ప్రభుత్వానికి
తెలియజేస్తాయి.
దీనివల్ల
అడ్మినిస్ట్రేషన్
నుంచి
ఇబ్బందులు
ఉండవు.
ఈ
ప్రాసెస్
ను
రెండేళ్ల
కిందట
నిలిపివేసింది
గూగూల్.
2026లో
దీన్ని
పునరుద్ధరించాలని
నిర్ణయించుకుంది.
ఈ
నిర్ణయం
భారతీయ
టెక్కీల
నెత్తిన
పాలుపోసినట్టే
అవుతుంది.
సాధారణంగా
టెక్
కంపెనీలు
ఈ
ప్రక్రియ
ద్వారానే
తమవద్ద
తాత్కాలిక
వీసా
కింద
పని
చేస్తోన్న
ఉద్యోగులకు
శాశ్వత
నివాస
హోదాను
పొందడానికి
సహాయపడతాయి.
గ్రీన్
కార్డుల
వీసా
ప్రాసెసింగ్
సైతం
దీనితోనే
ముడిపడి
ఉంటుంది.
2026
మొదటి
త్రైమాసికంలో
PERMకు
అర్హత
పొందిన
ఉద్యోగులను
గూగుల్
సంప్రదింపులు
మొదలు
పెట్టనుంది.
దీనికి
సంబంధించి
గూగుల్
ఇప్పటివరకు
ఎటువంటి
బహిరంగ
ప్రకటన
చేయలేదు.
అయినప్పటికీ-
ఇంటర్నల్
కమ్యూనికేషన్ల
కాపీలు
లీక్
కావడంతో
ఈ
వార్త
వెలుగులోకి
వచ్చింది.
H-1B,
ఇతర
వర్క్
వీసాలపై
పనిచేస్తున్న
టెక్
నిపుణులు
అనేక
సవాళ్లను
ఎదుర్కొంటోన్న
ప్రస్తుత
పరిస్థితుల్లో
గూగుల్
తీసుకున్న
ఈ
నిర్ణయం
వల్ల
చాలామంది
టెక్కీలకు
ఊరట
లభించినట్టవుతుంది.
వీసా
ఫీజుల
పెంపు,
దీని
ప్రాసెసింగ్
లో
నెలకొన్న
తీవ్ర
జాప్యం,
ఇమ్మిగ్రేషన్
పాలసీలలో
మార్పులతో
వాళ్లంతా
ఆందోళన,
గందరగోళానికి
గురి
అవుతున్నారు.
గ్రీన్
కార్డ్
ప్రక్రియను
2023
జనవరిలో
గూగుల్
నిలిపివేసింది.
అదే
సమయంలో
కంపెనీ
సుమారు
12,000
మంది
ఉద్యోగులను
తొలగించినట్లు
ప్రకటించింది.
అప్పట్లో
అమెజాన్,
మెటా
వంటి
ఇతర
టెక్
దిగ్గజాలు
కూడా
ఇలాంటి
చర్యలే
తీసుకున్నాయి.
పెద్ద
సంఖ్యలో
అమెరికన్
ఉద్యోగుల
తొలగింపు
నేపథ్యంలో,
PERM
నిబంధనల
ప్రకారం
స్థానిక
ప్రతిభ
అందుబాటులో
లేదని
నిరూపించడం
కంపెనీలకు
కష్టతరమైంది.
ఇదే
విదేశీ
ఉద్యోగుల
స్పాన్సర్‌షిప్‌కు
అడ్డంకిగా
మారింది.
గూగుల్‌లో
వీసాపై
ఉన్న
ప్రతి
ఉద్యోగి
దీనికి
అర్హులు
కారు.
కొన్ని
కండీషన్లు
పెట్టింది
గూగుల్.
వర్క్
ఫ్రమ్
ఆఫీస్
పనిచేస్తున్న
ఉద్యోగులు
మాత్రమే
అర్హులు.
రిమోట్‌లో
పని
చేస్తున్న
ఉద్యోగులు
PERM
కిందికి
రావాలంటే
ఆఫీస్
కు
రావాల్సి
ఉంటుందని
మెమో
స్పష్టం
చేసింది.
లెవెల్
3
లేదా
అంతకంటే
తక్కువ
స్థాయిలోని
ఉద్యోగులను
ఇందులో
చేర్చే
అవకాశాలు
తక్కువే.
అలాగే
పెర్ఫార్మెన్స్
స్టాండర్డ్స్,
మోడరేట్
ఇంపాక్ట్
పాటించడం
అవసరం.


