International
oi-Syed Ahmed
అమెరికా
కంపెనీలు
విదేశీ
నిపుణుల్ని
నియమించుకునేందుకు
వీలుగా
అక్కడి
ప్రభుత్వం
విదేశీయులకు
ఇస్తున్న
హెచ్1బీ
వీసాల
జారీ
విధానంలో
మరో
పెనుమార్పు.
ఇప్పటివరకూ
కంప్యూటర్
ఆధారిత
లాటరీ
విధానంలో
వీసాలు
జారీ
చేస్తుండగా..
ఇప్పుడు
మరో
కొత్త
విధానం
అమల్లోకి
రాబోతోంది.
ఇప్పటికే
హెచ్1బీ
వీసా
ఇంటర్వ్యూల్ని
నిలిపేయడం
ద్వారా
కొత్త
విధానం
అమలుకు
ప్రయత్నిస్తున్న
ట్రంప్
సర్కార్..
ఇప్పుడు
మరో
సంచలన
నిర్ణయం
తీసుకుంది.
హెచ్1బీ
వీసాల
జారీ
విధానంలో
సమగ్ర
మార్పులు
చేస్తున్న
ట్రంప్
సర్కార్
తాజాగా
పలు
కీలక
ప్రతిపాదనలు
చేసింది.
వీటిని
అమెరికా
హోంశాఖ
పంపిన
ప్రతిపాదనలపై
తుది
సమీక్ష
జరుగుతోంది.
ఇందులో
భాగంగా
ప్రస్తుతం
ఉన్న
లాటరీ
ఆధారిత
వీసాల
జారీ
విధానానికి
చెక్
పెట్టాలని
ప్రభుత్వం
భావిస్తోంది.
దీని
స్ధానంలో
వేతనాల
ఆధారంగా
హెచ్1బీ
వీసాల
జారీ
విధానం
అమలు
చేయాలని
నిర్ణయించబోతున్నారు.
ఇమ్మిగ్రేషన్
సంస్థ
ఫ్రాగోమెన్
నివేదిక
ప్రకారం
ఆఫీస్
ఆఫ్
మేనేజ్
మెంట్
అండ్
బడ్జెట్
సమీక్షిస్తోంది.
ఇందులో
నిపుణులైన
కార్మికుల్ని
మాత్రమే
దేశంలోకి
అనుమతించాలన్న
ప్రభుత్వ
నిర్ణయం
మేరకు
సమీక్ష
జరుపుతున్నారు.
దీని
ప్రకారం
ఇకపై
కంప్యూటర్
ఆధారిత
వీసాల
జారీ
విధానం
స్ధానంలో
వెయిటెడ్
సెలక్షన్
సిస్టమ్
అమలు
కానుంది.
ఈ
విధానంలో
ఉద్యోగుల
వేతన
స్థాయి
ఆధారంగా
వీసాల
దరఖాస్తుల్లో
ప్రాధాన్యం
కల్పిస్తారు.
ఈ
లెక్కన
ఎక్కువ
వేతనాలు
ఉన్న
నిపుణులైన
ఉద్యోగులకు
ముందుగా
హెచ్1బీ
వీసాలు
లభిస్తాయి.
మిగిలిన
వారికి
ప్రాధాన్యత
క్రమంలో
ఆ
తర్వాత
జారీ
చేస్తారు.
అమెరికా
కంపెనీలు
కేవలం
విదేశీ
నిపుణుల్ని
మాత్రమే
ఉద్యోగాల్లో
నియమించుకునేలా
ఒత్తిడి
తెచ్చేందుకు
ఇలా
అధిక
వేతనాలకు
హెచ్1బీ
వీసాల
జారీలో
ప్రాధాన్యం
ఇస్తున్నట్లు
తెలుస్తోంది.
ఇప్పటికే
ఆయా
కంపెనీలపై
హెచ్1బీ
కొత్త
వీసాల
జారీ
కి
ఏడాదికి
లక్ష
డాలర్ల
ఫీజు
వసూలు
చేయాలని
ట్రంప్
నిర్ణయం
తీసుకున్నారు.
అయితే
ఇంకా
కంపెనీలు
ఈ
నిబంధనను
సైతం
లెక్కచేయకుండా
తమ
రిక్రూట్
మెంట్లు
కొనసాగిస్తున్నాయి.
దీంతో
ట్రంప్
ఇప్పుడు
వేతనాల
ఆధారంగా
మాత్రమే
హెచ్1బీ
వీసాల
జారీకి
సిద్దమవుతున్నట్లు
తెలుస్తోంది.


