H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్

Date:


International

oi-Chandrasekhar Rao

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B వీసా ఎంపికకు కొత్త నియమాలను తీసుకొచ్చింది. అధిక నైపుణ్యం, ఎక్కువ వేతనం పొందే వారికి ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం ‘వెయిటెడ్ సిస్టమ్’ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కిందటేడాది డిసెంబర్ 23వ తేదీన దీని గురించి ప్రకటించింది. కిందటి నెల 27వ తేదీ నుండి అమలులోకి వచ్చిన ఈ నింబధన 2027 ఆర్థిక సంవత్సరపు H1B క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు వర్తిస్తుంది.

ఈ నిబంధన ప్రకారం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. ఇకపై లాటరీపై మాత్రమే కాకుండా వేతనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఈ వెయిటెడ్ సిస్టమ్‌ను అమలు చేస్తుంది. దీని వల్ల ఎక్కువ వేతనం పొందే వారికి ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయి. అత్యంత నైపుణ్యం గల నిపుణులకు ప్రాధాన్యతనివ్వడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. దీనివల్ల నాన్ ప్రొషెషనల్స్ కు జారీ అయ్యే హెచ్ 1బీ విసాలకు అడ్డుకట్ట పడుతుందని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు.

H1-B అభ్యర్థులను నమోదు చేసే యజమానులు, ఉద్యోగి జీతం ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ అండ్ వేజ్ స్టాటిస్టిక్స్ లో ఏ అత్యధిక వేతన స్థాయికి సరిపోతుందో పేర్కొనాలి. హెచ్ 1బీ పిటిషన్‌కు ముందు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అకౌంట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ప్రతి అభ్యర్థికి 215 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1 బీ విసాల రిజిస్ట్రేషన్ ఈ నెల 4 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమైంది.

ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఈ వ్యవధిలో యజమానులు, హెచ్ 1బీ వీసా పొందిన దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన ఫీజును కూడా చెల్లించాలి. ఎంపిక గడువు ముగిసిన తర్వాతే కావడం వల్ల మొదటి రోజే దరఖాస్తును దాఖలు చేసుకోనక్కర్లేదు. ఎంపికైన వారికి నోటీసులు అందుతాయి. పూర్తి పిటిషన్‌లు దాఖలు చేయడానికి అర్హులవుతారు.

ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో H-1B రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. అర్హులైన లబ్ధిదారులు గత ఏడాది 4,42,000 ఉండగా.. ఇప్పుడు 3,39,000కు పడిపోయారు. మొత్తం రిజిస్ట్రేషన్లు 4,70,342 నుండి 3,43,981 శాతానికి తగ్గింది. ఇందులో 26.9 శాతం మేర తగ్గుదల కనిపించింది. సగటున ప్రతి దరఖాస్తుదారుడికీ ఒకే రిజిస్ట్రేషన్ నమోదయ్యింది. వేతనాలకు అధిక ప్రాధాన్యతతో హెచ్ 1బీ ప్రోగ్రామ్ లో ఈ మార్పులు 2027 వరకూ కొనసాగే అవకాశం ఉంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related