India
-Bomma Shivakumar
ఇండియన్
ఎయిర్
ఫోర్స్(IAF)
మరింత
బలోపేతం
కానుంది.
ఇండియన్
ఎయిర్
ఫోర్స్
తన
అధునాతన
S-400
ఎయిర్
డిఫెన్స్
సిస్టమ్
ను
ఆవిష్కరించింది.
S-400
రక్షణ
వ్యవస్థకు
సుదర్శన్
గా
నామకరణం
చేసింది.
ఇది
దేశ
వైమానిక
రక్షణ
సామర్థ్యాలలో
కీలకమైన
ముందడుగుగా
భావించవచ్చు.
ఆకాశం
గుండా
భారత్
కు
పొంచి
ఉన్న
ముప్పును
ఈ
రక్షణ
వ్యవస్థ
సమర్థవంతంగా
తిప్పి
కొట్టనుంది.
ఈ
రక్షణ
వ్యవస్థల్ని
రష్యా
నుంచి
భారత్
కొనుగోలు
చేసింది.
ఈ
మేరకు
2018
లో
ఐదు
S-400
ఎయిర్
డిఫెన్స్
సిస్టమ్స్
కొనుగోలుకు
భారత్-
రష్యా
మధ్య
ఒప్పందం
కుదిరింది.
పహల్గామ్
ఉగ్రదాడి
తర్వాత
పాకిస్థాన్
పై
భారత్
చేపట్టిన
ఆపరేషన్
సింధూర్
లో
భారత
ఎస్-400
ఎయిర్
డిఫెన్స్
సిస్టమ్
పాకిస్థాన్
కు
చెందిన
డ్రోన్
లు,
క్షిపణులపై
విరుచుకుపడి
వాటిని
ధ్వంసం
చేసిన
విషయం
తెలిసిందే.
ఈ
మేరకు
ఇండియన్
ఎయిర్
ఫోర్స్
తన
అధునాతన
S-400
ఎయిర్
డిఫెన్స్
సిస్టమ్
ను
ఆవిష్కరించింది.
ఈ
S-400
వ్యవస్థ
ఎలాంటి
టార్గెట్
అయినా
ఛేదించగలదు.
ఫైటర్
ఎయిర్
క్రాఫ్ట్,
అన్
మ్యానెడ్
ఏరియల్
వెహికల్స్(UAV),
క్రూయిజ్
మిసైల్స్,
బాలిస్టిక్
మిసైల్స్,
లాంగ్
రేంజ్
మిసైల్స్
ను
సమర్థవంతంగా
నేలకూల్చే
శక్తి
ఈ
ఎయిర్
డిఫెన్స్
వ్యవస్థ
సొంతం.
ఈ
అడ్వాన్స్
డ్
S-400
సుదర్శన్..
ఇండియన్
ఎయిర్
డిఫెన్స్
సిస్టమ్
లో
కొత్త
శకం
అని
వెల్లడవుతోంది.
ప్రస్తుతం
పలు
శత్రు
దేశాలు
అత్యాధునిక
సాంకేతికతతో
ఆకాశ
మార్గంలో
దాడికి
పాల్పడుతున్నాయి.
ఈ
క్రమంలో
ఈ
సర్ఫేస్
టూ
ఎయిర్
మిసైల్
సిస్టమ్
వాటిని
విజయవంతంగా
నేలకూల్చే
సామర్థ్యాన్ని
అందిపుచ్చుకుంది.
2018
లో
రష్యా-
భారత్
మధ్య
కుదిరిన
డిఫెన్స్
ఒప్పందంలో
భాగంగా
5
బిలియన్
డాలర్ల
విలువైన
ఐదు
రెజిమెంట్లను
భారత్
కొనుగోలు
చేసింది.
ఇక
ఈ
S-400
సుదర్శన్..
600
కిలోమీటర్ల
దూరంలోని
లక్ష్యాలను
గుర్తించి
నేలకూల్చగలదు.
400
కిలోమీటర్ల
పరిధిలో
వాటిని
ధ్వంసం
చేయగలదు.
ఈ
ఎయిర్
డిఫెన్స్
వ్యవస్థ
ఒకేసారి
100
లక్ష్యాలను
ట్రాక్
చేయడమే
కాకుండా
36
లక్ష్యాలతో
కచ్చితత్వంతో
పోరాడగలదు.
అలాగే
దాదాపు
30
కిలోమీటర్ల
ఎత్తులోని
UAVలు,క్రూయిజ్
క్షిపణులు,
బాలిస్టిక్
మిసైల్స్
ను
పడగొట్టగలదు.
డిసెంబర్
2025
నాటి
శాటిలైట్
చిత్రాల
ఆధారంగా..
అదంపూర్,
భుజ్,
జోధ్‌పూర్
IAF
స్థావరాలలో
S-400
రాడార్లు
సమర్థవంతగా
పనిచేస్తున్నాయి.
2025
చివరి
నాటికి
మూడు
రెజిమెంట్లు
పూర్తిగా
పనిచేస్తున్నాయి.
భౌగోళిక
రాజకీయ
జాప్యం
ఉన్నప్పటికీ..
మిగిలిన
రెండు
రెజిమెంట్లు
నవంబర్
2026
నాటికి
సిద్ధమవుతాయని
అధికారులు
భావిస్తున్నారు.
మరోవైపు
IAF
చీఫ్
ఎయిర్
చీఫ్
మార్షల్
ఏపీసింగ్
S-400
వ్యవస్థను
గేమ్
ఛేంజర్
గా
అభివర్ణించారు.
ఆపరేషన్
సింధూర్
సమయంలో
ఈ
S-400
వ్యవస్థ
పాకిస్థానీ
డ్రోన్‌లు,
క్షిపణులను
భారత
భూభాగంలోకి
రాకుండా
అడ్డుకుంది.
పాక్
కు
చెందిన
ఆరు
ఫైటర్
జెట్స్
ను
కూల్చివేసింది.
ఐఏఎఫ్
కార్యాలయాల్ని
శత్రు
దేశం
దాడి
నుంచి
రక్షించింది.


