ఏకకాలంలో కంప్యూటర్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకునే సరికొత్త హైబ్రీడ్ పెన్‌డ్రైవ్‌ను ఐబాల్ ఆవిష్కరించింది. పేరు ‘హైబ్రీడ్ డ్యూయల్’ (Hybrid Dual).ఈ ప్రత్యేకమైన పెన్‌డ్రైవ్‌కు ఒక వైపు యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, మరో వైపు మైక్రోయూఎస్బీ కనెక్టర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సౌలభ్యతతో పెన్‌డ్రైవ్‌ను వోటీజీ సపోర్టుతో కంప్యూటర్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌కు ఏకకాలంలో అనుసంధానించుకోవచ్చు. ఐబాల్ రెండు మెమరీ వేరియంట్‌లలో ‘హైబ్రీడ్ డ్యూయల్’ పెన్‌డ్రైవ్‌లను ఆవిష్కరించింది.
8జీబి వేరియంట్ ధర రూ.599. 16జీబి వేరియంట్ ధర రూ.799. హైబ్రీడ్ డ్యూయల్ పెన్‌డ్రైవ్ బరువు 10 గ్రాములు. ఈ పెన్‌డ్రైవ్ ఆవిష్కరణ సందర్భంగా ఐబాల్ సంస్థల సంచాలకులు సందీప్ పరసురామ్ పూరియా మాట్లాడుతూ వినియోగదారులకు బహుగవినియోగకర గ్యాడ్జెట్‌లను సమకూర్చే క్రమంలో ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ తరహా పెన్‌డ్రైవ్ భారత్‌లోవిడుదలవటం ఇదే ప్రధమమని సందీప్ పరసురామ్ వెల్లడించారు.


