IBM వచ్చేస్తుంది, విశాఖలో భారీగా ఉద్యోగాలు

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

విశాఖపట్నం ఐటీ రంగానికి మళ్లీ పూర్వవైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) తిరిగి విశాఖలో అడుగుపెట్టడం ఇప్పుడు ఏపీ పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, కొత్త ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో విశాఖ నగరం మళ్లీ గ్లోబల్ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఒకప్పుడు విశాఖను వీడి వెళ్లిన ఐబీఎం, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తోంది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (STPI)లో ఈ సంస్థ తాజాగా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ ఎస్‌టీపీఐ సోషల్ మీడియా వేదికగా ‘వెల్కమ్ ఐబీఎం’ అంటూ పోస్ట్ చేయడం విశేషం. ఈ రాక కేవలం కార్యాలయ ఏర్పాటుకే పరిమితం కాకుండా, భారీ ఎగుమతుల లక్ష్యంతో రాబోతోంది. రానున్న మూడేళ్లలో విశాఖ కేంద్రంగా సుమారు రూ. 321 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఐబీఎం లక్ష్యంగా పెట్టుకుంది.

స్థానిక యువతకు ఉపాధి కల్పన

ఐబీఎం రాకతో విశాఖలోని ఐటీ నిపుణులకు భారీగా అవకాశాలు లభించనున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ సంస్థ ద్వారా నేరుగా 502 మందికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉపాధి లభించనుంది. ఇప్పటికే కార్యాలయ భవన ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. గతంలో కొన్ని కారణాల వల్ల విశాఖను వీడిన ఈ సంస్థ, మళ్లీ ఇక్కడికి రావడం అనేది నగరంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తోంది.

గత అనుభవాల నుంచి పాఠాలు

గత ప్రభుత్వ హయాంలో ఐబీఎం విశాఖను వదిలి వెళ్లడం వెనుక పెద్ద కథే ఉంది. గతంలో రుషికొండ హిల్‌-3పై కేటాయించిన స్థలంలో ఐబీఎం కార్యకలాపాలు నిర్వహించేది. అయితే, అప్పట్లో ఉన్న కొన్ని నిబంధనలు, పరిమితుల వల్ల తన భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించి నగరాన్ని వీడింది. విశాఖ నుంచి ఐబీఎం వెనక్కి ఇచ్చిన సుమారు 21.80 ఎకరాల స్థలాన్నే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కు కేటాయించడం గమనార్హం.

విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్

ఐబీఎంతో పాటు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కూడా విశాఖలో తన మూలాలను బలోపేతం చేసుకుంటోంది. ప్రస్తుతం నగరంలో అద్దె భవనంలో సేవలందిస్తున్న ఇన్ఫోసిస్, తమకంటూ ఒక శాశ్వత క్యాంపస్ ఉండాలని కోరింది. దీనికి స్పందించిన ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. ఈ భూ కేటాయింపు ప్రక్రియ కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఐబీఎం పునరాగమనం, టీసీఎస్ రాక, ఇన్ఫోసిస్ విస్తరణ.. ఈ మూడు కీలక పరిణామాలు విశాఖను దేశంలోని ప్రధాన ఐటీ నగరాల సరసన నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We’re upgrading Honeywell — plus 2 positions we’d like to build up

Every weekday, the CNBC Investing Club with Jim Cramer...

Niall Horan Says He ‘Went Into Hiding’ After Liam Payne’s Death

Niall Horan lost both a friend and bandmate when...

Crucial meeting scheduled in Delhi to shortlist DGP candidates for Tamil Nadu deferred

The crucial meeting scheduled in Delhi on Friday to...

Stoney Clover’s Liberty Collab Has the Prettiest Bags for Spring Travelers

Spring travel just got a major upgrade. Stoney Clover...