Ilapuram Venkaiah: ఐలాపురం వెంకయ్య ఇకలేరు..! చంద్రబాబు, జగన్ నివాళి..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

విజయవాడకు చెందిన ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (Ilapuram Venkaiah) ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన యస్సు 93 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తన ఇంట్లోనే కన్నుమూశారు. దీంతో విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సామాజిక, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి సీఎం చంద్రబాబు, జగన్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాప ప్రకటనలు చేస్తున్నారు.

పేద కుటుంబంలో పుట్టిన ఐలాపురం వెంకయ్య .. కష్టపడి ఎదిగారు. విజయవాడలోని ప్రముఖ ఐలాపురం హోటల్ ను స్థాపించి ఇప్పటివరకూ నడుపుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై 8 ఏళ్ల పాటు పనిచేశారు. బీసీల అభ్యున్నతి కోసం తీవ్రంగా పాటుపడ్డారు. అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేశారు. సాలివాహన (కుమ్మర) సంఘం అధ్యక్షుడిగా కూడా దశాబ్దాల పాటు సేవలందించారు.

సామాజిక సేవల్లోనూ ఐలాపురం వెంకయ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసంస్థలకు ఫర్నిచర్ విరాళాలు, విద్యార్థుల ప్రోత్సాహానికి సాయాలు, తాగునీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, అన్నదాన సత్రాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే అన్ని మతాల పట్ల సమాన గౌరవంతో దేవాలయాలు, చర్చిలు, మసీదులకు విరాళాలు అందించిన చరిత్ర ఆయనది. వెంకయ్యకు భార్య, కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో నిర్వహిస్తారు.

బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరంతరం పనిచేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారని గుర్తుచేసుకున్నారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఐలాపురం వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అటు వైఎస్ జగన్ కూడా ఐలాపురం వెంకయ్య గారు ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వెంకయ్య కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ తెలిపారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Breaking Regional Mexican Music Rules

Junior H sits down with Billboard’s Co-Chief Content Officer,...

Junior H Talks $ad Boy Identity, Disney Obsession at SXSW

After making waves with his most recent album, DEPR3$$ED...