Iran: రూటు మార్చిన ఇరాన్-గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా వీరే కొత్త టార్గెట్..!

Date:


International

oi-Syed Ahmed

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆరంభంలో ఇరాన్ పై ఈ రెండు దేశాలు ఆధిక్యం సాధించినట్లు కనిపించినా ఆ తర్వాత పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఇరాన్.. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తుల్ని టార్గెట్ చేసుకుంటోంది. దీంతో లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. అయితే ఇప్పటివరకూ దాడులు చేసిన వాటితో పాటు మరికొన్ని తాజా లక్ష్యాల్ని ఇవాళ ఇరాన్ ప్రకటించింది. దీంతో అమెరికా టెక్ కంపెనీలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

గల్ఫ్ దేశాలపై ఆరంభంలో దాడులు చేసి అమెరికా బేస్ లు, ఇతర ఆస్తులకు నష్టం కలిగించిన ఇరాన్.. ఆ తర్వాత వాటికి క్షమాపణలు చెప్పింది. అయితే ఆయా దేశాల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు చేయనంత వరకూ తాము ప్రతిదాడులు చేయబోమని ప్రకటించింది. కానీ అమెరికా మాత్రం గల్ఫ్ దేశాల నుంచి దాడులు కొనసాగిస్తుండటంతో ఇరాన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటామని ఇవాళ ప్రకటించింది.

మరోవైపు ఇరాన్ యొక్క IRGC-అనుబంధ తస్నిమ్ వార్తా సంస్థ.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు కలిగి ఉన్న, సైనిక ప్రయోజనాల కోసం సాంకేతికతను ఇస్తున్న అమెరికా టెక్నాలజీ కంపెనీల కార్యాలయాలు, మౌలిక సదుపాయాల జాబితాను ప్రచురించింది. వీటిని ఇరాన్ కొత్త లక్ష్యాలుగా పేర్కొంది. ప్రాంతీయ వివాదం మౌలిక సదుపాయాల యుద్ధంగా విస్తరిస్తున్నందున, ఇరాన్ చట్టబద్ధంగా పరిగణించే లక్ష్యాల పరిధి కూడా పెరుగుతుందని తస్నిమ్ తెలిపింది. ఇందులో అమెరికా టెక్ దిగ్గజ సంస్ధలు
గూగుల్ (google), మైక్రోసాఫ్ట్(microsoft), పలాంటిర్(palantir), ఐబీఎం(IBM), ఎన్విడియా(NVIDIA), ఒరాకిల్ (ORACLE)వంటి కంపెనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్ నగరాల్లో మరియు కొన్ని గల్ఫ్ దేశాలలో ఉన్న ఈ సంస్థల అనుబంధ కార్యాలయాలు, క్లౌడ్-సర్వీస్ మౌలిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related