India
oi-Syed Ahmed
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి (strait of hormuz)ని ఆ దేశం మూసేసింది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు జరిగిన ఈ జలసంధిని మూసేయడంతో పాటు ఇటువైపుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలు దేశాల నౌకలపై దాడులకు దిగుతోంది. దీంతో తాజాగా భారత్ కు వస్తున్న థాయ్ లాండ్ కు చెందిన నౌకపైనా దాడి జరిగింది. ఇక్కడ జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు ఇప్పటివరకూ చనిపోయినట్లు కేంద్రం కూడా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో భారత నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతిస్తున్నారా లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది. దీనికి తెర దించుతూ భారత్ లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన ఏడు నుంచి 8 భారతీయ నౌకల్ని వదిలిపెట్టేందుకు భారత ప్రధాని మోడీ, విదేశాంగమంత్రి జై శంకర్ వరుసగా ఇరాన్ పెద్దలకు ఫోన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ రాయబారి ఫతాలీ దీనిపై ఓ ప్రకటన చేశారు.
#WATCH | Delhi: On giving safe passage to India, Iran’s Ambassador to India, Mohammad Fathali, says, “… Yes, because India is our friend. You will see it within two or three hours. We believe that Iran and India share common interests in the region…” pic.twitter.com/twTsE1Bjhv
— ANI (@ANI) March 13, 2026
పర్షియన్ గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర భద్రతపై ఆందోళనల మధ్య హార్ముజ్ జలసంధి ద్వారా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా భారత నౌకలు వెళ్లేలా తాము త్వరలో ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎందుకంటే భారతదేశం మా స్నేహితుడు అన్నారు. మీరు రెండు లేదా మూడు గంటల్లో దానిని చూస్తారన్నారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా పర్షియన్ గల్ఫ్‌ను ప్రపంచ మార్కెట్‌లకు అనుసంధానించే ఇరుకైన కారిడార్ ద్వారా నౌకా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో ఇరాన్ రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు.


