Entertainment
oi-Kannaiah
కార్తీకదీపం
2
సీరియల్‌లో
డిసెంబర్
1వ
తేదీ,
529వ
ఎపిసోడ్
పూర్తి
భావోద్వేగంగా,
నాటకీయంగా
సాగింది.
జ్యోత్స్న
ప్లాన్
బెడిసికొట్టడం,
శ్రీధర్-కాంచన
మధ్య
ఘర్షణ,
దీప
గర్భంపై
కొత్త
ఆంక్షలు
మరియు
కాశీ
ఉద్యోగం
కోసం
స్వప్న
ఎమోషనల్
బ్లాక్‌మెయిల్…
ఈ
ఎపిసోడ్‌లో
ప్రధానాంశాలుగా
నిలిచాయి.
జ్యోత్స్నపై
కార్తీక్
వార్నింగ్
జ్యోత్స్న,
దీపకి
కాలు
అడ్డుపెట్టి
కిందపడేయడానికి
ప్రయత్నించగా
సుమిత్ర
కాపాడింది.
తన
ప్లాన్
ఫెయిల్
అవ్వడం,
దీపకి,
సుమిత్రకు
మధ్య
ఉన్న
బంధం
చూసి
జ్యోత్స్న
రగిలిపోతుంది.
ఈసారి
కడుపులోని
బిడ్డను
ఎవరూ
కాపాడలేరని
ఆమె
మనసులో
అనుకుంటుండగా,
అక్కడికి
వచ్చిన
కార్తీక్
తీవ్రంగా
హెచ్చరించాడు.
తన
బిడ్డ
జోలికి,
భార్య
జోలికి
వస్తే…
డ్రైవర్‌గా
ఉన్న
తను
కార్తీక్‌గా
మారతానని,
అప్పుడు
జరిగేది
కురుక్షేత్రమేనని,
ఒక
పెద్ద
కర్ర
తీసుకుని
వెనుక
నుంచి
కొడతానని
హెచ్చరించాడు.
ఈ
మాటలతో
దాస్‌ని
కొట్టిన
విషయం
గుర్తుకొచ్చి
జ్యోత్స్న
వణికిపోయింది.
మరోవైపు,
దీప
ప్రమాదం
గురించి
శివన్నారాయణ
అడగడంతో
కార్తీక్,
దీప
షాక్
అయ్యారు.
కాంచనపై
శ్రీధర్
ఎమోషనల్
ఎటాక్
గతంలో
భర్త
శ్రీధర్‌ను
క్షమించలేనని
చెప్పిన
కాంచన
ఒంటరిగా
ఉన్న
సమయాన్ని
చూసి
శ్రీధర్
ఇంటికి
వచ్చాడు.
తనను
శివన్నారాయణ,
కార్తీక్
క్షమించినప్పుడు
కాంచన
ఎందుకు
మారడం
లేదని
ప్రశ్నించాడు.
ఇంతలో
కావేరి
స్వీట్స్,
పిండి
వంటలు
తీసుకొని
రావడంతో
పాటు
శౌర్య,
కావేరి
మాట్లాడుకునే
మాటలతో
కాంచన,
శ్రీధర్‌లు
షాకయ్యారు.
దీప
ప్రెగ్నెంట్
కావడం
కూడా
కాంచనకు
ఇష్టం
లేదని
శ్రీధర్
ఆరోపించాడు.
ఆమె
అన్ని
ఆశలు
పెట్టుకుంటే
కడుపుతో
ఉన్న
కోడలిని
మీ
నాన్న
ఇంటికి
పనిచేయడానికి
పంపించదని
మండిపడ్డాడు.
దీపకు
‘వర్క్
ఫ్రమ్
హోమ్’
ఆంక్ష
“ఈ
రోజు
నీ
కోడలు
కాలు
జారి
కిందపడిపోబోయింది
నీకు
తెలుసా?”
అని
శ్రీధర్
నిలదీశాడు.
సుమిత్ర
పట్టుకోకపోతే
దీపకు
ప్రమాదం
జరిగి
ఉండేదని,
తన
తల్లి
మరోసారి
చనిపోయేదని
శ్రీధర్
భావోద్వేగానికి
లోనయ్యాడు.
“నా
కొడుకు
వారసత్వాన్ని
నువ్వు
కడుపుతో
మోస్తున్నావు”
అని
దీపకు
శ్రీధర్
అండగా
నిలబడ్డాడు.
ఆ
ఇంట్లో
పనిచేయాల్సిన
అవసరం
ఏంటీ
అని
కాంచనపై
ఫైర్
అయ్యాడు.
తన
పుట్టింటి
మీదున్న
ప్రేమలో
పావు
వంతైనా
దీపపై
చూపించమని
హితవు
పలికాడు.
అంతేకాదు,
దీపని
జాగ్రత్తగా
చూసుకో..
ఇంటి
పనులు
ఆపించమని
డిమాండ్
చేశాడు.
ఇకపై
దీప,
కార్తీక్‌లు
ఆ
ఇంటికి
వెళ్లడానికి
వీల్లేదని
తేల్చి
చెప్పాడు.
శ్రీధర్
మాటలతో
ఆలోచనలో
పడ్డ
కాంచన…
ఇకపై
ఆ
ఇంటికి
వెళ్లడానికి
వీల్లేదని
దీపకి
స్పష్టం
చేసింది.
ఉద్యోగం
కోసం
స్వప్న
బ్లాక్‌మెయిల్
మరోవైపు,
కాశీకి
శ్రీధర్
కింద
పీఏగా
పనిచేయడానికి
అపాయింట్‌మెంట్
లెటర్
రావడంతో
అతను
ఆ
ఉద్యోగాన్ని
తిరస్కరించాడు.
కావాలంటే
బడ్డీ
కొట్టు
దగ్గర
జాయిన్
అవుతానని
సీరియస్‌గా
వెళ్లిపోయాడు.
అల్లుడిని
అవమానించావని
కావేరి
శ్రీధర్‌పై
మండిపడగా..
40
వేలు
జీతం,
తర్వాత
బిజినెస్‌లోకి
తీసుకురావచ్చని
శ్రీధర్
కవర్
చేసుకున్నాడు.
కాశీని
ఒప్పించడానికి
వెళ్లిన
స్వప్న…
“నువ్వు
మా
నాన్న
చెప్పినట్లు
చేస్తేనే
నేను
నీతో
ఉంటాను,
లేదంటే
మా
అన్నయ్య
దగ్గరికి
వెళ్లిపోతున్నాను”
అని
ఎమోషనల్‌గా
బ్లాక్‌మెయిల్
చేసింది.
దీంతో
ప్రేమ
కోసం
తన
ఇగోను
వదులుకోలేనా
అని
ఇష్టం
లేకపోయినా
కాశీ
ఉద్యోగానికి
ఒప్పుకున్నాడు.
దీప
అసలు
రహస్యం
తెలుసుకోవాలని
కాంచన
పట్టు
శివన్నారాయణ
గారింటికి
వెళ్లొద్దని
కాంచన
చెప్పడంతో
దీప,
కార్తీక్‌లు
బాధపడ్డారు.
నువ్వే
ఆ
ఇంటికి
అసలైన
వారసురాలివన్న
నిజం
తెలిస్తే
మా
అమ్మ
ఒప్పుకుంటుందని
కార్తీక్
అనగానే,
“ఆ
నిజం
ఏంటీ?”
అని
కాంచన
ప్రశ్నించింది.
అనుకోకుండా
దీప
మేనత్త
అని
నోరు
జారింది.
ఎవరో
వచ్చి
తన
కోడలి
గురించి
చెప్పే
స్థాయికి
ఎందుకు
తీసుకొచ్చారని
కాంచన
మండిపడింది.
బాధలో
ఉన్న
ఆమె
శౌర్యపై
కసురుకోవడంతో
పాప
ఏడుస్తూ
లోపలికి
వెళ్లింది.
దీప,
శౌర్య
బాధపడటంతో
కార్తీక్
నలిగిపోతూ
ఎపిసోడ్
ముగుస్తుంది.


