Entertainment
oi-Kannaiah
కార్తీకదీపం
2
సీరియల్‌లో
ఉత్కంఠ
రోజురోజుకు
పెరుగుతోంది.
జ్యోత్స్న
అసలు
రంగు,
ఆమె
చేసిన
ఆర్థిక
మోసం
నేటి
ఎపిసోడ్‌లో
బయటపడింది.
మరోవైపు,
శివన్నారాయణకు
ఉన్న
ప్రమాదం
భయాన్ని
కార్తీక్
ధైర్యంగా
ఎదుర్కొనే
ప్రయత్నం
చేయడం
హైలైట్‌గా
నిలిచింది.
దాస్
హెచ్చరిక:
జ్యోత్స్న
వణుకు
గత
ఎపిసోడ్‌లో
దాస్
చెప్పిన
మాటలు
జ్యోత్స్నను
వణికించాయి.
“నువ్వు
ఎవరో?
దీప
ఎవరో
తొందరలోనే
ఈ
కుటుంబానికి
తెలుస్తుంది,”
అని
దాస్
హెచ్చరించడంతో
జ్యోత్స్న
భయపడుతుంది.
“దీప
కూతురు
గొప్పింటి
బిడ్డలాగే
ఈ
ఇంట్లో
అడుగుపెడుతుంది”
అని,
తాను
ఈ
ఇంట్లో
తిరిగి
అడుగుపెట్టే
పని
చేయొద్దని
దాస్
వార్నింగ్
ఇవ్వడం
జ్యోత్స్నను
మరింత
ఆందోళనకు
గురి
చేస్తుంది.
ప్రమాదంపై
కార్తీక్
ధైర్యం
గురువుగారు
చెప్పిన
రాబోయే
ప్రమాదం
గురించి
శివన్నారాయణ
కార్తీక్‌తో
తన
భయాన్ని
పంచుకున్నాడు.
తన
కుటుంబానికి,
తన
తల్లి
(కాంచన)
ఆనందానికి
ఏమీ
జరగకూడదని
ఆవేదన
వ్యక్తం
చేశాడు.
అందుకు
కార్తీక్
ధైర్యం
చెబుతూ,
“నా
తాత
కుటుంబానికి,
నా
కుటుంబానికి,
నా
బిడ్డకు
ఏం
జరగనివ్వను.
నా
ఇంటి
ముందు
పోతురాజులా
నా
మనవడు
నిలబడ్డాడు,”
అని
ప్రమాదానికి
చెప్పమని
అంటాడు.
జ్యోత్స్న
రూపంలోనే
ఈ
ఇంట్లో
పెద్ద
ప్రమాదం
ఉందని
కార్తీక్
గ్రహిస్తాడు.
జ్యోత్స్న
క్రూరమైన
ప్రణాళిక
తల్లి
సుమిత్ర,
పారు
కూడా
దీపకు
మద్దతు
ఇవ్వడంతో
జ్యోత్స్న
రగిలిపోయింది.
“దీప
కడుపు
గురించి
మాట్లాడితేనే
తప్పయితే,
కడుపే
లేకుండా
చేస్తే
ఇంకెంత
తప్పు?”
అని
పారుతో
అంటుంది.
“దీప
కడుపులో
బిడ్డ
ఈ
భూమ్మీదకు
రాకూడదు,
ఆ
బిడ్డను
బతకనివ్వను,”
అని
తన
క్రూరమైన
నిర్ణయాన్ని
బయటపెడుతుంది.
దీప
వల్లనే
తన
జీవితం
అనుకున్నట్లుగా
లేకుండా
పోయిందని,
ఆమె
బిడ్డను
బతకనివ్వనని
శపథం
చేస్తుంది.
సుమిత్ర
ఓదార్పు..
పెళ్లి
ఆలోచన
జ్యోత్స్న
మాటలకు
బాధపడిన
దీపను
సుమిత్ర
ఓదార్చింది.
గర్భవతి
అయిన
ఆడది
గర్భగుడిలో
ఉన్న
దేవత
లాంటిదని
చెప్పింది.
జ్యోత్స్నకు
కార్తీక్‌పై
ఈర్ష్య
ఉందని,
సీఈవో
పదవి
విషయం
కూడా
కలిసి
రాకపోవడంతో,
దీప
తల్లి
కావడం
ఆమెకు
నిద్ర
లేకుండా
చేసిందని
సుమిత్ర
విశ్లేషించింది.
ఈ
సమస్యకు
పరిష్కారంగా,
జ్యోత్స్నకి
మంచి
సంబంధం
చూసి
త్వరగా
పెళ్లి
చేసేస్తామని
సుమిత్ర,
కార్తీక్‌తో
అంటుంది.
రూ.2.34
కోట్ల
స్కామ్
రివీల్
ఈ
ఎపిసోడ్‌లో
అత్యంత
నాటకీయ
మలుపు
ఏంటంటే,
శ్రీధర్
ఇంట్లోకి
వచ్చి
కంపెనీ
అకౌంట్స్
చెక్
చేశానని,
క్లోజింగ్
బ్యాలెన్స్‌కి
రూ.2.34
కోట్లు
టాలీ
కావడం
లేదని
చెప్పడం.
ఆ
మొత్తం
మాజీ
సీఈవో
జ్యోత్స్న
ఖాతాకు
ట్రాన్స్‌ఫర్
అయినట్లు
శ్రీధర్
బయటపెట్టడంతో
ఇంట్లో
అందరూ
షాక్
అవుతారు.
జ్యోత్స్నను
శివన్నారాయణ,
దశరథ
నిలదీయగా,
డబ్బును
ల్యాండ్
కొనడానికి
వాడానని,
మమ్మీ
పెళ్లి
రోజుకు
గిఫ్ట్‌గా
ఇవ్వాలని
అనుకున్నానని
అబద్ధం
చెబుతుంది.
“నువ్వు
చెప్పేది
పచ్చి
అబద్ధం,”
అంటూ
కార్తీక్
కౌంటర్
ఇస్తాడు.
కార్తీక్
కౌంటర్
విని
కోపంతో
రగిలిపోయిన
పారిజాతం
జ్యోత్స్నను
లాగిపెట్టి
కొడుతుంది.
అల్లుడు
కదా
అని
సీఈవో
పదవి
ఇస్తే,
అత్తారింట్లోనే
నిప్పుపెడుతున్నాడని
శ్రీధర్‌పై
పారిజాతం
మండిపడుతుంది.తదుపరి
ఎపిసోడ్‌లో
ఈ
ఆర్థిక
మోసం
వెనుక
నిజం
ఏంటో
బయటపడనుంది.


