Andhra Pradesh
oi-Syed Ahmed
దక్షిణ
మధ్య
రైల్వే
పరిధిలో
యశ్వంత్
పూర్
నుంచి
మచిలీపట్నానికి
ప్రయాణించే
కొండవీడు
ఎక్స్
ప్రెస్
సమయాల్లో
మార్పు
జరిగింది.
వివిధ
కారణాలతో
ఇలా
కొండవీడు
ఎక్స్
ప్రెస్
సమయాల్లో
మార్పు
చేసినట్లు
తెలుస్తోంది.
సవరించిన
సమయాలను
దక్షిణ
మధ్య
రైల్వే
ఇవాళ
విడుదల
చేసింది.
ఇప్పటివరకూ
కొండవీడు
ఎక్స్
ప్రెస్
మధ్యాహ్నం
1.15కు
యశ్వంత్
పూర్
లో
బయలుదేరుతుండగా..
దాన్ని
ఇప్పుడు
ముందుకు
జరిపి
12.45కు
బయలుదేరేలా
మార్చారు.
సవరించిన
షెడ్యూల్
ప్రకారం
యశ్వంత్
పూర్
లో
మధ్యాహ్నం
12.45కు
బయలుదేరనున్న
కొండవీడు
ఎక్స్
ప్రెస్..
1.05కు
యలహంక,
2.10కి
హిందూపూర్,
2.40కి
పెనుకొండ,
3.01కి
సత్యసాయి
ప్రశాంతి
నిలయం,
3.55కు
ధర్మవరం,
4.33కు
అనంతపురం,
5.28కి
గుత్తి,
సాయంత్రం
6.28కి
డోన్,
7.03కు
బేతచర్ల,
8.20కి
నంద్యాల,
8.59కి
గిద్దలూరుకు
రానుంది.
రాత్రి
9.29కి
కంభం,
9.59కి
మార్కాపూర్
రోడ్డు,
10.24కు
దొనకొండ,
అర్ధరాత్రి
12.24కు
నరసరావుపేటలో
ఆగనుంది.
ఆ
తర్వాత
గుంటూరుకు
అర్ధరాత్రి
1
గంటకు,
తెల్లవారుజామున
2.50కు
విజయవాడకు,
3.48కి
విజయవాడకు,
5.15కు
మచిలీపట్నానికి
చేరుకుంటుంది.
దీంతో
కొండవీడు
ఎక్స్
ప్రెస్
ప్రయాణం
ముగియనుంది.
అయితే
ఈ
టైం
టైబుల్
కొత్త
ఏడాదిలో
జనవరి
1
నుంచి
అమల్లోకి
వస్తుందని
దక్షిణ
మధ్య
రైల్వే
ప్రకటించింది.
దీంతో
జనవరి
నుంచి
ప్రయాణాలు
చేసే
వారు
ఈ
కొత్త
షెడ్యూల్
ను
బట్టి
తమ
గమ్య
స్ధానాలకు
టికెట్లు
బుక్
చేసుకోవాల్సి
ఉంటుందని
అధికారులు
తెలిపారు.


