LPG గ్యాస్‌ బుకింగ్‌ల పేరుతో నేరగాళ్లు మోసాలు.. మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా..?

Date:


oi
-Suravarapu Dileep

LPG Gas cylinder scams : ఇరాన్‌ తో యుద్ధం కారణంగా దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలపై ప్రజల్లో భయాందోళనలు అలముకున్నాయి. దేశంలో LPG కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా.. ప్రజలు మాత్రం గ్యాస్‌ స్టేషన్‌లు, పెట్రోల్‌ స్టేషన్‌ ల వద్ద క్యూ లు కడుతున్నారు. అవసరానికి మించి గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్‌ చేస్తున్నారు. అయితే దేశంలో సరిపడా గ్యాస్‌, చమురు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.

భారీగా పెరిగిన బుకింగ్‌లు :
యుద్ధానికి ముందు పరిస్థితితో పోలిస్తే బుకింగ్‌ల సంఖ్య భారీగా పెరిగినట్లు కేంద్రం చెబుతోంది. గతంలో రోజువారీ 55.7 లక్షల సిలిండర్ల బుకింగ్‌ ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 75.7 లక్షలకు పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశీయంగా LPG ఉత్పత్తులను భారీగా పెంచినట్లు తెలిపింది.

అయితే ప్రజలు మాత్రమే ముందస్తుగా LPG బుకింగ్‌ కోసం క్యూ లు కడుతున్నారు. ఫోన్‌, వెబ్‌సైట్‌, యాప్‌ల ద్వారా బుకింగ్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి అందినకాడికి దోచుకుంటున్నారు.

ఫాస్ట్‌ డెలివరీ పేరుతో మోసాలు :
నకిలీ వెబ్‌సైట్‌లు, నకిలీ మెసేజ్‌లతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ సంస్థల లోగోలను ఉపయోగించి, నకిలీ ప్రకటనలిస్తున్నారు. ఫాస్ట్‌ డెలివరీ పేరుతో మెసేజ్‌లు పంపుతున్నారు. సరైన అవగాహన లేకపోవడం, గ్యాస్‌ కొరతపై తప్పుడు ప్రచారంతో మోసాల బారిన పడుతున్నారు.

నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు :
HP, భారత్‌ గ్యాస్‌, ఇందేన్‌ గ్యాస్‌ వంటి సంస్థల అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే నకిలీ లింక్స్‌ ను నేరగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తున్నారు. బుకింగ్‌ కన్ఫర్మ్ కావాలంటే కొంత పేమెంట్‌ చేయాలని సూచిస్తున్నారు. నకిలీ లింక్స్ పైన క్లిక్ చేయగానే, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

దీంతోపాటు KYC పూర్తి చేసేందుకు వీలుగా తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని, దరఖాస్తును పూర్తించాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈ లింక్స్‌ పైన క్లిక్‌ చేస్తున్న వారి ఫోన్‌లను హ్యాక్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే :
LPG బుకింగ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లను మాత్రమే ఆశ్రయించండి. గ్యాస్‌ బుక్‌లు, గ్యాస్‌ ఏజెన్సీలు ఇచ్చిన పత్రాల్లోనే ఇందుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆయా వెబ్‌సైట్‌ల ద్వారానే బుకింగ్‌ చేసుకోండి. వాట్సాప్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా ద్వారా వస్తున్న లింక్స్‌ ను క్లిక్‌ చేయవద్దు.

* పొరపాటున ఏదైనా అనుమానాస్పద లింక్‌ పైన క్లిక్‌ చేస్తే, వెంటనే సైబర్‌ క్రైమ్ హెల్‌లైన్ నంబర్‌ 1930 కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి. లేదా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ ద్వారాను ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది.

Best Mobiles in India



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related