LPG to PNG: కమర్షియల్ గ్యాస్ యూజర్లకు కేంద్రం షాక్..! ఇకపై ఇలా..!

Date:


India

oi-Syed Ahmed

ఇరాన్ వార్ ప్రభావం భారత్ పై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే యుద్దం మొదలై 16 రోజులు దాటిపోవడం, దేశీయంగా ఎల్పీజీ (LPG) సరఫరా గణనీయంగా తగ్గడం, ఇదే అదనుగా ఎక్కడికక్కడ గ్యాస్ సిలెండర్లు బ్లాక్ చేసేస్తున్న పరిస్ధితులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కమర్షియల్ సిలెండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటల్లు మూతపడే పరిస్ధితి వచ్చేసింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ కమర్షియల్ గ్యాస్ యూజర్లకు కీలక సూచన చేసింది.

ఎల్పీజీ సరఫరాలపై ఒత్తిడిని తగ్గించడానికి, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులు వీలైనంత వరకు పైపుల ద్వారా సహజ వాయువుకు (PNG)మారాలని ప్రభుత్వం కోరింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఇవాళ మాట్లాడుతూ.. అనేక కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను స్వీకరించేలా ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయని చెప్పారు.

మార్చి 31కి ముందు పీఎన్జీ కనెక్షన్ తీసుకొని గ్యాస్ కొనుగోలు ప్రారంభించే గృహ వినియోగదారులకు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ రూ.500 విలువైన ఉచిత గ్యాస్‌ను అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. క్లీనర్ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా గెయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పీఎన్జీ మార్పును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని శర్మ తెలిపారు.

మరోవైపు ఇరాన్ పక్కన ఉన్న హార్ముజ్ జలసంధి నుంచి బయటపడిన భారత నౌక శివాలిక్‌ ఖతార్‌ నుంచి ఇవాళ ముంద్రా పోర్టుకు చేరుకుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్‌పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్‌లో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ ను తీసుకొచ్చింది. ఖతార్ లోని రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దగ్గర్లో ఉంది. ఇది రేపు ఉదయం ఆరున్నర గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని అంచనా. ఈ రెండు నౌకలు కలిపి తీసుకున్న వస్తున్న ఎల్పీజీ గ్యాస్‌ 92,700 మెట్రిక్ టన్నులు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Nvidia’s DLSS 5 uses generative AI to boost photo-realism in video games, with ambitions beyond gaming

Nvidia CEO Jensen Huang used the company’s keynote at...

How to minimize the pain of travel disruptions

People wait in long TSA lines as the partial...

Billboard House, Stage Best Pics

Don Toliver, Junior H and Mau P were among...