International
oi-Lingareddy Gajjala
బిల్
గేట్స్
మాజీ
భార్య
మెలిండా
ఫ్రెంచ్
గేట్స్,
జెఫ్రీ
ఎప్‌స్టీన్‌కు
సంబంధించిన
తాజా
పత్రాలు
తనను
తీవ్రంగా
కలచివేశాయని
వెల్లడించారు.
గత
వారం
ప్రజల
ముందుకు
వచ్చిన
ఈ
డాక్యుమెంట్లు
తన
జీవితంలో
ఎదుర్కొన్న
బాధాకరమైన
రోజులను
మళ్లీ
గుర్తు
చేశాయని
ఆమె
వ్యాఖ్యానించారు.
ఈ
విషయంపై
ఆమె
ఒక
పాడ్‌కాస్ట్
ప్రివ్యూ
వీడియోలో
స్పందించారు.
2021లో
బిల్
గేట్స్‌తో
విడాకులు
తీసుకున్న
మెలిండా,
ఎప్‌స్టీన్
వ్యవహారాలకు
సంబంధించిన
ప్రశ్నలకు
తాను
సమాధానం
చెప్పాల్సిన
అవసరం
లేదని
స్పష్టం
చేశారు.
“ఆ
ప్రశ్నలు
వారికి
సంబంధించినవి,
నాకు
కాదు”
అంటూ,
ఈ
వివాదాల
నుంచి
తాను
బయటకు
వచ్చానన్న
సంతృప్తిని
వ్యక్తం
చేశారు.
జెఫ్రీ
ఎప్‌స్టీన్‌పై
కొనసాగిన
విచారణలో
భాగంగా,
అమెరికా
న్యాయ
శాఖ
ఇటీవల
దాదాపు
30
లక్షల
పేజీల
పత్రాలను
విడుదల
చేసింది.
ఈ
ఫైళ్లలో
ఎప్‌స్టీన్‌కు
సంబంధించిన
ఇమెయిళ్లు,
చిత్తు
నోట్స్
ఉండటంతో,
బిల్
గేట్స్‌తో
అతడికి
ఉన్న
సంబంధాలపై
మరోసారి
చర్చ
మొదలైంది.
ముఖ్యంగా
2013
నాటి
కొన్ని
సందేశాలు
ఎవరు
రాశారన్నది
స్పష్టంగా
లేకపోయినా,
అవి
గేట్స్
కుటుంబానికి
సంబంధించిన
వ్యక్తిగత
అంశాలను
ప్రస్తావిస్తున్నట్లు
తెలుస్తోంది.
ఆరోపణలు
పూర్తిగా
అవాస్తవం..
అయితే,
ఈ
వ్యవహారాల్లో
బిల్
గేట్స్‌పై
ఎటువంటి
నేర
ఆరోపణలు
లేవు.
ఆయన
ప్రతినిధి
స్పందిస్తూ,
ఈ
పత్రాల్లో
ఉన్న
ఆరోపణలు
పూర్తిగా
అవాస్తవమని
తెలిపారు.
ఎప్‌స్టీన్
గేట్స్‌తో
సంబంధం
ఉన్నట్టుగా
చూపించేందుకు
ప్రయత్నించిన
ఆధారాలే
ఇవి
తప్ప,
వాస్తవ
సంబంధం
లేదని
స్పష్టం
చేశారు.
ఈ
నేపథ్యంలో
బిల్
గేట్స్
కూడా
స్పందించారు.
ఎప్‌స్టీన్‌తో
గడిపిన
సమయం
పట్ల
తనకు
పశ్చాత్తాపం
ఉందని,
అతనితో
సంబంధం
పెట్టుకున్నది
తప్పేనని
పునరుద్ఘాటించారు.
తాను
కేవలం
కొన్ని
విందులకు
మాత్రమే
హాజరయ్యానని,
ఎప్పుడూ
అతని
ద్వీపానికి
వెళ్లలేదని,
ఎటువంటి
చట్టవిరుద్ధ
కార్యకలాపాలకు
సంబంధం
లేదని
స్పష్టం
చేశారు.
గుండెలు
పగిలేంత
బాధాకరం..
మెలిండా
ఫ్రెంచ్
గేట్స్
మాట్లాడుతూ,
ఈ
తాజా
వివరాలు
తన
వివాహ
జీవితంలో
ఎదురైన
అత్యంత
కఠినమైన
దశలను
మళ్లీ
గుర్తు
చేశాయని
తెలిపారు.
అయితే,
తన
వ్యక్తిగత
బాధకంటే
కూడా
ఎప్‌స్టీన్
బాధితుల
పరిస్థితి
తనను
ఎక్కువగా
కలచివేసిందని
అన్నారు.
చిన్నారులు,
యువతులు
ఎదుర్కొన్న
దారుణాలు
“గుండెలు
పగిలేంత
బాధాకరం”
అని
వ్యాఖ్యానించారు.
ఇప్పుడు
తాను
జీవితంలో
ముందుకు
సాగుతున్నానని,
ఎప్‌స్టీన్
బాధితులకు
న్యాయం
జరగాలని
హృదయపూర్వకంగా
కోరుకుంటున్నట్లు
మెలిండా
తెలిపారు.
ఈ
వ్యవహారం
మరోసారి
ప్రముఖులు,
అధికారిక
వ్యవస్థలు
బాధ్యతాయుతంగా
వ్యవహరించాల్సిన
అవసరాన్ని
గుర్తు
చేస్తోందని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.


