Telangana
oi-Chandrasekhar Rao
అర్జెంటీనాకు
చెందిన
ఫుట్‌బాల్
దిగ్గజం
లియోనెల్
మెస్సీ..
భారత్
లో
అడుగు
పెట్టాడు.
ఈ
వేకువ
జామున
2:25
నిమిషాలకు
కోల్
కత
చేరుకున్నాడు.
లూయిస్
సువారెజ్
రోడ్రిగో
డి
పాల్
తో
కలిసి
వచ్చారు.
ఎముకలు
కొరికే
చలిలోనూ
ఇక్కడి
నేతాజీ
సుభాష్
చంద్రబోస్
అంతర్జాతీయ
విమానాశ్రయం
వద్ద
వందలాది
మంది
అభిమానులు
అతనికి
ఘన
స్వాగతం
పలికారు.
బ్రహ్మరథం
పట్టారు.
అర్జెంటీనా
జాతీయ
పతాకాలను
చేతపట్టుకుని
దారిపొడవునా
కనిపించారు.
2011
తర్వాత
మెస్సీ
భారత్
కు
రావడం
ఇదే
తొలిసారి.
హైదరాబాద్,
ముంబై,
ఢిల్లీల్లో
పర్యటించనున్నాడు
మెస్సీ.
ప్రధానమంత్రి
నరేంద్ర
మోదీని
కలుసుకోనున్నాడు.
అలాగే-
వివిధ
రాష్ట్రాల
ముఖ్యమంత్రులు,
పారిశ్రామిక
దిగ్గజాలు,
బాలీవుడ్
ప్రముఖులతో
భేటీ
కానున్నాడు.
ఈ
పర్యటనలో
భాగంగా
ఈ
సాయంత్రం
మెస్సీ
హైదరాబాద్
కు
రానున్నాడు.
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
టీమ్
తో
కలిసి
ఓ
ఎగ్జిబిషన్
మ్యాచ్
ఆడనున్నాడు.
ఉప్పల్
స్టేడియం
దీనికి
వేదిక.
మెస్సీతో
తలపడటానికి
రెండు
వారాలుగా
ప్రాక్టీస్
చేస్తూ
వస్తోన్నారు
రేవంత్.
ఈ
మ్యాచ్‌కు
సంబంధించి
రాచకొండ
పోలీసులు
కీలక
ట్రాఫిక్
అడ్వైజరీ
విడుదల
చేశారు.
ఈ
మధ్యాహ్నం
2
గంటల
నుండి
రాత్రి
11:50
వరకు
ఈ
ట్రాఫిక్
ఆంక్షలు
అమలులో
ఉంటాయి.
ఫలక్‌నుమా-ఉప్పల్
(సంతోష్‌నగర్
మీదుగా),
సికింద్రాబాద్-ఉప్పల్
(హబ్సిగూడ
మీదుగా)
మార్గాల్లో
వాహనాలను
మళ్లించారు.
ఈ
మార్గంలో
రాకపోకలు
సాగించే
వాహనదారులు
ఆర్టీసీ
బస్సులు
లేదా
మెట్రో
రైలు
వంటి
ప్రజా
రవాణాను
ఉపయోగించాలని
సూచించారు.
ఈ
మ్యాచ్
ను
తిలకించడానికి
కాంగ్రెస్
పార్టీ
మాజీ
అధినేత,
లోక్‌సభలో
ప్రతిపక్ష
నేత
రాహుల్
గాంధీ
హైదరాబాద్
కు
రానున్నారు.
ఈ
మధ్యాహ్నం
2:15
నుండి
4:15
నిమిషాల
సమయంలో
ఢిల్లీ
నుండి
ప్రత్యేక
విమానంలో
హైదరాబాద్
వస్తారు.
ఫలక్‌నుమా
ప్యాలెస్
హోటల్లో
బస
చేయనున్నారు.
అనంతరం
సాయంత్రం
6:30-
7
గంటల
మధ్య
ఉప్పల్
స్టేడియానికి
చేరుకుంటారు.
మెస్సీ,
రేవంత్
రెడ్డి
మధ్య
ఫ్రెండ్లీ
ఫుట్‌బాల్
మ్యాచ్
వీక్షిస్తారు.
అనంతరం
ఢిల్లీకి
తిరిగి
ప్రయాణిస్తారు.
పర్యటనకు
ముందు
భద్రత
కట్టుదిట్టం
చేశారు.
కాంగ్రెస్
లోక్
సభ
సభ్యురాలు
ప్రియాంక
గాంధీ
వాద్రా
కూడా
మ్యాచ్
తిలకించడానికి
వచ్చే
అవకావం
ఉంది.
వారిద్దరినీ
ఇదివరకే
ఆహ్వానించారు
రేవంత్
రెడ్డి.
స్వయంగా
వారిని
కలిసి
ఆహ్వనపత్రాన్ని
అందించారు.
ఈ
హై
ప్రొఫైల్
గేమ్
కు
రాహుల్,
ప్రియాంక
వస్తారనే
విషయాన్ని
ముఖ్యమంత్రి
కార్యాలయం
ఇంకా
నిర్ధారించలేదు.


