India
oi-Lingareddy Gajjala
పశ్చిమ
బెంగాల్‌లో
తాజాగా
నమోదైన
నిఫా
వైరస్
(Nipah
virus)
కేసుల
నేపథ్యంలో
ప్రజలు
ఆందోళన
చెందాల్సిన
అవసరం
లేదని
ప్రపంచ
ఆరోగ్య
సంస్థ
(WHO)
స్పష్టంగా
భరోసా
ఇచ్చింది.
ప్రస్తుత
పరిస్థితుల్లో
ఈ
వ్యాధి
వ్యాప్తి
ప్రమాదం
“తక్కువగానే”
ఉందని,
రాష్ట్రాల
మధ్య
గానీ,
అంతర్జాతీయంగా
గానీ
వ్యాపించే
అవకాశం
లేదని
WHO
వెల్లడించింది.
అందువల్ల
ప్రయాణాలు,
వాణిజ్య
కార్యకలాపాలపై
ఎలాంటి
ఆంక్షలు
అవసరం
లేదని
స్పష్టం
చేసింది.
నార్త్
24
పరగణాల
జిల్లాలోని
బారసత్
ప్రాంతంలో
ఒకే
ప్రైవేట్
ఆసుపత్రిలో
పనిచేస్తున్న
ఇద్దరు
25
ఏళ్ల
నర్సులకు
నిఫా
వైరస్
సోకినట్లు
గుర్తించారు.
ఒకరు
మహిళ,
మరొకరు
పురుషుడు.
డిసెంబర్
2025
చివరి
వారంలో
వారికి
సాధారణ
లక్షణాలు
ప్రారంభమై,
తరువాత
నరాల
సంబంధిత
సమస్యలుగా
మారాయి.
వెంటనే
అప్రమత్తమైన
వైద్యులు
వారిని
జనవరి
తొలి
వారంలో
ఐసోలేషన్‌లో
ఉంచారు.
ఉన్నవారందరికీ
నెగటివ్
కేసులు
నిర్ధారణ
అయిన
వెంటనే
కేంద్ర,
రాష్ట్ర
ఆరోగ్య
శాఖలు
విస్తృత
స్థాయి
ప్రజారోగ్య
చర్యలను
ప్రారంభించాయి.
ఈ
ఇద్దరితో
క్లోజ్
గా
ఉన్న
196
మందిని
గుర్తించి,
పర్యవేక్షించి,
పరీక్షలు
నిర్వహించారు.
వీరందరిలోనూ
వైరస్
లక్షణాలు
లేవని,
పరీక్షల్లో
నెగటివ్‌గా
తేలిందని
డబ్ల్యూహెచ్‌ఓ
తెలిపింది.
జనవరి
27
నాటికి
కొత్త
కేసులు
నమోదు
కాకపోవడం
ఊరటనిచ్చే
అంశమని
పేర్కొంది.
పశ్చిమ
బెంగాల్‌లో
పండ్ల
గబ్బిలాలు
ఉండటం
భారీ
ప్రమాదాన్ని
అంచనా
వేసినప్పటికీ,
దేశవ్యాప్తంగా
లేదా
ప్రపంచవ్యాప్తంగా
వ్యాప్తి
చెందే
ప్రమాదం
మాత్రం
తక్కువేనని
డబ్ల్యూహెచ్‌ఓ
స్పష్టం
చేసింది.
“ప్రస్తుత
ఆధారాల
ప్రకారం
ప్రయాణాలు,వాణిజ్యంపై
ఎలాంటి
ఆంక్షలు
విధించాల్సిన
అవసరం
లేదు”
అని
స్పష్టమైన
ప్రకటన
చేసింది.
కేంద్ర
ప్రభుత్వం
ప్రత్యేక
వ్యాప్తి
నియంత్రణ
బృందాన్ని
పశ్చిమ
బెంగాల్‌కు
పంపి,
రాష్ట్ర
అధికారులతో
కలిసి
పటిష్టమైన
నిఘా,
ప్రయోగశాల
పరీక్షలు,
ఇన్‌ఫెక్షన్
నివారణ
చర్యలు
చేపట్టింది.
క్షేత్రస్థాయి
విచారణలు,
ఆసుపత్రుల్లో
భద్రతా
చర్యలు
మరింత
కట్టుదిట్టంగా
అమలు
చేస్తున్నట్లు
డబ్ల్యూహెచ్‌ఓ
తెలిపింది.
ఈ
సమన్వయ
చర్యల
వల్ల
వ్యాప్తిని
సకాలంలో
నియంత్రించగలిగామని
పేర్కొంది.
నిపా
వైరస్‌పై
అవగాహనే
రక్షణ
నిపా
వైరస్
ప్రధానంగా
గబ్బిలాల
నుంచి
మనుషులకు
వ్యాపించే
జూనోటిక్
వ్యాధి.
కలుషిత
ఆహారం
లేదా
సన్నిహిత
పరిచయం
ద్వారా
సంక్రమించే
అవకాశం
ఉంటుంది.
ప్రస్తుతం
దీనికి
ప్రత్యేక
టీకా
లేదా
నిర్దిష్ట
చికిత్స
అందుబాటులో
లేకపోయినా,
ముందస్తు
గుర్తింపు,
సహాయక
చికిత్స,
ఇన్‌ఫెక్షన్
నియంత్రణ
చర్యలతో
ప్రాణాలను
కాపాడవచ్చని
వైద్య
నిపుణులు
చెబుతున్నారు.
భారతదేశంలో
గత
అనుభవం
ఇది
భారత్‌లో
నమోదైన
ఏడవ
నిఫా
వ్యాప్తి.
పశ్చిమ
బెంగాల్‌లో
సిలిగురి
(2001),
నాడియా
(2007)
తర్వాత
ఇది
మూడవ
ఘటన.
నిఫా
వ్యాప్తి
చరిత్ర
ప్రధానంగా
భారత్,
బంగ్లాదేశ్‌కే
పరిమితమైందని,
మనుషుల
నుంచి
మనుషులకు
వ్యాప్తి
చాలా
అరుదుగా
జరుగుతుందని
డబ్ల్యూహెచ్‌ఓ
గుర్తు
చేసింది.
ఇప్పటివరకు
ప్రయాణాల
ద్వారా
అంతర్జాతీయంగా
వ్యాపించిన
ఘటనలు
లేవని
కూడా
స్పష్టం
చేసింది.
ప్రజలకు
ఆరోగ్య
శాఖ
సూచనలు
ప్రజలు
భయపడాల్సిన
అవసరం
లేదని,
అయితే
సాధారణ
జాగ్రత్తలు
పాటించాలని
ఆరోగ్య
శాఖ
సూచిస్తోంది.
అనుమానాస్పద
లక్షణాలు
కనిపిస్తే
వెంటనే
వైద్యులను
సంప్రదించాలని,
అధికారిక
సమాచారాన్నే
నమ్మాలని
కోరింది.
అప్రమత్తత,
అవగాహన,
సమన్వయం
ఉంటే
నిపా
వంటి
వ్యాధులను
సమర్థవంతంగా
నియంత్రించవచ్చని
నిపుణులు
చెబుతున్నారు.


