Andhra Pradesh
oi-Korivi Jayakumar
ఆంధ్రప్రదేశ్‌లోని
అంబేద్కర్
కోనసీమ
జిల్లాలో
ONGC
లీక్
మంటలు
ఇంకా
చల్లారలేదు.
మలికిపురం
మండలం
ఇరుసుమండ
లోని
మోరి
బావి
నంబరు
ఐదులో
సంభవించిన
బ్లో
అవుట్
కొనసాగుతోంది.
గ్యాస్
ఒత్తిడి
తగ్గడం
వల్ల
మంటల
తీవ్రత
చాలా
వరకూ
తగ్గినట్టు
అధికారులు
వెల్లడించారు.
అయితే
గ్యాస్
ఒత్తిడి
పెరిగినప్పుడు
మాత్రం
మంటలు
ఒక్కోసారి
ఎగసిపడుతున్నాయని
వివరించారు.
దీంతో
ఈ
బావిని
పూర్తి
స్థాయిలో
మూసేయడంపై
ఇంకా
నిర్ణయం
తీసుకోలేదని
స్పష్టం
చేస్తున్నారు.
రాజమహేంద్రవరం,
నరసాపురం,
తూర్పుపాలెం
గ్యాస్
కలెక్షన్
స్టేషన్ల
(జీసీఎస్)
నుంచి
వచ్చిన..
విపత్తు
నివారణ
బృందాలు
మంటలను
అదుపు
చేసేందుకు
శ్రమిస్తున్నారు.
కానీ
మంటల
తీవ్రతకు
బావి
వద్ద
రిగ్
పడిపోవడంతో
పాటు
పైపులూ
కరిగిపోయినట్టు
తెలుస్తోంది.
మంటలు
ఇంకా
పూర్తిగా
అదుపులోకి
రాకపోవడంతో
అధికారులు,
ఇంజినీర్లు
దూరం
నుంచే
పర్యవేక్షిస్తున్నారు.
ఒకేసారి
మంటలు
అదుపు
చేయడం
వల్ల
ఇబ్బందులు
తలెత్తుతాయని..
అందుకే
క్రమక్రమంగా
నాలుగు
రోజుల్లో
మంటలను
అదుపు
చేయనున్నట్టు
ఓఎన్జీసీ
వర్గాలు
చెబుతున్నాయి.
అలానే
ముంబై
నుంచి
ప్రత్యేక
నిపుణులతో
కూడిన
గ్యాస్
లీకేజీ
నియంత్రణ
బృందాలు
సైతం
పనుల్లో
నిమగ్నమయ్యారు.
కాగా
ఈ
బావిలో
సుమారు
40
వేల
మిలియన్
క్యూబిక్
మీటర్ల
గ్యాస్
ఉందని
భావిస్తున్నారు.
ఎన్ని
మీటర్ల
లోతు
నుంచి
పైప్‌లైన్
దెబ్బ
తిందనే
దానిపై
అంచనా
వేస్తున్నారు.
మరోవైపు
బావి
వద్ద
కరిగిపోయిన
ఐరన్
పైపులు,
రిగ్
మెటీరియల్
తొలగించేందుకు
వెల్‌క్యాప్,
భారీ
క్రేన్‌లను
తరలించారు.
వారం
రోజుల్లో
క్యాపింగు
చేసేందుకు
ప్రణాళిక
సిద్ధం
చేస్తున్నారు.
పునరావాస
కేంద్రాల్లోనే..
ఇక
ఘటనా
స్థలానికి
సమీపంలోని
రెండు
గ్రామాల
ప్రజలు
చాలా
మంది
ఇంకా
పునరావాస
కేంద్రాల్లోనే
ఉంటున్నారు.
అయితే
ఇదే
సమయంలో
దొంగలు
చేతివాటం
ప్రదర్శిస్తున్నారని
ఆరోపణలు
వినిపిస్తున్నాయి.
తమ
పెంపుడు
మేకలను
దొంగలు
ఎత్తుకు
పోయారని
ఒకరు
ఫిర్యాదు
చేసినట్టు
సమాచారం.
మొత్తంగా
కోనసీమ
ప్రాంతంలో
గ్యాస్
లీక్‌లు,
బ్లో
అవుట్‌లు
తరచుగా
జరుగుతుండటంతో
ప్రజల్లో
తీవ్ర
అసంతృప్తి
వ్యక్తమవుతోంది.
చమురు,
సహజ
వాయు
వెలికితీత
పేరుతో
కోనసీమను
“నిప్పుల
కొలిమి”గా
మారుస్తున్నారంటూ
స్థానికులు
ఆవేదన
వ్యక్తం
చేస్తున్నారు.
ఓఎన్‌జీసీ
భద్రతా
ప్రమాణాలను
సరిగా
అమలు
చేయడంలో
విఫలమవుతోందన్న
విమర్శలు
కూడా
వెల్లువెత్తుతున్నాయి.


