India
oi-Lingareddy Gajjala
ఉద్యోగుల
భవిష్య
నిధి
(PF)
ఖాతా
నుంచి
డబ్బు
తీసుకోవాలనుకునేవారికి
ఈపీఎఫ్‌ఓ
(EPFO)
కీలక
అలర్ట్
ఇచ్చింది.
అవసరమని
చెప్పి
పీఎఫ్
నుంచి
నగదు
విత్‌డ్రా
చేసి,
ఆ
మొత్తాన్ని
వేరే
అవసరాలకు
వినియోగిస్తే
తీవ్ర
పరిణామాలు
ఎదుర్కోవాల్సి
వస్తుందని
స్పష్టం
చేసింది.
అవసరమైతే
తీసుకున్న
మొత్తం
మాత్రమే
కాదు,
అదనంగా
జరిమానా
కూడా
చెల్లించాల్సి
వచ్చే
పరిస్థితి
ఉందని
హెచ్చరించింది.
సాధారణంగా
ఉద్యోగి
58
సంవత్సరాలు
పూర్తి
చేసిన
తర్వాత
లేదా
రిటైర్మెంట్
సమయంలోనే
పీఎఫ్
మొత్తాన్ని
పూర్తిగా
ఉపసంహరించుకునే
అవకాశం
ఉంటుంది.
అయితే
అత్యవసర
పరిస్థితుల్లో
–
ఇల్లు
కొనుగోలు
లేదా
నిర్మాణం,
వివాహం,
పిల్లల
చదువు,
తీవ్రమైన
అనారోగ్యం
వంటి
ప్రత్యేక
కారణాలతో
మాత్రమే
పాక్షిక
విత్‌డ్రాలకు
అనుమతి
ఉంటుంది.
ఈ
సందర్భాల్లో
కారణాన్ని
నిరూపించే
డాక్యుమెంట్లు
తప్పనిసరిగా
సమర్పించాలి.
ఉదాహరణకు,
ఇంటి
కోసం
పీఎఫ్
తీసుకుని
ఆ
డబ్బును
ఇతర
అవసరాలకు
వినియోగిస్తే,
ఆ
మొత్తాన్ని
తిరిగి
రికవర్
చేసే
పూర్తి
అధికారం
ఈపీఎఫ్‌ఓకు
ఉంటుంది.
ఈ
విషయాన్ని
తాజాగా
సోషల్
మీడియా
వేదికగా
మరోసారి
గుర్తు
చేసింది
ఈపీఎఫ్‌ఓ.
“తప్పుడు
కారణాలతో
పీఎఫ్
విత్‌డ్రా
చేస్తే,
ఈపీఎఫ్
స్కీమ్-1952
ప్రకారం
రికవరీ
చర్యలు
తప్పవు.
పీఎఫ్
అనేది
కేవలం
డబ్బు
కాదు…
మీ
భవిష్య
భద్రత”
అని
స్పష్టం
చేసింది.
సభ్యులు
నిబంధనలను
పాటిస్తూ,
సరైన
కారణాలతోనే
పీఎఫ్‌ను
వినియోగించాలని
సూచించింది.
నిబంధనలకు
విరుద్ధంగా
విత్‌డ్రా
చేసినట్లు
నిర్ధారణ
అయితే,
ఈపీఎఫ్
స్కీమ్-1952లోని
సెక్షన్
68బీ(11)
ప్రకారం
కఠిన
చర్యలు
తీసుకుంటారు.
అటువంటి
సభ్యులు
గరిష్ఠంగా
మూడేళ్ల
వరకు
పీఎఫ్
నుంచి
ఎలాంటి
అడ్వాన్స్
లేదా
విత్‌డ్రా
చేయలేరు.
అంతేకాదు,
తప్పుగా
వినియోగించిన
మొత్తం
వడ్డీతో
సహా
పూర్తిగా
తిరిగి
చెల్లించే
వరకు
కొత్త
క్లెయిమ్‌లకు
అనుమతి
ఉండదు.
ఇక
పీఎఫ్
విత్‌డ్రా
ప్రక్రియ
విషయానికి
వస్తే…
విద్య,
వైద్యం,
వివాహం,
గృహ
నిర్మాణం
వంటి
అవసరాల
కోసం
వేర్వేరు
ఫారాలు
అందుబాటులో
ఉన్నాయి.
ఫైనల్
సెటిల్‌మెంట్
కోసం
ఫారం-19,
పెన్షన్
విత్‌డ్రా
కోసం
ఫారం-10సీ,
పాక్షిక
క్లెయిమ్‌ల
కోసం
ఫారం-31
ఉపయోగించాలి.
ఈ
ప్రక్రియ
మొత్తం
ఆన్‌లైన్‌లోనే
పూర్తిచేయొచ్చు.
అయితే
ఇందుకు
యాక్టివ్
యూఏఎన్,
దానికి
అనుసంధానమైన
మొబైల్
నంబర్,
ఆధార్,
ఈ-కేవైసీ,
బ్యాంక్
అకౌంట్
వివరాలు
తప్పనిసరి.
మొత్తానికి,
పీఎఫ్‌ను
అవసరమైతే
మాత్రమే,
సరైన
కారణంతోనే
వాడాలి
అనే
విషయాన్ని
ఈపీఎఫ్‌ఓ
మరోసారి
గట్టిగా
గుర్తు
చేసింది.
చిన్న
నిర్లక్ష్యం
భవిష్య
భద్రతపై
పెద్ద
ప్రభావం
చూపొచ్చని
నిపుణులు
హెచ్చరిస్తున్నారు.


