India
oi-Syed Ahmed
డీఎంకే
ప్రభుత్వం
అవినీతి
కబంధ
హస్తాల
నుంచి
తమిళనాడును
విముక్తం
చేస్తామని
ప్రధాని
మోడీ
(pm
modi)
ఇవాళ
ప్రకటించారు.
రాష్ట్రంలోని
మధురాంతకంలో
ఇవాళ
తమిళనాడు
అసెంబ్లీ
ఎన్నికల
ప్రచారాన్ని
ఆయన
ప్రారంభించారు.
ఈ
సందర్భంగా
డీఎంకే
సర్కార్
పై
మోడీ
నిప్పులు
చెరిగారు.
స్టాలిన్
ప్రభుత్వం
అవినీతి,
మాఫియా,
నేరాల్లో
కూరుకుపోయిందని
మోడీ
తీవ్ర
ఆరోపణలు
చేశారు.
వీటి
నుంచి
విముక్తి
కల్పించాలంటే
ఈసారి
ఎన్డీయేకు
మద్దతుగా
నిలవాలని
ఓటర్లను
కోరారు.
తమిళనాడులో
డీఎంకే
ప్రభుత్వానికి
కౌంట్
డౌన్
మొదలైందని,
వీళ్లను
సాగనంపే
క్రమంలో
ప్రజలకు
తాము
సాయం
చేస్తామని
ప్రధాని
మోడీ
తెలిపారు.
తమిళనాడు
మార్పు
కోరుకుంటోందన్నారు.
డీఎంకే
ప్రభుత్వాని
ప్రజలు
ఇప్పటికే
రెండుసార్లు
అవకాశం
ఇచ్చారని,
అయినా
విఫలమైందని
మోడీ
ఆరోపించారు.
రాష్ట్రంలో
ప్రజాస్వామ్యం
లేదని,
అలాగే
డీఎంకే
కూటమి
ప్రభుత్వంపై
ప్రజలకు
నమ్మకం
సడలిపోయిందని
ఆయన
తెలిపారు.
తమిళనాడుకు
మేం
చేసింది
ఇదీ
గత
11
ఏళ్లలో
కేంద్ర
ప్రభుత్వం
తమిళనాడుకు
3
లక్షల
కోట్ల
నిధులు
ఇచ్చిందని
ప్రధాని
మోడీ
గుర్తుచేశారు.
ఇది
గత
యూపీఏ
ప్రభుత్వ
హయాంతో
పోలిస్తే
మూడు
రెట్లు
ఎక్కువన్నారు.
అయినా
డీఎంకే
సర్కార్
ఈ
నిధుల్ని
సద్వినియోగం
చేసుకోవడంలో
విఫలమైందన్నారు.
మేడ్
ఇన్
ఇండియా,
హై
స్పీడ్
వందే
భారత్‌ను
తమిళనాడుకు
తీసుకువస్తున్నామని
మోడీ
తెలిపారు.
యూపీఏ
ప్రభుత్వం
హయాంలో
తమిళనాడులో
రైల్వే
ప్రాజెక్టులకు
ఇచ్చిన
నిధుల
కంటే
7
రెట్లు
ఎక్కువ
నిధులు
తాము
ఇచ్చామని
మోడీ
గుర్తుచేశారు.
కీలక
సమయం-కలిసి
రండి..:
PM
Modi
భారత్
ఇవాళ
అనేక
అంతర్జాతీయ
ఒప్పందాలపై
సంతకం
చేస్తోందని
ఈ
కీలక
సమయంలో,
కేంద్రంతో
కలిసి
పనిచేసే
ప్రభుత్వం
వృద్ధికి
చాలా
అవసరమని
మోడీ
తెలిపారు.
కేంద్ర
ప్రభుత్వ
ముద్ర
పథకం
తమిళనాడు
ప్రజలకు
ఎంతో
మేలు
చేసిందని
గుర్తుచేశారు.
రాష్ట్రంలో
ఔషధాలు,
వైద్య
పరికరాల
తయారీకి
ఎన్డీఏ
మద్దతు
ఇస్తుందన్నారు.
ఎన్డీఏకు
వేసే
ప్రతి
ఓటు
డ్రగ్
మాఫియాకు
వ్యతిరేకంగా
వేసే
ఓటన్నారు.
జీ
ముఖ్యమంత్రి
జె.జయలలిత
చేసిన
పనులను
మోడీ
ప్రశంసించారు.
కాశీలో
తాము
తమిళ
చైర్‌ను
ఏర్పాటు
చేసామని
గుర్తుచేశారు.
డిఎంకె
తమిళ
సంస్కృతికి
శత్రువన్నారు.


