Post Office : రూ. లక్షకు రూ.44 వేలు వడ్డీ. బ్యాంకులకు దిమ్మతిరిగే షాక్

Date:


Business

oi-Lingareddy Gajjala

గత
ఏడాదిన్నర
కాలంగా
మ్యూచువల్
ఫండ్
(SIP)లలో
పెట్టుబడి
పెట్టిన
చాలా
మంది
ఇన్వెస్టర్లకు
ఆశించిన
ఫలితాలు
అందుకోలేకపోయారు.
కొన్ని
స్కీములు
వాటి
ద్వారా
వచ్చే
లాభాల
సంగతి
పక్కనపెడితే..
పూర్తిగా
నష్టాల
బాట
పట్టారు
కూడా.
దీంతో
చాలా
మందిలో
రిస్క్
భయం
మొదలైంది.

నేపథ్యంలోనే

పెట్టుబడిదారులు
ఇప్పుడు
స్థిరమైన,
గ్యారెంటీ
రాబడులు
ఇచ్చే
పెట్టుబడుల
వైపు
మళ్లీ
దృష్టి
సారిస్తున్నారు.

క్రమంలోనే
పోస్టాఫీసు
మంచి
స్కీమ్
తో
మన
ముందుకు
వచ్చింది.

రిస్క్
వద్దు,
పెట్టుబడికి
భద్రతే
ముద్దు
అనుకునేవారికి
పోస్ట్
ఆఫీస్
టైమ్
డిపాజిట్
(TD)
స్కీమ్
మంచి
ఛాయిస్.

స్కీమ్‌లో
పెట్టుబడి
కాలాన్ని
ఇన్వెస్టర్
అవసరాలకు
అనుగుణంగా
ఎంచుకునే
అవకాశం
ఉంటుంది.
ప్రస్తుతం
అందరికి
ఫిక్సిడ్
డిపాజిట్లు(FD)
లు,
PPF,
రికరింగ్
డిపాజిట్లు
(RD)లు,
సుకన్య
సమృద్ధి
యోజనతో
పాటు
పోస్ట్
ఆఫీస్
సేవింగ్స్
స్కీమ్లపై
ఆసక్తి
గణనీయంగా
పెరిగింది.

ముఖ్యంగా
ప్రభుత్వ
భరోసా
ఉండటంతో,
మధ్యతరగతి
కుటుంబాలు
పోస్ట్
ఆఫీస్
పెట్టుబడులను
సురక్షిత
మార్గంగా
భావిస్తున్నాయి.

క్రమంలోనే
పోస్టాఫీసు
టైమ్
డిపాజిట్‌పై
కల్పిస్తున్న
వడ్డీ
రేట్లు
ఒకసారి
చూద్దాం..
1
సంవత్సరం
పెట్టుబడికి
6.9%,
2
సంవత్సరాలకు
7.0%,
3
సంవత్సరాలకు
7.1%,
5
సంవత్సరాలకు
గరిష్ఠంగా
7.5%
వడ్డీ
అందుతోంది.


దీర్ఘకాలం
పెట్టుబడి
పెట్టాలనుకునే
వారికి..

ఉదాహరణకు,
మీరు
రూ.1
లక్షను
5
సంవత్సరాల
పాటు
టైమ్
డిపాజిట్
స్కీమ్‌లో
పెట్టుబడి
పెడితే,
మెచ్యూరిటీ
సమయంలో
మీ
చేతికి
మొత్తం
రూ.1,44,995
వస్తాయి.
అంటే
దాదాపు
రూ.44,995
వడ్డీ
రూపంలో
లాభం
లభిస్తుంది.
దీర్ఘకాలం
పెట్టుబడి
పెట్టాలనుకునే
వారికి
ఇది
ఆకర్షణీయమైన
ఎంపికగా
నిలుస్తోంది.
అయితే
ఇందులో
వెసులుబాటు
కూడా
ఉంది.
టైం
పిరియడ్
ఐదేళ్లకు
కాకుండా..
ఏడాది,
మూడేళ్లు,
ఐదేళ్లకు
కూడా
పెట్టుబడులు
పెట్టేలా
మంచి
సౌకర్యం
అందుబాటులో
ఉంది.


బ్యాంక్
FDలతో
పోలిస్తే..

ఇప్పటికే
బ్యాంక్
ఫిక్స్‌డ్
డిపాజిట్ల
వడ్డీ
రేట్లు
క్రమంగా
తగ్గుతూ
వస్తున్నాయి.
అదే
సమయంలో
పోస్ట్
ఆఫీస్
స్కీమ్స్‌లో
వడ్డీ
రేట్లు
కొంచెం
ఎక్కువగా
ఉండటంతో
పాటు
ప్రభుత్వ
హామీ
ఉండటం
వల్ల,
పెట్టుబడిదారులు

పథకాల
వైపు
మొగ్గు
చూపుతున్నారు.


పెట్టుబడి
ఎలా?
ఎవరికీ
అనుకూలం?


స్కీమ్‌లో
పెట్టుబడిని
రూ.1,000తోనే
ప్రారంభించవచ్చు.
సమీపంలోని

పోస్ట్
ఆఫీస్‌లోనైనా
సులభంగా
ఖాతా
తీసుకొవచ్చు.
చిన్న
పిల్లల
పేరుతోనూ,
వృద్ధుల
పేరుతోనూ
ఖాతాలు
తెరవడానికి
అవకాశం
ఉంది.
మొత్తంగా
చెప్పాలంటే,
మార్కెట్
ఊగిసలాటలతో
ఇబ్బంది
పడకుండా,
నిశ్చింతగా
పెట్టుబడి
పెట్టి
స్థిర
లాభాలు
పొందాలనుకునే
వారికి
పోస్ట్
ఆఫీస్
టైమ్
డిపాజిట్
స్కీమ్

సమయంలో
మంచి
ఆఫ్షన్
గా
చెప్పవచ్చు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related