India
oi-Syed Ahmed
మన
దేశంలో
అణు
విద్యుత్
రంగాన్ని
మరింత
విస్తరించే
లక్ష్యంతో
ప్రస్తుతం
ఉన్న
అణు
చట్టాల్ని
సవరిస్తూ
కేంద్రం
రూపొందించిన
కొత్త
బిల్లు
శాంతి
(
సస్టైనబుల్
హార్నెసింగ్
అండ్
అడ్వాన్స్‌మెంట్
ఆఫ్
న్యూక్లియర్
ఎనర్జీ
ఫర్
ట్రాన్స్‌ఫార్మింగ్
ఇండియా
)కి
లోక్
సభ
ఆమోదం
తెలిపింది.
విపక్షాల
అభ్యంతరాల
మధ్యే
కేంద్రం
మూజువాణి
ఓటుతో
దీన్ని
నెగ్గించుకుంది.
అణు
రంగంలో
ప్రమాదాలు
జరిగితే
దాని
బాధ్యత
సదరు
కంపెనీలే
తీసుకోవాలన్న
నిబంధనను
సవరిస్తూ
కేంద్రం
ఈ
బిల్లులో
మార్పులు
చేసింది.
భారతదేశ
అణు
బాధ్యత
చట్టాల
కఠినమైన
నిబంధనలు
పరిశ్రమలలో
నిశ్శబ్ద
భయానికి
దారి
తీసిన
నేపథ్యంలో..
కేంద్రం
వారి
ఆందోళనలను
పరిష్కరించడానికి,
అణుశక్తి
రంగంలో
ప్రైవేట్
సంస్ధలకు
దారులు
తెరవడానికి
కొత్త
బిల్లును
తీసుకురావాలని
నిర్ణయించినట్లు
కేంద్ర
మంత్రి
జితేంద్ర
సింగ్
లోక్
సభలో
తెలిపారు.
అయితే
ప్రైవేటు
సంస్ధలకు
ఈ
బిల్లుతో
లభించే
వెసులుబాట్లను
విపక్షాలు
వ్యతిరేకించాయి.
అణు
ప్రమాదాలు
జరిగినప్పుడు
ఆయా
కంపెనీలు
బాధ్యత
తీసుకోకపోతే
ఎలా
అని
ప్రశ్నించాయి.
కేంద్రం
వెనక్కి
తగ్గకపోవడంతో
ప్రతిపక్షాలు
వాకౌట్
చేశాయి.
దీంతో
విపక్షం
లేకుండానే
లోక్‌సభలో
సస్టైనబుల్
హార్నెసింగ్
అండ్
అడ్వాన్స్‌మెంట్
ఆఫ్
న్యూక్లియర్
ఎనర్జీ
ఫర్
ట్రాన్స్‌ఫార్మింగ్
ఇండియా
(శాంతి)
బిల్లును
మూజువాణి
ఓటు
ద్వారా
ఆమోదించారు.
విపక్షాల
అభ్యంతరాలపై
కేంద్రమంత్రి
సమాధానం
ఇస్తూ..
ప్రభుత్వం
ఆపరేటర్‌తో
మాత్రమే
వ్యవహరిస్తుంది,
సరఫరాదారుతో
వ్యవహరించాల్సిన
బాధ్యత
ఆపరేటర్‌పై
ఉంటుందని
తేల్చేశారు.
చిన్న
మాడ్యులర్
రియాక్టర్ల
వంటి
కొత్త
సాంకేతికతలను
ప్రోత్సహించడానికి
రియాక్టర్
పరిమాణంతో
అనుసంధానించిన
గ్రేడెడ్
క్యాప్‌ల
ద్వారా
ఆపరేటర్
బాధ్యతను
హేతుబద్ధీకరించామని
తెలిపారు.
ఇందులో
ఆపరేటర్
బాధ్యత,
ప్రభుత్వం
మద్దతు
ఇచ్చే
ప్రతిపాదిత
అణు
బాధ్యత
నిధి,
అనుబంధ
పరిహారంపై
ఒప్పందంలో
భారత్
భాగస్వామి
కావడం
ద్వారా
అదనపు
అంతర్జాతీయ
పరిహారం
లభిస్తుందని
కేంద్రమంత్రి
జితేంద్ర
సింగ్
తెలిపారు.
పాత
చట్టంలో
ఉన్న
సరఫరాదారు
అనే
పదం
చాలా
విస్తృతమైన
నిర్వచనం
కలిగి
ఉన్నందున
అణు
విద్యుత్
సరఫరాదారులు
మన
దేశానికి
వచ్చేందుకు
జంకారని
తెలిపారు.
ఇప్పుడు
ఆ
భయాలు
తొలగించడానికే
తాము
సవరణలతో
కొత్త
బిల్లు
తెచ్చామన్నారు.


