Business
oi-Lingareddy Gajjala
బంగారం,
వెండి
ధరలు
సామాన్యులకు
చుక్కలు
చూపిస్తున్నాయి..
కొండంత
పెరిగి,
గోరంత
తగ్గుతున్నాయి.
పండుగ
సీజన్
లో
కూడా
తగ్గేదే
లే
అంటూ
రాకెట్
స్పీడ్
తో
దూసుకుపోతున్నాయి.
ఆల్
టైం
రికార్డులను
బ్రేక్
చేస్తూ
పై
పైకి
ఎగబాకడమే
తప్పా..
తగ్గే
వాతావరణం
మాత్రం
కనబడటం
లేదు.
బంగారం,
వెండి
ధరలు
ఇంతలా
పెరగడానికి
అంతర్జాతీయ
రాజకీయ
పరిణామాలు
కారణం.
మరి
అంతర్జాతీయ
అంశాలు
అన్ని
దేశాలపై
ప్రభావం
చూపుతున్న
సమయంలో
ఈ
ధరలు
కూడా
అన్ని
దేశాల్లో
ఒకే
విధంగా
ఉండాలి
కదా..
కానీ
అలా
లేవు.
గోల్డ్,
సిల్వర్
రేట్లు
ఇండియాలో
మోత
మోగిస్తున్నాయి.
మరి
గరిష్ఠ
ధరలు
మన
దగ్గర
ఉంటే
కనిష్ఠ
ధరలు
కూడా
ఎక్కడ
ఉన్నాయో
తెలుసుకోవాలిగా!
ప్రపంచంలో
వెండి
అత్యంత
చౌకగా
లభించే
దేశం
ఏది.
అందుకు
గల
కారణాలేంటో
ఇక్కడ
చూద్దాం.
చిలి
(Chile):
ప్రపంచంలోనే
వెండి
అత్యంత
చౌకగా
లభించే
దేశంగా
చిలి
ముందంజలో
ఉంది.
దక్షిణ
అమెరికాలోని
ఈ
దేశంలో
వెండి
గనులు
అధికంగా
ఉండటం,
లోకల్
ప్రొడక్షన్
ఎక్కువగా
ఉండటం
వల్ల
ధరలు
తక్కువగా
ఉంటున్నాయి.
భారత్‌తో
పోలిస్తే
ఇక్కడ
కిలో
వెండి
ధర
సగటున
రూ.30
వేలు
మాత్రమే.
ఎగుమతులపై
ఆధారపడకుండా
స్వదేశీ
ఉత్పత్తిపైనే
ఎక్కువగా
ఆధారపడటం
చిలిని
‘
వెండి
హబ్’గా
మార్చింది.
రష్యా
(Russia):
సహజ
వనరుల
సంపత్తే
వెండి
ధరలకు
కారణం.
రష్యాలో
వెండి
సహా
అనేక
ఖనిజాలు
విస్తారంగా
లభిస్తాయి.
ప్రభుత్వ
నియంత్రిత
మైనింగ్,
తక్కువ
పన్నులు,
లోకల్
మార్కెట్‌కు
ప్రాధాన్యం
ఇవ్వడం
వల్ల
ఇక్కడ
వెండి
ధరలు
భారత్
కంటే
తక్కువగా
ఉంటాయి.
గ్లోబల్
మార్కెట్
ప్రభావం
ఉన్నప్పటికీ,
దేశీయ
సరఫరా
బలంగా
ఉండటం
ధరలను
నియంత్రణలో
ఉంచుతోంది.
చైనా
(China):
భారీ
ఉత్పత్తి,
భారీ
వినియోగం
మధ్య
కూడా
చౌక
ధరలు.
ప్రపంచంలోనే
అతిపెద్ద
ఇండస్ట్రియల్
యూజర్లలో
చైనా
ఒకటి.
సోలార్
ప్యానెల్స్,
ఎలక్ట్రానిక్స్
రంగాల్లో
వెండి
వినియోగం
ఎక్కువైనా,
అంతే
స్థాయిలో
దేశీయ
ఉత్పత్తి
ఉండటంతో
ధరలు
అదుపులో
ఉంటున్నాయి.
భారత
మార్కెట్‌తో
పోలిస్తే
చైనాలో
కిలో
వెండి
ధర
స్పష్టంగా
తక్కువగా
కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా
(Australia):
మైనింగ్
పవర్‌తో
వెండి
మార్కెట్‌లో
ఆధిక్యం.
ఆస్ట్రేలియా
వెండి
ఉత్పత్తిలో
ప్రపంచంలో
అగ్రదేశాల్లో
ఒకటి.
అధునాతన
మైనింగ్
టెక్నాలజీ,
తక్కువ
ట్రాన్స్‌పోర్ట్
ఖర్చులు,
ఎగుమతులకు
అనుకూల
విధానాలు
ఇక్కడ
వెండి
ధరలను
తగ్గిస్తున్నాయి.
అందుకే
ఆసియా
దేశాలతో
పోలిస్తే
ఆస్ట్రేలియాలో
వెండి
కొనుగోలు
చేయడం
తక్కువ
ఖర్చుతో
సాధ్యమవుతోంది.
భారతదేశం
(India):
అధిక
డిమాండ్,
దిగుమతి
ఆధారిత
మార్కెట్.
భారతదేశంలో
వెండి
ధరలు
ఇతర
దేశాలతో
పోలిస్తే
ఎక్కువగా
ఉండటానికి
ప్రధాన
కారణం
దిగుమతులపై
ఆధారపడటమే.
పరిశ్రమలు,
పెట్టుబడుల
కోసం,
పండుగల
డిమాండ్
అధికంగా
ఉండటంతో
పాటు
దిగుమతి
సుంకాలు,
పన్నులు
ధరను
పెంచుతున్నాయి.
ఫలితంగా
చిలి,
చైనా
వంటి
దేశాల్లో
చౌకగా
లభించే
వెండి
భారత్‌లో
మాత్రం
ఖరీదైన
లోహంగా
మారింది.


