Business
oi-Lingareddy Gajjala
మదుపరుల
పాలిట
వెండి(Silver)
ఇప్పుడు
‘కొత్త
బంగారం’గా
మారుతోంది.
గత
ఏడాది
కాలంలో
పసిడిని
మించి
రెట్టింపు
రాబడులు
అందించిన
వెండికి
దేశీయంగా
డిమాండ్
విపరీతంగా
పెరిగింది.
అయితే,
వెండిని
విక్రయించేటప్పుడు
స్వచ్ఛత
నిర్ధారణలో
ఎదురవుతున్న
సమస్యలకు
చెక్
పెడుతూ,
విలువైన
లోహాల
శుద్ధి
రంగంలో
అగ్రగామి
సంస్థ
అయిన
ఎంఎంటీసీ-పాంప్
(MMTC-PAMP)
వెండి
రీసైక్లింగ్
(Silver
Recycling)సేవలను
ప్రారంభించనుంది.
తద్వారా
పాత
వెండి
ఆభరణాలను
కరిగించి,
వాటి
స్వచ్ఛతను
శాస్త్రీయంగా
నిర్ధారించి
వినియోగదారులకు
గరిష్ట
ప్రయోజనం
చేకూర్చనుంది.
సరఫరా
లోటుకు
వెండి
రీసైక్లింగ్
ఒక్కటే
మార్గం!
ప్రస్తుతం
అంతర్జాతీయంగా
వెండి
ఉత్పత్తి
కంటే
వినియోగం
వేగంగా
పెరుగుతోంది.
ఈ
నేపథ్యంలో
తలెత్తే
సరఫరా
లోటును
పూడ్చడానికి
భారతీయుల
వద్ద
ఉన్న
వెండి
నిల్వలే
ప్రధాన
వనరులని
ఎంఎంటీసీ-పాంప్
ఎండీ,
సీఈఓ
సమిత్
గుహ
తెలిపారు.
దేశవ్యాప్తంగా
ఇళ్లలో
సుమారు
2.5
లక్షల
టన్నుల
వెండి
నిల్వలు
ఉన్నట్లు
అంచనా.
ఈ
భారీ
నిల్వలను
రీసైక్లింగ్
ద్వారా
తిరిగి
మార్కెట్లోకి
తీసుకురావడం
వల్ల
అటు
వినియోగదారులకు,
ఇటు
దేశ
ఆర్థిక
వ్యవస్థకు
ప్రయోజనం
చేకూరుతుందని
ఆయన
వివరించారు.
తొలి
అడుగు
దిల్లీలో..
తర్వాత
దేశవ్యాప్తంగా!
వెండిని
కరిగించడం,
దాని
నాణ్యతను
పరీక్షించే
‘అసేయింగ్’
ప్రక్రియ
కోసం
ప్రత్యేక
పరికరాలు,
శిక్షణ
పొందిన
సిబ్బంది
అవసరం.
పైలట్
ప్రాజెక్ట్
గా
వచ్చే
3-4
నెలల్లో
దిల్లీలోని
విక్రయశాలల
ద్వారా
ప్రయోగాత్మకంగా
వెండి
రీసైక్లింగ్‌ను
ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం
ఉన్న
20
రీసైక్లింగ్
స్టోర్లను
వచ్చే
ఐదేళ్లలో
రెట్టింపు
(40కి)
చేయాలని
సంస్థ
లక్ష్యంగా
పెట్టుకుంది.
ముఖ్యంగా
దక్షిణాది,
తూర్పు
రాష్ట్రాల్లో
కొత్త
స్టోర్లను
ఏర్పాటు
చేయనున్నారు.
అమెజాన్,
ఫ్లిప్‌కార్ట్
వంటి
ఈ-కామర్స్
వేదికల
ద్వారా
నాణేలు,
కడ్డీల
విక్రయాలను
మరింత
వేగవంతం
చేయనున్నారు.
అంతర్జాతీయ
ప్రమాణాలతో
అరుదైన
గుర్తింపు
దేశంలో
పసిడి,
వెండి
స్వచ్ఛతను
నిర్ధారించే
లండన్
బులియన్
మార్కెట్
అసోసియేషన్
(LBMA)
గుర్తింపు
పొందిన
ఏకైక
రిఫైనరీ
ఎంఎంటీసీ-పాంప్
కావడం
విశేషం.
గత
ఆర్థిక
ఏడాదితో
పోలిస్తే
వెండి
దిగుమతులు
గణనీయంగా
పెరిగాయి.
గత
ఏడాది
50
టన్నుల
వెండిని
దిగుమతి
చేసుకోగా,
ఈ
ఏడాది
డిసెంబర్
నాటికే
60
టన్నుల
దిగుమతులు
పూర్తయ్యాయి.
వెండి
నాణేల
తయారీ
సామర్థ్యాన్ని
కూడా
ఏటా
24
లక్షల
నుంచి
36
లక్షలకు
పెంచుకుంటున్నట్లు
సంస్థ
ప్రకటించింది.


