News
oi-Suravarapu Dileep
సైబర్ మోసాల కట్టడి సహా సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై సహా ఇతర మెసేజింగ్ యాప్‌లకు సిమ్ బైండింగ్ ను తప్పనిసరి చేసింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ 2025 నిబంధనలు
ప్రకారం, ఈ మెసేజింగ్ యాప్‌లకు టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) ఆదేశాలు జారీ చేసింది. అంటే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో సిమ్ కార్డు ఉంటేనే ఈ యాప్‌లు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటిలోగా అమల్లోకి రానుందంటే? :
సిమ్ బైండింగ్ (SIM Binding) రూల్స్ ను 90 రోజుల్లోగా అమల్లోకి తీసుకురావాలని సంస్థలకు DoT సూచించింది. ఉదాహరణకు వాట్సాప్ లో ఓ నంబర్ తో అకౌంట్ ను క్రియేట్ చేశారు అనుకుందాం. మీ ఫోన్‌లో ఆ సిమ్ కార్డు ఉంటేనే, ఆ యాప్ పనిచేస్తుంది. లేకుంటే ఆటోమేటిక్ గా లాగౌట్ కానుంది.
ప్రతి 6 గంటలకు లాగౌట్ :
యాప్‌తోపాటు వెబ్‌కు కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయి. కాకుంటే చిన్న మార్పులతో అమలు చేయనున్నారు. కొత్త నిబంధన అమల్లోకి వస్తే, ప్రతి 6 గంటలకు వాట్సాప్ సహా ఇతర యాప్‌ల వెబ్ వెర్షన్ కూడా లాగౌట్ కానుంది. అనంతరం మళ్లీ మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. వాట్సాప్ తోపాటు టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై సహా ఇతర యాప్‌లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
సిమ్ బైండిగ్ రూల్స్ అమల్లోకి వస్తే :
ప్రస్తుతం యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేస్తున్న సమయంలోనే సిమ్ కార్డు ధ్రువీకరణ అవసరం అవుతోంది. అనంతరం సిమ్ కార్డు తొలగించినా లేదా సిమ్ కార్డు డియాక్టివేట్ అయినా ఈ మేసేజింగ్ యాప్‌లను ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. అయితే సిమ్ బైండిగ్ రూల్స్ అమల్లోకి వస్తే.. సిమ్ కార్డును ఉంటేనే ఈ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించుకొనే వీలుంటుంది.
సైబర్ మోసాలు, స్పామ్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ విభాగం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తోందో వేచిచూడాలి. సిమ్ కార్డులు దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.
బ్యాంకింగ్ యాప్‌లు ఇప్పటికే :
సిమ్ బైండింగ్ నిబంధన అమల్లోకి తీసుకొచ్చేందుకు ఈ సంస్థలకు DoT.. 90 రోజుల గడువు ఇచ్చింది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే.. అనేక మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే సహా అనేక బ్యాంకింగ్ యాప్‌లు ఇదే తరహాలో పనిచేస్తు్న్నాయి. అకౌంట్‌కు లింక్ చేసిన సిమ్ కార్డు ఫోన్‌లో ఉంటేనే, యాప్‌లు పనిచేస్తున్నాయి.
ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? :
భద్రతాపరంగా ఈ కొత్త విధానం మేలు చేసే అవకాశం ఉంది. మోసాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సిమ్ బైండింగ్ విధానం ద్వారా నేరాలను కట్టడి చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Best Mobiles in India
English summary
What is SIM Binding, how it will impact whatsapp, telegram, signal, arattai users
Story first published: Monday, December 1, 2025, 15:13 [IST]


