Tirumala: కొండ పైన బంగారం ధర తక్కువ – శ్రీవారి డాలర్లకు భారీ డిమాండ్..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

తిరుమలలో
భక్తుల
రద్దీ
సాధారణంగా
ఉంది.
తిరుమలకు
వస్తున్న
భక్తులు
పెద్ద
ఎత్తున
శ్రీవారి
డాలర్ల
కొనుగోలుకు
ఆసక్తి
చూపుతున్నారు.
బహిరంగ
మార్కెట్
లో
బంగారం
ధరలు
ప్రతీ
రోజు
మారుతున్నాయి.
రికార్డు
స్థాయికి
కొనుగోలు
ధర
చేరింది.
అయితే,
తిరుమలలో
మాత్రం
వారానికి
ఒక్క
సారి
మాత్రమే
బంగారం
ధర
మార్పు
ఉంటుంది.
దీంతో..
పెద్ద
సంఖ్యలో
ఇక్కడే
డాలర్లను
కొనుగోలు
చేస్తున్నారు.
అయితే..

అమ్మకాలు
ఒక
విధంగా
టీటీడీకి
ఆర్దికంగా
నష్టం
వాటిల్లే
అవకాశం
ఏర్పడింది.

కొద్ది
రోజులుగా
తిరుమలలో
శ్రీవారి
డాలర్లకు
భారీ
డిమాండ్
ఏర్పడింది.

అమ్మకాలు
టీటీడీకి
నష్టం
కలిగిస్తోంది.
ఓపెన్
మార్కెట్
లో
బంగారం
ధరలు
భారీగా
పెరుగుతున్నాయి.
తిరుమలలో
మాత్రం
వారానికి
ఒక్క
రోజు
మాత్రమే
బంగారం
ధర
మార్పు
నిర్ణయం
అమలు
చేస్తున్నారు.
దీనికి
కొందరు
అక్రమార్కులు
తమకు
అనుకూలంగా
మలచుకునే
ప్రయత్నం
చేస్తున్నారనే
ఆరోపణలు
ఉన్నాయి.
తిరుమలలో
కొంత
కాలంగా
10,5,2
గ్రాముల
బంగరాం,
50,10,5
గ్రామల
వెండి
డాలర్లను
విక్రయిస్తోంది.

స్వామి,
అమ్మవార్లు
ఉండే

డాలర్లను
శ్రీవారి
సన్నిధిలో
కొనుగోలు
చేస్తే
మంచి
జరుగుతుందని
భక్తుల
విశ్వాసం.
ప్రతీ
మంగళవారం
అర్ద్రరాత్రి
నుంచి
అప్పటి
మార్కెట్
ధర
ప్రకారం
వారం
రోజుల
పాటు
డాలర్లను
టీటీడీ
విక్రయాలకు
ఉంచుతుంది.
గతంలో
బంగారం,
వెండి,
ధరలు
ఎప్పుడో
ఒక
సారి
పెరిగే
విధానం
ఉండటంతో
ఇబ్బంది
ఉండేది
కాదు.
అయితే,
పస్తుతం
వీటి
ధరలు
నిత్యం
పెరుగుతున్నాయి.


అనూహ్య
డిమాండ్

వారానికి
ఒక
రోజు
మాత్రమే
కొండ
పైన
ధరలు
మారుతుండటంతో..
బయటి
మార్కెట్
ధరలకు
ఇక్కడ
రేట్లలో
తేడా
ఉంటోంది.
గత
మంగళవారం
టీటీడీ
22
క్యారెట్ల
10
గ్రాముల
బంగారం
ధర
రూ
1,55855
గా
ఖరారు
చేసింది.
కాగా,
బయట
మార్కెట్
లో
నై
1,58,000గా
ఉంది.
అంటే
టీటీడీ
రూ
2,145
తక్కువకు
విక్రయిస్తోంది.
బయట
ధరలు
ఇంకా
పెరిగినా…
టీటీడీ
నిర్ణయించిన
ధర
మాత్రం
ఫిబ్రవరి
3
వరకు
కొనసాగనుంది.
దీంతో..
టీటీడీకి
నష్టం
వాటిల్లుతోంది.
సాధారణంగా
ఒక
భక్తుడు
ఒకటి
లేదా
రెండు
డాలర్లు
మాత్రమే
తీసుకుంటారు.

అయితే,
ఇటీవల
బయటి
మార్కెట్
లో
పెరుగుతున్న
ధరల
నేపథ్యంలో
తమకు
5
నుంచి
10
డాలర్లు
కావాలని
తిరుమలలో
ఉన్న
డాలర్ల
విక్రయ
కేంద్రాల
కౌంటర్
పైన
ఒత్తిడి
పెరుగుతోంది.
ప్రస్తుతం
బయటి
మార్కెట్..
తిరుమలలో
ధరల
తేడాను
సొమ్ము
చేసుకునేందుకు
కొందరు
ప్రయత్నిస్తున్నట్లు
ఆరోపణలు
ఉన్నాయి.
దీంతో..
ఇప్పుడు
బంగారం
ధరలు
బయటి
మార్కెట్
లో
మారుతున్నవేళ..
టీటీడీకి
నష్టం
లేకుండా
చర్యలు
తీసుకోవాలనే
సూచనలు
అందుతున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related