Trump: మనం మళ్లీ గెలవబోతున్నాం. ప్రపంచాన్ని కొత్త దారిలో పెడతా

Date:


International

-Lingareddy Gajjala

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. సుమారు 100 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రసంగం కేవలం ప్రభుత్వ నివేదికలా కాకుండా, రాబోయే ఎన్నికల ప్రచార అస్త్రంగానూ, అమెరికా పారిశ్రామిక శక్తి ప్రదర్శనగానూ నిలిచింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే చాలా బలంగా ఉందని, తమ పాలనలో దేశంలో తయారీ రంగం, ఉద్యోగాల సృష్టిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “మనం ఎంతగా విజయం సాధించబోతున్నామంటే.. భారీ విజయాలను భరించలేకపోతున్నాం అధ్యక్షా అని ప్రజలే వేడుకునే స్థాయికి దేశాన్ని తీసుకెళ్తాం” అంటూ తనదైన శైలిలో అతిశయోక్తులతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు.

‘సుంకాలు’ దేశ ఆర్థిక ప్రయోజనా కోసమే.. Trump

వాణిజ్య పరంగా ట్రంప్ అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై విధించే ‘సుంకాలు’ అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతున్నాయని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఈ విషయంలో తనకు పార్లమెంటు (కాంగ్రెస్) ఆమోదంతో పనిలేదని, అవసరమైతే ప్రత్యామ్నాయ చట్టాలను ఉపయోగించి ప్రతీకార సుంకాలను విధిస్తానని హెచ్చరించారు. విదేశీ వస్తువులపై విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, అది దేశ ప్రయోజనాలకు విఘాతమని వ్యాఖ్యానించారు. నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఓటు వేస్తే దేశం ధ్వంసం అవుతుందని ఓటర్లను హెచ్చరిస్తూ రాజకీయ వేడిని పెంచారు.

తాను జోక్యం చేసుకోకపోతే.. మళ్లీ అదే పాత పాట.

అంతర్జాతీయ సంబంధాల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ సమస్యను యుద్ధం ద్వారా కాకుండా దౌత్యపరంగా పరిష్కరించడమే తన ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను జోక్యం చేసుకోకపోతే ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగి 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని, ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా తనతో చెప్పారని వెల్లడించారు. ఈ క్రమంలో “నేను లేకపోతే పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారు” అని పొరపాటున నోరు జారినప్పటికీ, వెంటనే తేరుకుని భారీ ప్రాణనష్టం గురించి వివరించారు.

ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్..

ప్రసంగం మధ్యలో సభకు హాజరైన ప్రత్యేక అతిథులను పరిచయం చేయడం ద్వారా ట్రంప్ సభలో ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించారు. యుద్ధ వీరులతో పాటు, కెనడాపై స్వర్ణ పతకం సాధించిన అమెరికా హాకీ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గోల్‌కీపర్ హెల్‌బ్యూక్‌కు అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను అక్కడికక్కడే ప్రకటించారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా, క్రీడలు మరియు జాతీయ గౌరవం విషయంలో దేశమంతా ఏకతాటిపై ఉండాలని తన ప్రసంగం ద్వారా ట్రంప్ సందేశాన్ని ఇచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related