TTD: వైకుంఠ ద్వాదశి వేళ తిరుమలలో అరుదైన ఘట్టం, భక్తులకు గోల్డెన్ ఛాన్స్..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

Tirumala:
తిరుమలలో
భక్తుల
రద్దీ
కొనసాగుతోంది.
వైకుంఠ
ద్వార
దర్శనం
రెండో
రోజు
భక్తులు
స్వామి
వారిని
దర్శించుకుంటున్నారు.
వైకుంఠ
ద్వాదశి
పర్వదినాని
పురస్కరించుకొని
చక్రస్నాన
మహోత్సవాన్ని
టీటీడీ
శాస్త్రోక్తంగా
నిర్వహించింది.
తెల్లవారుజామున
శ్రీవారి
మూలవిరాట్టుకు
ప్రాతఃకాల
కైంకర్యాలు
ముగిసిన
అనంతరం
గర్భాలయం
నుంచి
శ్రీవారి
సుదర్శన
చక్రాన్ని
అర్చకులు
ఆలయం
వెలుపలకు
తీసుకొచ్చారు.
పల్లకిలో
మాడవీధిలో
ఊరేగింపుగా
పుష్కరిణికి
తీసుకెళ్లారు.
వరాహస్వామి
ఆలయ
ప్రాంగణంలో
సుదర్శన
చక్రానికి
సుగంధపరిమళ
ద్రవ్యాలతో
అభిషేకాన్ని
నిర్వహించారు.

తిరుమలలో
వరుస
కార్యక్రమాలు
కొనసాగుతున్నాయి.
వేదమంత్రోచ్ఛరణల
మధ్య
శుభము
హూర్తం
లో
పుష్కరిణిలో
చక్రాన్ని
మూడుసార్లు
ముంచడంతో
ద్వాదశి
చక్రస్నాన
ఉత్సవం
ముగిసింది.

కార్యక్రమంలో
వందలాది
భక్తులు,
టీటీడీ
అధికారులు,
సిబ్బంది
పాల్గొన్నారు.
మరోవైపు
ముక్కోటి
ఏకాదశిని
పురస్కరించుకుని
తిరుమల
శ్రీవేంకటేశ్వర
స్వామివారిని
భక్తులు
వైకుంఠ
ద్వారం
ద్వారా
దర్శించుకున్నారు.
పది
రోజుల
పాటు
కొనసాగే

దర్శన
భాగ్యం
మంగళవారం
గోవిందనామ
స్మరణల
మధ్య
ప్రారంభమైంది.
సోమవారం
అర్ధరాత్రి
దాటాక
12.05
గంటలకు
టీటీడీ
అధికారులు,
అర్చకులు
శ్రీవారి
ఆలయం
తెరచి,
మూలమూర్తికి
ధనుర్మాస
కైంకర్యాలు
పూర్తిచేశారు.
అనంతరం
వీవీఐపీలు,
వీఐపీలకు
వైకుంఠ
ద్వారం
మీదుగా
దర్శనాలు
ప్రారంభించారు.
ఉదయం
7.20
గంటలకు
ఈ-డిప్‌లో
టోకెన్లు
పొందిన
భక్తులను
సర్వదర్శనానికి
అనుమతించారు.


పర్వదినం
సందర్భంగా
తిరుమాడ
వీధుల్లో
స్వర్ణ
రథోత్సవం
వైభవంగా
జరిగింది.
ఉదయం
9
నుంచి
10.30
గంటల
వరకు
శ్రీదేవి,
భూదేవి
సమేత
శ్రీమలయప్ప
స్వామివార్లకు
రథరంగ
డోలోత్సవాన్ని
నేత్రపర్వంగా
నిర్వహించారు.
పెద్దసంఖ్యలో
మహిళలు,
భక్తులు
రథాన్ని
లాగారు.
శ్రీవారి
ఆలయంతో
పాటు
తిరుమల
వ్యాప్తంగా
ప్రత్యేక
అలంకరణలు
భక్తులను
మంత్రముగ్ధులను
చేస్తున్నాయి.
ఆలయ
మహద్వారం
నుంచి
ధ్వజస్తంభం
వరకు,
వైకుంఠ
ద్వారంలో
సంప్రదా
యం
ఉట్టిపడేలా
పలురకాల
పండ్లు,
సువాసనలు
వెదజల్లే
రంగురంగుల
పుష్పాలు,
పత్రాలతో
శోభాయమానంగా
తీర్చిదిద్దారు.
ప్రధాన
ఆలయం,
బయట
క్యూలైన్లలో
పరిస్థితిని
టీటీడీ
ఎప్పటి
కి
అప్పుడు
పర్యవేక్షిస్తూ..
అవసరమైన
నిర్ణయాలు
తీసుకుంటున్నారు.
భక్తులకు
ఎలాంటి
ఇబ్బంది
లేకుండా
చర్యలు
చేపడుతున్నట్లు
వెల్లడించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related