India
oi-Lingareddy Gajjala
దేశ
ఆర్థిక
గమనాన్ని
నిర్ణయించే
2026-27
ఆర్థిక
సంవత్సర
కేంద్ర
బడ్జెట్
2026
(
Union
Budget
2026)
సమావేశాలకు
(Parliament
Budget
Session
2026)
రంగం
సిద్ధమైంది.
రేపటి
నుంచి
ఈ
సమావేశాలు
ప్రారంభం
కానున్న
నేపథ్యంలో,
ఉభయ
సభల
కార్యకలాపాలు
సజావుగా
సాగేలా
చూసేందుకు
కేంద్ర
ప్రభుత్వం
నేడు
అఖిలపక్ష
సమావేశాన్ని
ఏర్పాటు
చేసింది.
అఖిలపక్ష
భేటీకి
పార్లమెంటరీ
వ్యవహారాల
శాఖ
మంత్రి
కిరెన్
రిజిజు
నేతృత్వం
వహించగా..
రక్షణ
మంత్రి
రాజ్‌నాథ్
సింగ్
అధ్యక్షత
వహించారు.
ఈ
భేటీలో
ప్రధానంగా
సభా
షెడ్యూల్,
చర్చించాల్సిన
బిల్లులు..
ప్రతిపక్షాలు
లేవనెత్తే
అంశాలపై
సమన్వయంపై
చర్చించారు.
బడ్జెట్
వంటి
కీలక
సమయంలో
సభలో
గందరగోళం
లేకుండా,
నిర్మాణాత్మక
చర్చలు
జరిగేలా
సహకరించాలని
ప్రభుత్వం
అన్ని
పార్టీలను
ప్రభుత్వం
కోరింది.
ప్రతిపక్షాల
సన్నద్ధత..
ప్రభుత్వ
పిలుపుపై
కాంగ్రెస్
స్పందిస్తూ..
తాము
చర్చలకు
సిద్ధమని
ప్రకటించింది.
బడ్జెట్
సెషన్‌లో
ప్రజల
ప్రయోజనాలు,
నిరుద్యోగం,
ద్రవ్యోల్బణం
వంటి
కీలక
అంశాలను
ప్రధానంగా
ప్రస్తావిస్తామని
కాంగ్రెస్
నేత
కే.
సురేష్
పేర్కొన్నారు.
ప్రజా
సమస్యలపై
నిలదీస్తూనే,
సభా
మర్యాదలకు
భంగం
కలగకుండా
వ్యవహరిస్తామని
ప్రతిపక్ష
నేతలు
సంకేతాలిచ్చారు.
రెండు
దశల్లో
సమావేశాలు..
ఈసారి
బడ్జెట్
సమావేశాలు
రెండు
విడతలుగా,
మొత్తం
30
రోజుల
పాటు
జరగనున్నాయి.
మొదటి
దశలో
భాగంగా
రేపు
జనవరి
28
నుంచి
ఫిబ్రవరి
13
వరకు
కొనసాగుతుంది.
తిరిగి
రెండో
దశ..
మార్చి
9
నుంచి
ప్రారంభమై
ఏప్రిల్
2న
ముగుస్తుంది.
సమావేశాలు
రేపు
(జనవరి
28న)
రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
ఉభయ
సభలను
ఉద్దేశించి
చేసే
ప్రసంగంతో
అధికారికంగా
ప్రారంభమవుతాయి.
అనంతరం
ఫిబ్రవరి
1వ
తేదీన
ఆర్థిక
మంత్రి
నిర్మల
సీతారామన్
పార్లమెంట్‌లో
పూర్తిస్థాయి
బడ్జెట్‌ను
ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్
అజెండా
ఇదే..
ఈ
సెషన్‌లో
ప్రధానంగా
దేశ
ఆర్థికాభివృద్ధి,
కొత్త
పన్ను
విధానాలు,
సామాజిక
భద్రత
మరియు
మౌలిక
సదుపాయాల
కల్పనపై
చర్చలు
జరగనున్నాయి.
అఖిలపక్ష
సమావేశం
ద్వారా
ఒకే
అజెండాపై
ఏకాభిప్రాయానికి
రావడం
వల్ల
శాసన
సంబంధిత
పనుల్లో
ఆటంకాలు
తొలగిపోతాయని
ప్రభుత్వం
భావిస్తోంది.
ఎన్నికల
ముగిసిన
తర్వాత
వస్తున్న
పూర్తిస్థాయి
బడ్జెట్
కావడంతో,
సామాన్యుల
నుంచి
పారిశ్రామికవేత్తల
వరకు
ఈ
సమావేశాలపై
భారీ
ఆశలు
పెట్టుకున్నారు.


