Video: వైఎస్ జగన్ కు దువ్వాడ శ్రీనివాస్ ఎమోషనల్ మెసేజ్..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

వైఎస్సార్సీపీ
అధినేత
వైఎస్
జగన్
మోహన్
రెడ్డికి
(ys
jagan
mohan
reddy)
పుట్టినరోజు
సందర్భంగా
పార్టీ
నేతలు
ఇప్పటికే
గ్రీటింగ్స్
చెప్పడం
మొదలుపెట్టేశారు.
దేశ,
విదేశాల్లో
ఉన్న
అభిమానులు,
పార్టీ
కార్యకర్తలు,
నేతలు
శుభాకాంక్షలు
చెప్తున్నారు.
ఇదే
క్రమంలో
ఆయనకు

ఊహించని
నేత
నుంచి
వీడియో
మెసేజ్
అందింది.
అదీ
బహిరంగంగానే.
ఇందులో
సదరు
నేత
చెప్పిన
అంశాలు
అభిమానుల్ని
ఆలోచనలో
పడేశాయి.

వైసీపీ
హయాంలో
టెక్కలి
నుంచి
రాజకీయాలు
నడిపిన
దువ్వాడ
శ్రీనివాస్
(duvvada
srinivas)ను
జగన్
ఎమ్మెల్సీని
చేశారు.
అయితే
అప్పటికే
జిల్లాలో
పాతుకుపోయి
ఉన్న
ధర్మాన
సోదరులు
ఆయనకు
అడుగడుగునా
అడ్డుపడ్డారు.
దీంతో
ధర్మాన
సోదరుల్ని
ఎదిరించేందుకు
తీవ్ర
ప్రయత్నాలు
చేశారు.
జిల్లాలో
టీడీపీ
సీనియర్
నేత
అచ్చెన్నాయుడుతో
వీరిద్దరూ
కుమ్మక్కయ్యారని
ఆరోపణలు
కూడా
చేశారు.
దీంతో
క్షమశిక్షణా
చర్యల
కింద
దువ్వాడ
శ్రీనివాస్
ను
వైసీపీ
సస్పెండ్
చేసేసింది.

అయినా
వైఎస్
జగన్
పై
తనకున్న
అభిమానం
తగ్గలేదని
దువ్వాడ
శ్రీనివాస్,
ఆయన
ప్రేయసి
దివ్వెల
మాధురి
నిరూపించుకుంటూనే
ఉన్నారు.
ఇదే
క్రమంలో
రేపు
(ఆదివారం)
జగన్
పుట్టినరోజు
సందర్భంగా
దువ్వాడ
శ్రీనివాస్

వీడియో
మెసేజ్
విడుదల
చేశారు.
ఇందులో
దువ్వాడ
జగన్
కు
పుట్టినరోజు
సందర్భంగా
శుభాకాంక్షలు
తెలిపారు.
దీంతో
పాటు
పలు
ఎమోషనల్
కామెంట్స్
కూడా
చేశారు.


భగవంతుడు
మళ్లీ
జగన్
కు
రాజయోగం
ఇవ్వాలని,
ఆయన
బడుగు,
బలహీన,
శ్రామిక,
తాడిత,
పీడిత,
కర్షక
వర్గాలకు
అందించిన
సేవలు,
విద్య,
ఆరోగ్యం,
వ్యవసాయం
చారిత్రాత్మకమైనవని
దువ్వాడ
శ్రీనివాస్
తెలిపారు.
మళ్లీ
వాటికి
పూర్వవైభవం
రావాలని,
భగవంతుడు
ఆయన్ను
చల్లగా
చూడాలని
ఆయన
అభిమానిగా
కోరుకుంటున్నట్లు
దువ్వాడ
తెలిపారు.
మరోవైపు
ఇప్పటికే
వైసీపీ
నుంచి
సస్పెండ్
చేసినా
ధర్మాన
సోదరులపై
వార్
కొనసాగిస్తున్న
దువ్వాడ..
జగన్
ను
మాత్రం
పొగుడుతూ
వీడియోలు
చేయడం
చూస్తుంటే
భవిష్యత్తులో
తిరిగి
పార్టీలోకి
వచ్చేందుకు
ప్రయత్నిస్తున్నారా
అన్న
చర్చ
జరుగుతోంది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related