Science Technology
oi-Syed Ahmed
అంతరిక్ష
ప్రయోగాల
కోసం
ప్రైవేట్
రంగానికి
తలుపులు
తెరిచిన
కేంద్రం..
ఇందులో
భాగంగా
దేశంలో
జరుగుతున్న
పరిశోధనల్ని
కూడా
ప్రోత్సహిస్తోంది.
ఇందులో
భాగంగా
స్కైరూట్
ఏరోస్పేస్
సంస్థ
హైదరాబాద్
లో
నిర్మించిన
ఇన్ఫినిటీ
క్యాంపస్
ను
ప్రధాని
మోడీ
ఇవాళ
ఢిల్లీ
నుంచి
వర్చువల్
గా
ప్రారంభించారు.
అనంతరం
దేశంలోనే
తొలి
ప్రైవేట్
రాకెట్
విక్రమ్-1ను
కూడా
ఆవిష్కరించారు.
హైదరాబాద్
లోని
ఇమారత్
లో
స్కైరూట్
ఏరోస్పేస్
సంస్థ
ఈ
క్యాంపస్
ను
అభివృద్ధి
చేసింది.
ఇందులోనే
తొలి
దేశీయ
ప్రైవేట్
రాకెట్
విక్రమ్
1
అభివృద్ధి
చేస్తున్నారు.
దీన్ని
ఇవాళ
ప్రధాని
మోడీ
ఆవిష్కరించారు.
ఇది
లో
ఎర్త్
ఆర్బిట్‌లోకి
బహుళ-ఉపగ్రహ
విస్తరణ
సామర్థ్యం
కలిగి
ఉంటుంది.
2
లక్షల
చదరపు
అడుగుల
ఈ
క్యాంపస్
నెలవారీ
ప్రయోగ
సామర్థ్యంతో
ఎండ్-టు-ఎండ్
రాకెట్
ఉత్పత్తికి
అనుకూలంగా
ఏర్పాటు
చేశారు.
అంతరిక్ష
ప్రయోగాల
పితామహుడు
డాక్టర్
విక్రమ్
సారాభాయ్
పేరు
మీద
అధునాతన
కార్బన్-ఫైబర్
టెక్నాలజీతో
విక్రమ్-I
ప్రైవేట్
రాకెట్
ను
తయారు
చేశారు.
ప్రపంచ
చిన్న
ఉపగ్రహ
మార్కెట్‌ను
లక్ష్యంగా
చేసుకుని
దీన్ని
అభివృద్ధి
చేసారు.
తొలి
దేశీయ
ప్రైవేట్
రాకెట్
విక్రమ్-1
ను
ఓ
సాంకేతిక
అద్భుతంగా
చెప్తున్నారు.
ఇది
తక్కువ
ఎత్తు
భూకక్షకు
దాదాపు
300
కిలోల
పేలోడ్‌లను
మోసుకెళ్లడానికి
వీలుగా
తయారు
చేశారు.
ఈ
శ్రేణిలో
ఇతర
రాకెట్లకు
భిన్నంగా
పూర్తిగా
కార్బన్-ఫైబర్
బాడీతో
దీన్ని
నిర్మించారు.
మాజీ
ఇస్రో
శాస్త్రవేత్తలు
ఉమ్మడిగా
స్థాపించిన
స్కైరూట్
ఏరోస్పేస్
సంస్ద..
2030
నాటికి
భారతదేశాన్ని
అంతరిక్ష
ప్రయోగాల్లో
మేటిగా
నిలబెట్టాలనే
లక్ష్యంతో
పనిచేస్తోంది.
ఇవాళ
ఈ
కార్యక్రమాల్లో
వర్చువల్
గా
పాల్గొన్న
ప్రధాని
మోడీ..
దశాబ్దాలుగా
భారతదేశ
అంతరిక్ష
ప్రయాణానికి
శక్తినిచ్చినందుకు
ఇస్రోను
ప్రశంసించారు.
దాని
విశ్వసనీయత,
సామర్థ్యం,
ప్రత్యేకమైన
ప్రపంచ
గుర్తింపును
రూపొందించడంలో
విలువైన
సంస్థగా
దీన్ని
అభివర్ణించారు.
ప్రైవేట్
రంగంలో
వేగంగా
అభివృద్ధి
చెందుతున్న
అంతరిక్ష
రంగంలో
ఎన్నో
అవకాశాలు
రాబోతున్నాయని
ప్రధాని
తెలిపారు.
యువత
ఆవిష్కరణలు,
రిస్క్
తీసుకోవడం
,
వ్యవస్థాపకత
కొత్త
శిఖరాలకు
చేరుకుంటున్నాయని
మోడీ
పేర్కొన్నారు.


