India
oi-Lingareddy Gajjala
ప్రేమగా
పెంచుకుంటున్న
పిల్లి
పోయింది.
గుర్తు
తెలియని
వ్యక్తి
పిల్లిని
దొంగలించాడని
పోలీసులకు
ఫిర్యాదు
కూడా
అందింది.
అంతే
ఆ
వ్యక్తికి
ఆ
పిల్లిపై
ఉన్న
ప్రేమతో
పోలీసులు
హుటాహుటిన
కేసు
ఫైల్
చేశారు.
అంతేనా
వెంటనే
పోలీసులు
కూడా
దాని
కోసం
గాలించే
పనిలో
పడ్డారు.
ప్రస్తుతం
ఈ
వార్త
సోషల్
మీడియాలో
వైరల్
గా
మారింది.
ఇంతకి
ఈ
పిల్లి
కథేంటి.
కేసు
బుక్
చేసి
గాలిస్తున్న
పోలీసులు
ఎవరు?
బీహార్
రాష్ట్రంలో
వింత
కేసు
నమోదైంది.
ఈ
కేసు
ఇప్పుడు
సోషల్
మీడియాలో
చర్చనీయాశంగా
మారింది.
బీహార్
లోని
మిస్కాట్
రామ్నా
ప్రాంతంలో
నివాసం
ఉండే
రాజేశ్
కుమార్
ఒక
పిల్లిని
గత
కొంత
కాలంగా
అల్లారుముద్దుగా
పెంచుకుంటున్నాడు.
రోజూ
తనతో
పాటే
నిద్ర
లేచే
తన
పిల్లి
ఈ
నెల
24
ఉదయం
నిద్రలేచే
సరికి
మాయమైంది.
పిల్లి
కోసం
ఇంటి
చుట్టుపక్కన
అంతా
వెతికాడు.
తాను
నివాసం
ఉండే
ప్రాంతం
అంతా
పిల్లి
కోసం
ఆరా
తీశాడు.
రోజంతా
వెతికినా
పిల్లి
జాడ
తెలియకపోయే
సరికి
దాన్ని
ఎవరో
దొంగిలించారని,
దాన్ని
వెతికిపెట్టి
తనకు
అప్పగించాలని
మోతిహారి
పోలీస్
స్టేషన్లో
రాజేశ్
ఫిర్యాదు
చేశాడు.
పిల్లి
వివరాలు..
ఫిర్యాదులో
పేర్కొన్న
అంశాలు..
బంగారు
రంగులో
ఉండే
మగ
పిల్లిని
గుర్తు
తెలియని
వ్యక్తి
దొంగిలించాడు.
ఈ
పిల్లి
మా
కుటుంబ
సభ్యుడిగా
మారిపోయింది.
పిల్లి
కనిపించకుండా
పోయినప్పటి
నుంచి
మా
కుటుంబం
బాధతో
ఉంది,
పిల్లి
దొంగతనం
మమ్మల్ని
తీవ్రంగా
కలవరపడుతోంది.
ఇరుగుపొరుగు
ఇళ్లు,
వీధులు,
పరిసర
ప్రాంతాల్లో
ఎంత
వెతికినా
పిల్లి
ఆచూకీ
దొరకలేదు.
గత
ఆర్నెల్లుగా
పిల్లి
మా
ఇంట్లో
నివసిస్తోంది.
అది
చాలా
స్వేచ్ఛగా
తిరిగేది.
అప్పుడప్పుడు
బయటకు
వెళ్లి
వచ్చేది.
కొన్ని
సార్లు
ఉదయం
వెళ్లి
సాయంత్రానికి
ఇంటికి
తిరిగి
వచ్చేసేది.
డిసెంబర్
24న
ఇంటి
నుంచి
బయటకు
వెళ్లిన
మా
పిల్లి
మళ్లీ
తిరిగి
ఇంటికి
రాలేదు.
నా
పెంపుడు
పిల్లికి
కుడి
కంటి
నుంచి
కొద్దిగా
నీరు
కారుతుంది.
ఎవరో
దానిని
దొంగిలించారని
అనుమానంగా
ఉంది”
అని
రాజేశ్
కుమార్
ఫిర్యాదులో
రాశాడు.
ఇప్పుడు
ఈ
కంప్లయింట్
కాపీ
కూడా
సోషల్
మీడియాలో
చక్కర్లు
కొడుతుంది.
పోలీసుల
దర్యాప్తు..
సోషల్
మీడియాలో
ట్రోల్స్
రాజేశ్
కుమార్
ఫిర్యాదు
పై
మోతిహారి
పోలీసులు
స్పందించారు.
ఈ
ఘటనపై
దర్యాప్తు
జరుగుతోందని..
సీసీటీవీ
ఫుటేజ్‌లను
పరిశీలిస్తున్నామని
మోతిహారి
పోలీస్
స్టేషన్
ఇన్ఛార్జ్
రాజీవ్
రంజన్
తెలిపారు.
పిల్లి
దొంగతనం
జరగడం,
దాని
ఎఫ్ఐఆర్
బుక్
కావడం..
పోలీసులు
వెంటనే
రంగంలోకి
దిగి
సీసీటీవీ
పరిశీలించండంపై
సోషల్
మీడియాలో
ట్రోలింగ్స్
జరుగుతున్నాయి.
బీహార్
లాంటి
రాష్ట్రంలో
వ్యక్తుల
ఆచూకి
గల్లంతవుంటే
పట్టించుకోని
పోలీసులు
పిల్లిని
పట్టుకోవడానికి
రంగంలోకి
దిగారంటూ
పలువురు
విమర్శిస్తున్నారు.
ఇదీ
బీహార్
పోలీసింగ్
అంటూ
సెటైర్లు
కూడా
వేస్తున్నారు.
మరోవైపు
పెంపుడు
జంతువుల
దొంగతనం
జరిగితే
జంతువులపై
క్రూరత్వ
నిరోధక
చట్టం
కింద
ఫిర్యాదు
చేయవచ్చని
న్యాయ
నిపుణులు
చెబుతున్నారు.


